Share News

Sharad Pawar: రాజ్యాంగ పదవిని ఎవరైనా గౌరవించాల్సిందే.. ఖర్గే వాకౌట్‌పై పవార్

ABN , Publish Date - Jul 03 , 2024 | 06:14 PM

రాష్ట్రపతి ప్రసంగానికి ధన్యవాదులు తెలిపే తీర్మానంపై మోదీ మాట్లాడుతుండగా ప్రతిపక్ష నాయకుడు ఖర్గేని మాట్లాడాలనివ్వాలని విపక్ష ఎంపీలు నిరసన వ్యక్తం చేయడం, చివరకు వారు సభ నుంచి వాకౌట్ చేయడంపై ఎన్‌సీపీ-ఎస్‌సీపీ చీప్ శరద్ పవార్ (Sharad Pawar)స్పందించారు. మల్లికార్జున్ ఖర్గే ప్రతిపక్ష నేతగా రాజ్యాంగ పదవిలో ఉన్నందున ఆయనను ప్రధానమంత్రి మోదీ, రాజ్యసభ చైర్మన్ గౌరవించాల్సి ఉంటుందని అన్నారు.

Sharad Pawar: రాజ్యాంగ పదవిని ఎవరైనా గౌరవించాల్సిందే.. ఖర్గే వాకౌట్‌పై పవార్

న్యూఢిల్లీ: రాష్ట్రపతి ప్రసంగానికి ధన్యవాదులు తెలిపే తీర్మానంపై మోదీ మాట్లాడుతుండగా ప్రతిపక్ష నాయకుడు ఖర్గేని మాట్లాడాలనివ్వాలని విపక్ష ఎంపీలు నిరసన వ్యక్తం చేయడం, చివరకు వారు సభ నుంచి వాకౌట్ చేయడంపై ఎన్‌సీపీ-ఎస్‌సీపీ చీప్ శరద్ పవార్ (Sharad Pawar) స్పందించారు. మల్లికార్జున్ ఖర్గే ప్రతిపక్ష నేతగా రాజ్యాంగ పదవిలో ఉన్నందున ఆయనను ప్రధానమంత్రి మోదీ, రాజ్యసభ చైర్మన్ గౌరవించాల్సి ఉంటుందని అన్నారు.


''ఆయన (ఖర్గే) రాజ్యాంగ పదవిలో ఉన్నారు. ప్రధాని కావచ్చు, సభ చైర్మన్ కావచ్చు, ఆయనను గౌరవించాలి. కానీ ఇవాళ ఆ విషయాన్ని విస్మరించారు. ప్రతిపక్షం మొత్తం ఆయనకు (ఖర్గే) మద్దతుగా నిలిచింది. ఆ కారణంగానే మేమంతా వాకౌట్ చేశాం'' అని పవార్ మీడియాతో మాట్లాడుతూ చెప్పారు.

Rajya Sabha Updates: విపక్షాలకు పోరాడే ధైర్యం లేదన్న మోదీ..


మోదీ కొన్ని అవస్తవాలు చెప్పారు..

కాగా, రాష్ట్రపతి ప్రసంగంపై ప్రధాని సభలో మాట్లాడుతున్నప్పుడు కొన్ని అవాస్తవాలు చెప్పారని, దానికి నిరసనగానే విపక్ష సభ్యులు వాకౌట్ చేశారని ఖర్గే తెలిపారు. బీఆర్ అంబేద్కర్‌ను పండిట్ నెహ్రూ అవమానించారంటూ నిన్న లోక్‌సభలో, ఇవాళ రాజ్యసభలో మోదీ పదేపదే చెబుతున్నారని, రాజ్యాంగ సభలో బాబాసాహెబ్ ఏంచెప్పారో, ఆర్ఎస్ఎస్ ఆర్గనైజర్‌లో ఏమి రాసిందో తాను చెప్పాలనుకున్నానని, చైర్మన్‌ను ఎంత అభ్యర్థించినా ఆయన అవకాశం ఇవ్వలేదని ఖర్గే చెప్పారు. అబద్ధాలు చెప్పడం మోదీకి అలవాటుగా మారిందని విమర్శించారు.

మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Updated Date - Jul 03 , 2024 | 06:22 PM