Share News

Rath Yatra 2024: పూరి జగన్నాథ్ రథ యాత్రకు ప్రత్యేక రైళ్లు.. ఏపీ నుంచి వెళ్లే రైళ్లివే

ABN , Publish Date - Jul 04 , 2024 | 10:24 AM

ఒడిశాలోని పూరి జగన్నాత్ రథయాత్ర(Rath Yatra 2024) సమయంలో ప్రయాణికుల రద్దీని దృష్టిలో ఉంచుకుని ప్రత్యేక రైళ్లు నడపనున్నట్లు భారతీయ రైల్వే ప్రకటించింది. గుండిచా యాత్ర, బహుద యాత్ర, సునాబేషాపై అన్‌రిజర్వ్‌డ్‌ ప్యాసింజర్‌ స్పెషల్‌ రైళ్లను నడిపేందుకు ఈస్ట్‌కోస్ట్‌ రైల్వేశాఖ నిర్ణయించింది.

Rath Yatra 2024: పూరి జగన్నాథ్ రథ యాత్రకు ప్రత్యేక రైళ్లు.. ఏపీ నుంచి వెళ్లే రైళ్లివే

భువనేశ్వర్: ఒడిశాలోని పూరి జగన్నాత్ రథయాత్ర(Rath Yatra 2024) సమయంలో ప్రయాణికుల రద్దీని దృష్టిలో ఉంచుకుని ప్రత్యేక రైళ్లు నడపనున్నట్లు భారతీయ రైల్వే ప్రకటించింది. గుండిచా యాత్ర, బహుద యాత్ర, సునాబేషాపై అన్‌రిజర్వ్‌డ్‌ ప్యాసింజర్‌ స్పెషల్‌ రైళ్లను నడిపేందుకు ఈస్ట్‌కోస్ట్‌ రైల్వేశాఖ నిర్ణయించింది. ఎనిమిది ప్యాసింజ‌ర్ రైళ్లు నడపనుంది.

  • పలాస-పూరీ స్పెష‌ల్‌ (08331) హరిపూర్‌గ్రామ్ రైలు అర్గుల్ మీదుగా పలాస నుంచి ఈ నెల 7, 15, 17 వరకు అందుబాటులో ఉంటుంది. ఈ రైలు పలాసలో రాత్రి12.15 గంటలకు బయలుదేరి ఉదయం 5.35కు పూరీ చేరుకుంటుంది. పూరీ-పలాస స్పెషల్ ట్రైన్ (08332) ఈ నెల 8, 16, 18 తేదీల్లో అందుబాటులో ఉంటుంది. పూరీలో ఉదయం 4 గంటలకు బయలుదేరి అదేరోజు ఉదయం 10.05 గంటలకు పలాసకు చేరుకుంటుంది.

  • విశాఖపట్నం-పూరీ స్పెషల్‌ (08347) హరిపూర్‌గ్రామ్, అర్గుల్ మీదుగా విశాఖపట్నం నుంచి ఈ నెల 6, 14, 16 తేదీల్లో అందుబాటులో ఉంటుంది. వైజాగ్‌లో మ‌ధ్యాహ్నం 2 గంటలకు బయలుదేరి.. అదేరోజు రాత్రి 10.45గంటలకు పూరీకి చేరుకుంటుంది. పూరీ-విశాఖపట్నం ప్రత్యేక రైలు (08348) ఈ నెల 8, 16, 18 తేదీల్లో అందుబాటులో ఉంటుంది. ఈ ట్రైన్.. పూరీలో రాత్రి 1.45కు బయలుదేరి అదేరోజు ఉద‌యం 10.30కు విశాఖపట్నానికి చేరుకుంటుంది. కొత్తవలస, విజయనగరం, చీపురుపల్లి, సిగడాం, పొందూరు, శ్రీకాకుళం రోడ్, తిలారు, కోటబొమ్మాళి, నౌపడ, పలాస, మందస, సోంపేట, ఇచ్ఛాపురం, బ్రహ్మాపూర్, ఛత్రాపూర్, గంజాం, ఖల్లికోటే, బాలుగావ్, కలుపరఘాట్, నిరాకార్‌పూర్ స్టేషన్లలో ఈ రైళ్లు ఆగుతాయని అధికారులు తెలిపారు.


  • గుణుపూర్-పూరీ స్పెషల్ రైలు (08345/08346) హరిపూర్‌గ్రామ్, అర్గుల్ మీదుగా ఈ నెల 6, 14, 16 తేదీల్లో నడుస్తుంది. గుణుపూర్‌లో రాత్రి 11.00 గంట‌ల‌కు బయలుదేరి మరుసటి రోజు ఉదయం 4.15 గంటలకు పూరీకి చేరుకుంటుంది. పూరీ-గుణుపూర్ (08346) స్పెష‌ల్ రైలు ఈ నెల 7, 15, 17 తేదీల్లో అందుబాటులో ఉంటుంది. ఈ రైలు పూరీలో రాత్రి 9.20 బయలుదేరి.. తరువాతి రోజు ఉదయం 8 గంటలకు గుణుపూర్‌ చేరుకుంటుంది. ఈ రైళ్లు ఆంధ్రప్రదేశ్‌లోని పాత‌ప‌ట్నం, టెక్కలి, నౌపడ, పుండి, పలాస, మందస, సోంపేట, ఇచ్ఛాపురం స్టేషన్లలో ఆగనున్నాయి.

  • జగదల్‌పూర్-పూరీ స్పెషల్ (08349) రైలు హరిపూర్‌గ్రామ్, అర్గుల్, జగదల్‌పూర్ మీదుగా ఈ నెల 6, 14, 16 తేదీల్లో అందుబాటులో ఉంటుంది. ఈ రైలు జ‌గ‌ద‌ల్‌పూర్‌లో ఉద‌యం 11 గంటలకు బయలుదేరి అర్ధరాత్రి 12.45గంటలకు పూరీకి చేరుకుంటుంది. తిరుగుప్రయాణంలో పూరీ-జగ‌ద‌ల్‌పూర్ ప్రత్యేక(08350) రైలు ఈ నెల 8, 16, 18 తేదీల్లో అందుబాటులో ఉంటుంది. ఈ రైలు పూరీ నుంచి అర్ధరాత్రి 12.15 గంటలకు బయలుదేరి.. అదే రోజు మ‌ధ్యాహ్నం 03.10 గంటలకు జగదల్‌పూర్ చేరుకుంటుంది. ఈ రైళ్లు కోట్‌పర్ రోడ్, జైపూర్, కోరాపుట్, దమంజోడి, లక్ష్మీపూర్ రోడ్, టికిరి, రాయగడ, పార్వతీపురం టౌన్, పార్వతీపురం, బొబ్బిలి, విజయనగరం, చీపురుపల్లి, సిగడాం, పొందూరు, శ్రీకాకుళం రోడ్, తిలారు, కోటబొమ్మాళి, నౌపడ, పలాస, మందస, సొంపే, బ్రహ్మపూర్, చత్రపూర్, గంజాం, ఖల్లికోట్, బాలుగావ్, కలుపరఘాట్, నిరాకర్‌పూర్, కైపదర్ రోడ్, అర్గుల్ స్టేష‌న్లలో ఆగుతాయని అధికారులు వెల్లడించారు. ఇవే కాకుండా దేశవ్యాప్తంగా వివిధ ప్రాంతాల నుంచి ప్రత్యేక రైళ్లు అందుబాటులో ఉన్నాయి. ఆ వివరాలను రైల్వే శాఖ అధికారిక వెబ్ సైట్‌లో ఉంచింది.

For Latest News and AP News click here

Updated Date - Jul 04 , 2024 | 10:24 AM