Jammu and Kashmir Assembly Elections: అలా చేసుంటే.. పాక్‌కు పెద్ద ఆర్థిక ప్యాకేజీ ఇచ్చేవాళ్లం: రాజ్‌నాథ్ సింగ్
ABN , Publish Date - Sep 29 , 2024 | 06:28 PM
జమ్మూకశ్మీర్ అభివృద్ధి కోసం కేంద్రం నిధులు ఉస్తుంటే, పాకిస్థాన్ మాత్రం చాలాకాలంగా ఆర్థిక సాయాన్ని దుర్వినియోగం చేస్తోందని కేంద్ర రక్షణ శాఖ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ ఆరోపించారు. సొంతగడ్డపై ఉగ్రవాద ఫ్యాక్టరీని నడిపేందుకు ఇతర దేశాల నుంచి పాకిస్థాన్ డబ్బులు కోరుతోందన్నారు.
శ్రీనగర్: పాకిస్థాన్‌పై కేంద్ర రక్షణ శాఖ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ (Rajnath Singh) కీలక వ్యాఖ్యలు చేశారు. న్యూఢిల్లీతో పాక్ సత్సంబంధాలు కొనసాగించి ఉంటే బెయిల్అవుట్ ప్యాకేజీ కింద అంతర్జాతీయ ద్రవ్య నిధి (IMF) నుంచి ఇస్లామాబాద్ కోరినదాని కంటే పెద్ద ఆర్థిక ప్యాకేజీని ఇండియా ఇచ్చి ఉండేదని అన్నారు. జమ్మూకశ్మీర్ అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో భాగంగా బండిపోర జిల్లాలోని గురేజ్ అసెంబ్లీ సెగ్మెంట్లో ఆదివారంనాడు జరిగిన ఎన్నికల ర్యాలీలో ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు.
''మనం మిత్రులను మార్చగలం కానీ పొరుగువారిని మార్చలేం'' అని మాజీ ప్రధాని అటల్ బిహారీ వాజ్‌పేయి చేసిన వ్యాఖ్యలను ఈ సందర్భంగా రాజ్‌నాథ్ ప్రస్తావిస్తూ, పాక్ సరైన సంబంధాలు కొనసాగించి ఉంటే ఐఎంఎఫ్ కంటే మనమే ఎక్కువ మొత్తంలో ప్యాకేజీ ఇచ్చి ఉండేవాళ్లమని అన్నారు. జమ్మూకశ్మీర్ అభివృద్ధి కోసం కేంద్రం నిధులు ఉస్తుంటే, పాకిస్థాన్ మాత్రం చాలాకాలంగా ఆర్థిక సాయాన్ని దుర్వినియోగం చేస్తోందని ఆరోపించారు. సొంతగడ్డపై ఉగ్రవాద ఫ్యాక్టరీని నడిపేందుకు ఇతర దేశాల నుంచి పాకిస్థాన్ డబ్బులు కోరుతోందన్నారు.
Congress: ప్రసంగిస్తూ స్పృహ కోల్పోయిన ఖర్గే.. మోదీని గద్దె దించే వరకు చనిపోనని శపథం
''టెర్రరిజంపై ఎప్పుడు విచారణ జరిపినా అందులో పాక్ ప్రమేయం కనబడుతూనే ఉంది. ఉగ్ర శిబిరాలను ఆపేయాలని అధికారంలో ఉన్న ప్రభుత్వాలు పాక్‌కు చెప్పిచూసినప్పటికీ ప్రయోజనం లేకపోయింది. 370వ అధికరణ రద్దుతో ఆశాభంగం కలిగిన పాక్ ఉగ్రవాదాన్ని పునరుద్ధరించే ప్రయత్నాలు సాగిస్తోంది. ఇక్కడ ప్రజాస్వామ్యం వెళ్లూనుకోవడం ఆ దేశానికి ఇష్టం లేదు. కానీ సొంతగడ్డపైనే పాక్‌కు గుణపాఠం చెప్పగలిగే సత్తా ఇండియాకు ఉంది. పాకిస్థాన్‌లోని ఎవరైనా ఇండియాపై దాడికి తలబడితే సరిహద్దులు దాటి మరీ స్పందిస్తా'' అని రాజ్‌నాథ్ తెలిపారు. అటల్ బిహారీ వాజ్‌పేయి చెప్పినట్టు ''మానవత్వం, ప్రజాస్వామ్యం, కశ్మీర్ ప్రజల గుర్తింపు''ను సాధించగలిగితే కశ్మీర్ తిరిగి భూతల స్వర్గం అవుతుందని అన్నారు.
For National News And Telugu News..
ఇది కూడా చదవండి...