Share News

Sharad Pawar: గడియారం గుర్తుపై సుప్రీంకు శరద్ పవార్

ABN , Publish Date - Oct 02 , 2024 | 09:11 PM

పార్టీ గుర్తు గడియారంతో తమకు ఎంతో అనుబంధం ఉందని, ఎన్నికల ప్రక్రియలో నిష్పాక్షికత, స్పష్టత కోసం, ఓటర్లలో అయోమయం నెలకొనకుండా అజిత్ వర్గం కొత్త గుర్తు కోసం దరఖాస్తు చేసుకోవాలని శరద్ పవార్ కోరారు.

Sharad Pawar: గడియారం గుర్తుపై సుప్రీంకు శరద్ పవార్

న్యూఢిల్లీ: మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికలు (Maharashtra Assembly Elections) దగ్గరపడుతున్న వేళ పార్టీ 'గడియారం' గుర్తుపై నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ (ఎస్‌పీ) చీఫ్ శరద్ పవార్ సుప్రీంకోర్టును బుధవారంనాడు ఆశ్రయించారు. ఎన్నికల్లో గడియారం గుర్తును అజిత్ పవార్ వర్గం వాడుకోకుండా నిరోధించాలని కోరుతూ పిటిషన్ వేశారు. పార్టీ గుర్తు గడియారంతో తమకు ఎంతో అనుబంధం ఉందని, ఎన్నికల ప్రక్రియలో నిష్పాక్షికత, స్పష్టత కోసం, ఓటర్లలో అయోమయం నెలకొనకుండా అజిత్ వర్గం కొత్త గుర్తు కోసం దరఖాస్తు చేసుకోవాలని ఆ పిటిషన్‌లో కోరారు.

Ajit Pawar: మా వాటా సీట్లలో 10 శాతం మైనారిటీలకే..


ఇటీవల జరిగిన పార్లమెంటరీ ఎన్నికల్లో ఓటర్లు గందరగోళానికి గురైన విషయాన్ని శరద్ పవార్ తన పిటిషన్‌లో కోర్టు దృష్టికి తెచ్చారు. ఇదే గందరగోళం అసెంబ్లీ ఎన్నికల్లో, ముఖ్యంగా చిన్న నియోజకవర్గాల్లో నెలకొనే అవకాశం ఉందన్నారు. ఓటర్లను మభ్యపెట్టే వారిని నిరోధించేందుకు, నిష్పాక్షిక పోటీకి వీలుకల్పించేందుకు అజిత్ పవార్ మరో గుర్తును ఎంపిక చేసుకోవాలని అత్యున్నత న్యాయస్థానాన్ని కోరారు. అక్టోబర్ 15న ఈ పిటిషన్ విచారణకు వచ్చే అవకాశం ఉంది. గత ఏడాది ఎన్సీపీని చీల్చి తన వర్గం ఎమ్మెల్యేలతో ఎన్డీయేలో చేరి డిప్యూటీ సీఎం పదవిని చేపట్టిన అజిత్ పవార్ వర్గాన్ని అసలైన ఎన్‌సీపీగా కేంద్ర ఎన్నికల సంఘం గుర్తించింది. ఆ పార్టీ సంప్రదాయ గుర్తు 'గడియారం'ను వారికే కేటాయించింది. శరద్ పవార్ వర్గానికి కొత్త గుర్తుగా సంప్రదాయ బూరుగ ఊదుతున్న వ్యక్తి చిహ్నాన్ని తాత్కాలికంగా కేటాయించింది.


మరిన్ని జాతీయ వార్తల కోసం

Haryana Polls: హరియాణా బీజేపీ.. ముచ్చటగా మూడోసారికి, ఆ మూడే కీలకం

Varanasi: ఆలయాల వద్ద ఉద్రిక్తత.. సాయిబాబా విగ్రహాల తొలగింపు

Updated Date - Oct 02 , 2024 | 09:11 PM