Share News

Sitaram Yechury: నిలకడగా సీతారాం ఏచూరి ఆరోగ్యం

ABN , Publish Date - Sep 06 , 2024 | 03:22 PM

శ్వాస సంబంధిత ఇన్ఫెక్షన్‌తో ఢిల్లీ ఎయిమ్స్‌లో చికిత్స పొందుతున్న కమ్యూనిస్ట్ పార్టీ ఆఫ్ ఇండియా ప్రధాన కార్యదర్శి సీతారాం ఏచూరి ఆరోగ్యం నిలకడగా ఉందని, చికిత్సకు స్పందిస్తున్నారని ఆ పార్టీ శుక్రవారంనాడు ఒక ప్రకటనలో తెలిపింది.

Sitaram Yechury: నిలకడగా సీతారాం ఏచూరి ఆరోగ్యం

న్యూఢిల్లీ: శ్వాస సంబంధిత ఇన్ఫెక్షన్‌తో ఢిల్లీ ఎయిమ్స్‌లో చికిత్స పొందుతున్న కమ్యూనిస్ట్ పార్టీ ఆఫ్ ఇండియా (CPM) ప్రధాన కార్యదర్శి సీతారాం ఏచూరి (Sitaram Yechury) ఆరోగ్యం నిలకడగా ఉందని, చికిత్సకు స్పందిస్తున్నారని ఆ పార్టీ శుక్రవారంనాడు ఒక ప్రకటనలో తెలిపింది. ఇంటెన్సివ్ కేర్ యూనిట్‌లో లంగ్ ఇన్‌ఫెక్షన్‌కు వైద్యులు చికిత్స అందిస్తున్నారని పేర్కొంది.

Vinesh Phogat: రైల్వే ఉద్యోగానికి వినేశ్ ఫోగట్ రాజీనామా


న్యుమోనియాతో ఆగస్టు 19న 72 ఏళ్ల సీతారం ఏచూరి ఎయిమ్స్‌లో చేరారు. గురువారంనాడు ఆయన ఆరోగ్య పరిస్థితి క్షీణించడంతో వెంటిలేటర్‌‌పై చికిత్సకు వైద్యులు తరలించారు. ఎయిమ్స్ వైద్యుల బృందం ఎప్పటికప్పుడు ఆయన ఆరోగ్య పరిస్థితిని సమీక్షిస్తోందని కుటుంబ వర్గాలు తెలిపాయి. ఏచూరి ఇటీవల క్యాటరాక్ట్ సర్జరీ చేయించుకున్నారు.


Read More National News and Latest Telugu News Click Here

Updated Date - Sep 06 , 2024 | 03:23 PM