Share News

Shankaracharya: రాహుల్‌‌కు బాసటగా జ్యోతిర్ మఠం శంకరాచార్య

ABN , Publish Date - Jul 08 , 2024 | 07:34 PM

ప్రతిపక్ష నేత హోదాలో మొదటిసారిగా లోక్‌సభలో రాహుల్ గాంధీ ఇటీవల చేసిన ప్రసంగం తీవ్ర దుమారం రేపడంపై జ్యోతిర్ మఠం 46వ శంకరాచార్య స్వామి అవిముక్తేశ్వరానంద తాజాగా స్పందించారు. రాహుల్ ప్రసంగం హిందూయిజానికి వ్యతిరేకంగా లేదని సమర్ధించారు.

Shankaracharya: రాహుల్‌‌కు బాసటగా జ్యోతిర్ మఠం శంకరాచార్య

న్యూఢిల్లీ: ప్రతిపక్ష నేత హోదాలో మొదటిసారిగా లోక్‌సభలో రాహుల్ గాంధీ (Rahul Gandhi) ఇటీవల చేసిన ప్రసంగం తీవ్ర దుమారం రేపడంపై జ్యోతిర్ మఠం (Jyotir Math) 46వ శంకరాచార్య స్వామి అవిముక్తేశ్వరానంద (Avimukteshwarananda) తాజాగా స్పందించారు. రాహుల్ ప్రసంగం హిందూయిజానికి వ్యతిరేకంగా లేదని సమర్ధించారు.


రాష్ట్రపతి ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపే తీర్మానంపై కాంగ్రెస్ ఎంపీ, ప్రతిపక్షనేత రాహుల్ గాంధీ ఇటీవల లోక్‌సభలో ప్రసంగిస్తూ కేంద్రప్రభుత్వంపై తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. బీజేపీ నేతలు మతపరంగా ప్రజలను విడిగొడుతున్నారని ఆరోపించారు. దీనిపై ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అభ్యంతరం వ్యక్తం చేశారు. హిందువులంతా హింసను ప్రేరేపిస్తున్నట్టు రాహుల్ మాట్లాడుతున్నారంటూ తప్పుపట్టారు. దానికి రాహుల్ తిరిగి స్పందిస్తూ, తాను మతం పేరుతో రెచ్చగొడుతున్న బీజేపీ, ఆర్ఎస్ఎస్‌ని ఉద్దేశించి మాత్రమే మాట్లాడుతున్నానని, మొత్తం హిందూ సమాజం గురించి కాదని అన్నారు. రాహుల్ వ్యాఖ్యలపై బీజేపీ అభ్యంతరం వ్యక్తం చేయడంతో ఆయన ప్రసంగంలోని కొన్ని పదాలను రికార్డుల నుంచి స్పీకర్ ఓం బిర్లా తొలగించారు.

Congress: మణిపుర్‌కి వచ్చే సమయం లేదు కానీ రష్యాకు వెళ్తారా.. మోదీపై కాంగ్రెస్ తీవ్ర విమర్శలు


స్పీచ్ విన్నా...

కాగా, రాహుల్ వ్యాఖ్యల వివాదంపై స్వామి అవిముక్తేశ్వరానంద స్పందిస్తూ. రాహుల్ గాంధీ ప్రసంగం మొత్తం విన్నాననీ, హిందూయిజంలో హింసకు తావులేదని మాత్రమే ఆయన చెప్పారని అన్నారు. హిందూయిజానికి భిన్నంగా ఆయన వ్యాఖ్యలు లేవన్నారు.రాహుల్ స్టేట్‌మెంట్‌ను అక్కడక్కడా తీసుకుని ప్రచారం చేయడం నేరమని అన్నారు. దీనికి ముందు ప్రియాంక గాంధీ సైతం రాహుల్ వ్యాఖ్యలను సమర్ధించారు. తన సోదరుడు (రాహుల్) ఎప్పుడూ హిందువులకు వ్యతిరేకంగా మాట్లాడిందే లేదని, బీజేపీ, బీజేపీ నేతల గురించే ఆయన మాట్లాడారని చెప్పారు.

For Latest News and National News click here

Updated Date - Jul 08 , 2024 | 07:39 PM