Ajit Pawar: కుటుంబంలో శరద్ పవార్ చిచ్చుపెట్టారు.. అజిత్ పవార్ భావోద్వేగం
ABN , Publish Date - Oct 28 , 2024 | 06:26 PM
మహాయుతి ప్రభుత్వం తిరిగి అధికారంలోకి వస్తుందని అజిత్ పవార్ ధీమా వ్యక్తం చేశారు. మహాయుతి ప్రభుత్వం అమలు చేస్తున్న పథాలన్నీ ప్రజలకు లబ్ధి చేకూర్చే పథకాలేనని, ఏ పథకాన్ని ఆపేసే ప్రసక్తి లేదని అన్నారు.
పుణె: మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో (Maharashtra Assembly Elections) బారామతి (Baramati) నియోజకవర్గం నుంచి సోమవారంనాడు నామినేషన్ వేసిన ఎన్‌సీపీ చీఫ్ అజిత్ పవార్ (Ajit Pawar) ఆ తర్వాత జరిగిన ఎన్నికల ర్యాలీలో భావోద్వేగానికి గురయ్యారు. కుటుంబంలో శరద్ పవార్ చీలిక తెచ్చారని, తనపై పోటీగా అభ్యర్థిని నిలిపారని ఆవేదన వ్యక్తం చేసారు.
Priyanka Gandhi: మదర్ థెరిస్సా మా ఇంటికి వచ్చారు.. నాటి జ్ఞాపకాలను పంచుకున్న ప్రియాంక
''పొరపాటు చేశానని గతంలో నేను ఒప్పుకున్నాను. ఇప్పడు ఇతరులు కూడా తప్పులు చేస్తున్నట్టు కనిపిస్తోంది. తొలుత భారామతి నుంచి నామినేషన్ వేయడానికి నేను, నా కుటుంబ సభ్యుల మధ్య అంగీకారం కుదిరింది. అయితే అందుకు భిన్నంగా జరిగింది. మా అమ్మగారు నాకు సపోర్ట్‌గా నిలిచారు. అజిత్ పవార్‌కు వ్యతిరేకంగా ఎవరూ నామినేషన్ వేయవద్దని కూడా సలహా ఇచ్చారు. అయినప్పటికీ నాకు వ్యతిరేకంగా ఎవరినో నామినేషన్ వేయమని సాహెబ్ (శరద్ పవార్) ఆదేశాలిచ్చినట్టు నాకు తెలిసింది. కుటుబంలో సాహెబ్ చీలక తెచ్చారు. రాజకీయాలకు ఇంత దిగజారుడుగా ఉండరాదని నేను చెప్పదలచుకున్నాను. తరాలు కలిసి ఉండాలే కానీ, కుటుంబం విడిపోవడానికి ఒక్క నిమిషం కూడా పట్టదు'' అని అజిత్ పవార్ భావోద్వాగానికి గురయ్యారు. బారామతి నుంచి అజిత్ పవార్‌కు పోటీగా ఆయన మేనల్లుడు, శరద్ పవార్ మనుమడు యుగేంద్ర పవార్‌ను ఎన్‌సీపీ-ఎస్‌పీ అభ్యర్థిగా నిలిపారు.
ఎన్నికల్లో మళ్లీ మాదే అధికారం
మహాయుతి ప్రభుత్వం తిరిగి అధికారంలోకి వస్తుందని అజిత్ పవార్ ధీమా వ్యక్తం చేశారు. మహాయుతి ప్రభుత్వం అమలు చేస్తున్న పథాలన్నీ ప్రజలకు లబ్ధి చేకూర్చే పథకాలేనని, ఏ పథకాన్ని ఆపేసే ప్రసక్తి లేదని చెప్పారు. ''నవంబర్ 23 మధ్యాహ్నానికల్లా ఈ ప్రభుత్వం తిరిగి అధికారంలోకి రావడాన్ని మనమంతా చూస్తాం. రైతులకు ఇచ్చిన వాగ్దానాలు నిలుపుకొన్నాం. లాడ్లీ స్కీమ్ వచ్చే ఐదేళ్లు కొనసాగిస్తాం. వాళ్లు (విపక్షాలు) అధికారంలోకి వస్తే వాటిని ఆపేస్తారు. మేము ప్రజల కోసం పనిచేసే వాళ్లం. వాళ్లు అలాంటి వారు కాదు. రాజకీయాల్లో ఎవరైనా పోటీ చేయవచ్చు. భారామతి ప్రజలు మళ్లీ నాకే ఓటు వేస్తారని కచ్చితంగా చెప్పగలను. రోడ్‌షో నిర్వహిస్తున్నప్పుడు వారిలో ఎంతో ఉత్సాహం, నాపై ఆదరణ కనిపించింది. ఓటింగ్ రోజు వరకూ ఇదే ఉత్సాహాన్ని కొనసాగించాలని కోరుతున్నాను'' అని అజిత్ పవార్ అన్నారు.
ఇవి కూడా చదవండి...
టాటా-ఎయిర్‌బస్‌ను ప్రారంభించిన ప్రధాని మోదీ
INDIA Alliance: కాంగ్రెస్-లెఫ్ట్ మధ్య సీట్ల చిచ్చు!
Read More National News and Latest Telugu News