Satyendar Jain: మనీలాండరింగ్ కేసులో సత్యేంద్ర జైన్‌కు బెయిల్ నిరాకరణ
ABN , Publish Date - Jul 09 , 2024 | 06:45 PM
ఆప్ నేత, మాజీ మంత్రి సత్యేంద్ర జైన్‌కు మనీలాండరింగ్ కేసులో ఉపశమనం దక్కలేదు. ఆయనపై ఈడీ దాఖలు చేసిన మనీలాండరింగ్ కేసులో మధ్యంతర బెయిల్ ఇచ్చేందుకు ఢిల్లీ రౌస్ ఎవెన్యూ కోర్టు మంగళవారంనాడు నిరాకరించింది.
న్యూఢిల్లీ: ఆప్ నేత, మాజీ మంత్రి సత్యేంద్ర జైన్ (Satyanedra Jain)కు మనీలాండరింగ్ కేసులో ఉపశమనం దక్కలేదు. ఆయనపై ఈడీ దాఖలు చేసిన మనీలాండరింగ్ కేసులో మధ్యంతర బెయిల్ ఇచ్చేందుకు ఢిల్లీ రౌస్ ఎవెన్యూ కోర్టు మంగళవారంనాడు నిరాకరించింది. వైద్య కారణాల రీత్యా తనకు తాత్కాలిక బెయిల్ మంజూరు చేయాలని సత్యేంద్ర జైన్ కోరినప్పటికీ కోర్టు తోసిపుచ్చింది.
Rahul Gandhi: రాయబరేలి హనుమాన్ ఆలయంలో రాహుల్ పూజలు
కేసు పూర్వాపరాలు..
అవినీతి నిరోధక చట్టం కింద 2017లో సత్యేంద్ర జైన్‌పై సీబీఐ ఎఫ్ఐఆర్ నమోదు చేసింది. దీని ఆధారంగా 2022 మే 30న ఆయనను ఈడీ అరెస్టు చేసింది. సీబీఐ దాఖలు చేసిన కేసులో 2019 సెప్టెంబర్ 6న ట్రయిల్ కోర్టు ఆయనకు రెగ్యులర్ బెయిల్ మంజూరు చేసింది. అయినప్పటికీ మనీలాండరిగింగ్ విచారణలో లీగల్ సవాళ్లను జైన్ ఎదుర్కొంటూనే ఉన్నారు. ఈ క్రమంలోనే ఈడీ దాఖలు చేసిన మనీలాండరింగ్ కేసులో బెయిలు కోరుతూ జైన్ హైకోర్టుకు వెళ్లారు. తన బెయిలు పిటిషన్‌ను హైకోర్టు ఆరు వారాలు వాయిదా వేయడాన్ని సైతం ఆయన సవాలు చేస్తూ సుప్రీంకోర్టును ఆశ్రయించారు. దీంతో జస్టిస్ మనోజ్ మిశ్రా సారథ్యంలోని ధర్మాసనం బెయిల్ వ్యవహారాలను అనవసరంగా వాయిదా వేయొద్దని హైకోర్టుకు సూచిస్తూ, తదుపరి విచారణ తేదీ నాటికి జైన్ బెయిల్ పిటిషన్‌పై నిర్ణయం తీసుకోవాలని పేర్కొంది. దీంతో జైన్ బెయిల్ పిటిషన్‌పై ఢిల్లీ హైకోర్టు జూన్ 28న ఈడీ స్పందన కోరింది. స్టేటస్ రిపోర్ట్ ఇవ్వాలని సూచించిది. తదుపరి విచారణను జూలై 9వ తేదీకి వాయిదా వేసింది.
For Latest News and National News click here