Share News

Russian Embassy : ఏప్రిల్‌ నుంచి భారతీయులను మిలటరీలో చేర్చుకోవట్లేదు

ABN , Publish Date - Aug 11 , 2024 | 03:56 AM

ఉక్రెయిన్‌తో యుద్ధం కోసం రష్యా తన సైన్యంలో భారతీయులను నియమించుకోవడాన్ని భారత ప్రభుత్వం చాలా తీవ్రంగా పరిగణిస్తోందని భారత విదేశీ వ్యవహారాల మంత్రి జైశంకర్‌ చేసిన వ్యాఖ్యలకు ఢిల్లీలోని రష్యా ఎంబసీ స్పందించింది.

 Russian Embassy : ఏప్రిల్‌ నుంచి భారతీయులను మిలటరీలో చేర్చుకోవట్లేదు

  • ఇప్పటికే చేర్చుకున్నవారిని త్వరలోనే విడుదల చేస్తాం: రష్యా ఎంబసీ

న్యూఢిల్లీ, ఆగస్టు 10: ఉక్రెయిన్‌తో యుద్ధం కోసం రష్యా తన సైన్యంలో భారతీయులను నియమించుకోవడాన్ని భారత ప్రభుత్వం చాలా తీవ్రంగా పరిగణిస్తోందని భారత విదేశీ వ్యవహారాల మంత్రి జైశంకర్‌ చేసిన వ్యాఖ్యలకు ఢిల్లీలోని రష్యా ఎంబసీ స్పందించింది. ఈ ఏడాది ఏప్రిల్‌ నుంచి భారతీయులను అలాగే ఇతర దేశాలకు చెందిన వ్యక్తులను తమ మిలటరీలో నియమించుకోవట్లేదని తెలిపింది.

అలాగే ఇప్పటివరకు తమ మిలటరీశాఖల్లో స్వచ్ఛందంగా చేరిన ఇతర దేశస్థులను త్వరలోనే విడుదల చేస్తామని పేర్కొంది. ఉక్రెయిన్‌తో యుద్ధంలో ప్రాణాలను కోల్పోయిన సైనికులకు ఒప్పందం ప్రకారం నష్టపరిహారాన్ని చెల్లిస్తామని తెలిపింది. కాగా, రష్యా మొత్తం 91 మంది భారతీయులను తన సైన్యంలో నియమించుకుందని, వారిలో 8 మంది యుద్ధంలో ప్రాణాలు కోల్పోయారని, 14 మందిని విడుదల చేసిందని, విడుదల కోసం ఇంకా 69 మంది ఎదురుచూస్తున్నారని జైశంకర్‌ చెప్పారు.

Updated Date - Aug 11 , 2024 | 03:56 AM