Supreme Court: 36 గంటల్లోగా డిక్లరేషన్ ఇవ్వండి.. అజిత్ పవార్ వర్గానికి సుప్రీం ఆదేశం
ABN , Publish Date - Nov 06 , 2024 | 06:27 PM
అజిత్ పవార్ వర్గానికి గడియారం గుర్తును కేటాయించడాన్ని శరద్ పవార్ నేతృత్వంలోనే ఎన్‌సీపీ-ఎస్‌పీ వర్గం సుప్రీంకోర్టును ఇటీవల ఆశ్రయించింది. దీనిపై గతంలో కోర్టు ఇచ్చిన ఆదేశాలను కూడా అజిత్ వర్గం పాటించలేదని శరద్ పవార్ తరఫు న్యాయవాది అభిషేక్ మను సింఘ్వి కోర్టులో తన వాదనను వినిపించారు.
ముంబై: ఎన్‌సీపీ గుర్తు 'గడియారం' (Clock) వివాదంపై అజిత్ పవార్ (Ajit Pawar) సారథ్యంలోని నేషలిస్ట్ కాంగ్రెస్ పార్టీ (NCP)కి సుప్రీంకోర్టు (Supreme Court) తాజా ఆదేశాలు ఇచ్చింది. గడియారం గుర్తు వివాదం ఇంకా సుప్రీంకోర్టు పరిశీలనలో ఉన్నట్టుగా 36 గంటల్లోగా ప్రముఖ వార్తాపత్రికల్లో, ముఖ్యంగా మరాఠీ భాషా పత్రికల్లో డిక్లరేషన్ ఇవ్వాలని బుధవారంనాడు ఆదేశించింది.
Mithun Chakraborty: మిథున్ చక్రవర్తిపై ఎఫ్ఐఆర్
అజిత్ పవార్ వర్గానికి గడియారం గుర్తును కేటాయించడాన్ని శరద్ పవార్ నేతృత్వంలోనే ఎన్‌సీపీ-ఎస్‌పీ వర్గం సుప్రీంకోర్టును ఇటీవల ఆశ్రయించింది. దీనిపై గతంలో కోర్టు ఇచ్చిన ఆదేశాలను కూడా అజిత్ వర్గం పాటించలేదని, అసలు వివాదంపై స్పష్టత ఇవ్వకుండానే గడియారం గుర్తు వినియోగించుకుంటున్నారని శరద్ పవార్ తరఫు న్యాయవాది అభిషేక్ మను సింఘ్వి కోర్టులో తన వాదనను వినిపించారు. అజిత్ పవార్ వర్గం తమ ఆదేశాలను పాటించడంలో జాప్యం చేస్తుండటాన్ని ధర్మాసనం సైతం గుర్తించింది. 36 గంటల్లోగా గడియారం గుర్తు వివాదం ఇంకా కోర్టు పరిశీలనలోనే ఉన్నట్టు మరాఠీ సహా ప్రముఖ పత్రికల్లో పబ్లిక్ నోటీసులు ఇవ్వాలని, వాటిని కోర్టుకు చూపించాలని ఆదేశించింది. నిర్దిష్ట షరతులకు లోబడి గడియారం గుర్తును వినియోగించుకునేందుకు అజిత్ వర్గాన్ని అనుమతిస్తూ, తదుపరి విచారణను నవంబర్ 13వ తేదీకి వాయిదా వేసింది.
కోర్టులో సమయం వృథా చేయకుండా..
'గడియారం' గుర్తుపై విచారణ సందర్భంగా కోర్టు కీలక వ్యాఖ్యలు కూడా చేసింది. రెండు వర్గాలు (పవార్-అజిత్ వర్గం) కోర్టులో సమయం వృథా చేయకుండా ఓటర్ల మనసు గెలుసుకునేందుకు వారి ముందుకు వెళ్లాలని సూచించింది. నవంబర్ 20న మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికలు ఒకే విడతలో జరుగనున్నాయి.
ఇవి కూాడా చదవండి
PM Modi: నా బెస్ట్ ఫ్రెండ్‌కు విషెస్..మోదీ ట్వీట్
Chief Minister: సీఎం సిద్దరామయ్య ఆసక్తికర కామెంట్స్.. 40 ఏళ్లకిందటే మంత్రిగా పనిచేశా
For More National and telugu News