Share News

Supreme court: హేమంత్ సోరెన్‌కు సుప్రీంకోర్టు మందలింపు, మధ్యంతర బెయిల్ నిరాకరణ

ABN , Publish Date - May 22 , 2024 | 02:38 PM

జార్ఖాండ్ మాజీ ముఖ్యమంత్రి హేమంత్ సోరెన్ కు సుప్రీంకోర్టు లో చేదు అనుభవం ఎదురైంది. భూకుంభకోణానికి సంబంధించిన మనీ లాండరింగ్ కేసులో ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ అరెస్టును సవాలు చేస్తూ, 2024 లోక్‌సభ ఎన్నికల్లో ప్రచారం చేసేందుకు మధ్యంతర బెయిల్ ఇవ్వాలంటూ ఆయన దాఖలు చేసుకున్న పిటిషన్‌ను అత్యున్నత న్యాయస్థానం తోసిపుచ్చింది.

Supreme court: హేమంత్ సోరెన్‌కు సుప్రీంకోర్టు మందలింపు, మధ్యంతర బెయిల్ నిరాకరణ

న్యూఢిల్లీ: జార్ఖాండ్ మాజీ ముఖ్యమంత్రి హేమంత్ సోరెన్ (Hemant Soren)కు సుప్రీంకోర్టు (Supreme court)లో చేదు అనుభవం ఎదురైంది. భూకుంభకోణానికి సంబంధించిన మనీ లాండరింగ్ కేసులో ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ED) అరెస్టును సవాలు చేస్తూ, 2024 లోక్‌సభ ఎన్నికల్లో ప్రచారం చేసేందుకు మధ్యంతర బెయిల్ ఇవ్వాలంటూ ఆయన దాఖలు చేసుకున్న పిటిషన్‌ను అత్యున్నత న్యాయస్థానం తోసిపుచ్చింది. దీనితో పాటు ట్రయల్ కోర్ట్ లో బెయిల్ పిటిషన్‌ను దాఖలు చేసిన వాస్తవాన్ని దాచినందుకు హేమంత్ సోరెన్‌ను జస్టిస్ దీపంకర్ దత్తా, సతీష్ చంద్ర శర్మతో కూడిన వెకేషన్ బెంచ్ మందలించింది. అతని ప్రవర్తన మచ్చలేనిదేమీ కాదని పేర్కొంది.

Lok Sabha Polls: హోరాహోరీలో గెలిచేదెవరు.. మెజార్టీ సీట్ల కోసం పార్టీల ప్రయత్నాలు..


''మీ ప్రవర్తన చాలా చెబుతోంది. మీ క్లయింట్ నిజాయితీతో వస్తారని మేము ఆశించాం. కానీ మీరు వాస్తవాలను దాచిపెట్టారు'' అంటూ హేమంత్ సోరెన్ తరఫు న్యాయవాది కపిల్ సిబల్‌కు కోర్టు తెలిపింది. కోర్టు హెచ్చరికతో ఆ పిటిషన్‌ను కపిల్ సిబల్ ఉపసంహరించుకున్నారు. జనవరి 31న హేమంత్ సోరెన్‌ను ఈడీ అరెస్టు చేయగా, ఆయన అరెస్టును జార్ఖాండ్ హైకోర్టు సమర్ధించింది. రెగ్యులర్ బెయిల్ దరఖాస్తును మే 13న ట్రయిల్ కోర్టు కొట్టివేసింది.

మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Updated Date - May 22 , 2024 | 02:38 PM