Share News

Railway Board : అయ్యప్ప భక్తులకు శుభవార్త..!

ABN , Publish Date - Sep 16 , 2024 | 03:30 AM

అయ్యప్ప భక్తులకు శుభవార్త..! శబరిమలకు వెళ్లే భక్తుల సౌకర్యార్థం చెంగనూరు నుంచి పంపాబేస్‌ వరకు హైస్పీడ్‌ రైల్వే లైన్‌ను నిర్మించేందుకు రైల్వే బోర్డు ఆమోదముద్ర వేసింది.

Railway Board : అయ్యప్ప భక్తులకు శుభవార్త..!

  • చెంగనూరు-పంపా రైల్వేలైన్‌కు రైల్వే బోర్డు పచ్చజెండా

  • కేంద్ర క్యాబినెట్‌ ఆమోదమే తరువాయి

తిరువనంతపురం, సెప్టెంబరు 15: అయ్యప్ప భక్తులకు శుభవార్త..! శబరిమలకు వెళ్లే భక్తుల సౌకర్యార్థం చెంగనూరు నుంచి పంపాబేస్‌ వరకు హైస్పీడ్‌ రైల్వే లైన్‌ను నిర్మించేందుకు రైల్వే బోర్డు ఆమోదముద్ర వేసింది. ఈ ఆర్థిక సంవత్సరంలోనే పనులను ప్రారంభించనున్నట్లు ప్రకటించింది. ఇప్పటి వరకు తెలుగు రాష్ట్రాల భక్తులు కోటాయం, ఎర్నాకుళం లేదా చెంగనూరు వరకు రైళ్లలో వెళ్లి అక్కడి నుంచి ప్రైవేటు వాహనాలు/కేఎ్‌సఆర్టీసీ బస్సుల్లో పంపాబే్‌సకు చేరుకునేవారు. ఈ ప్రాంతాల నుంచి రోడ్డు మార్గంలో పంపాకు దూరం 100 కిలోమీటర్లలోపే ఉన్నా.. ఘాట్‌ సెక్షన్ల కారణంగా కనీసం 4గంటల సమయం పడుతుంది. చెంగనూరు నుంచి పంపాకు రైల్వేలైన్‌ పూర్తయితే తెలుగు రాష్ట్రాల నుంచి నేరుగా పంపాబేస్‌ వరకు రైళ్లలో వెళ్లవచ్చు. కేంద్ర క్యాబినెట్‌ ఆమోద ముద్ర పడిన వెంటనే నిర్మాణ పనులు ప్రారంభమవుతాయని అధికారులు తెలిపారు. ఈ రూట్‌లో వందేభారత్‌ మోడల్‌ రైళ్లను నడుపుతామన్నారు.

Updated Date - Sep 16 , 2024 | 03:30 AM