Whatsapp: వాట్సాప్‌ను బ్యాన్ చేయాలంటూ పిల్.. తిరస్కరించిన సుప్రీం కోర్టు
ABN , Publish Date - Nov 14 , 2024 | 05:39 PM
కేంద్ర ప్రభుత్వం వాట్సాప్‌ను నిషేధించేలా మార్గదర్శకాలు జారీ చేయాలంటూ దాఖలైన ప్రజాప్రయోజన వ్యాజ్యాన్ని సర్వోన్నత న్యాయస్థానం తిరస్కరించింది. ఈ పిల్‌ను విచారణకు స్వీకరించలేమని స్పష్టం చేసింది.
ఇంటర్నెట్ డెస్క్: కేంద్ర ప్రభుత్వం వాట్సాప్‌ను నిషేధించేలా మార్గదర్శకాలు జారీ చేయాలంటూ దాఖలైన ప్రజాప్రయోజన వ్యాజ్యాన్ని సర్వోన్నత న్యాయస్థానం (Supreme Court of India) తిరస్కరించింది. ఈ పిల్‌ను విచారణకు స్వీకరించలేమని స్పష్టం చేసింది.
Supreme Court: బుల్డోజర్ న్యాయానికి సుప్రీం బ్రేక్!
కేరళకు చెందిన ఓమన్‌కుట్టన్ అనే సాఫ్ట్‌వేర్ ఇంజినీర్ ఈ పిల్ దాఖలు చేశారు. ఐటీ చట్టం - 2021 మార్గదర్శకాలకు కట్టుబడని వాట్సాప్‌పై నిషేధం విధించాలని కోరారు. రాజ్యాంగంలో 21 అధీకరణలోని ప్రాథమిక హక్కులను వాట్సాప్ ఉల్లంఘిస్తోందని పిటిషనర్ తన వ్యాజ్యంలో పేర్కొన్నారు. దేశ ప్రయోజనాలకు, భద్రతకు ఈ యాప్ ముప్పుగా మారిందని ఆరోపించారు.
Supreme Court: మీ కాళ్లపై మీరు నిలుచోవడం నేర్చుకోండి.. అజిత్ వర్గానికి సుప్రీం చురకలు
‘‘ప్రభుత్వానికి సహకరించకుండా, తన టెక్నాలజీలో మార్పులకు అంగీకరించని వాట్సాప్‌ను దేశంలో కార్యకలాపాలు కొనసాగించేందుకు అనుమతించకూడదు. దేశ ప్రయోజనాలకు విఘాతం కలిగిస్తున్న అనేక వెబ్‌సైట్స్ యాప్స్‌ను కేంద్రం గతంలో బ్యాన్ చేసింది’’ అని పిటిషనర్ పేర్కొన్నారు. కానీ సుప్రీం కోర్టు మాత్రం ఈ పిల్‌ను తిరస్కరించింది. ఈ విషయంలోొ జోక్యం చేసుకోలేమని పేర్కొంది.