Share News

Delhi: ఆరో దశ నోటిఫికేషన్‌ విడుదల: ఈసీ

ABN , Publish Date - Apr 30 , 2024 | 03:55 AM

సార్వత్రిక ఎన్నికల సమరంలో భాగంగా ఆరో దశ ఎన్నికల నోటిఫికేషన్‌ను ఈసీ సోమవారం విడుదల చేసింది. 7 రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలలోని 57 స్థానాలకు ఈ దశలో ఎన్నికలు జరగనున్నాయి.

Delhi: ఆరో దశ నోటిఫికేషన్‌ విడుదల: ఈసీ

  • రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల్లో..

  • 57 స్థానాలకు మే 25న ఎన్నికలు

  • 6 వరకు నామినేషన్ల స్వీకరణ.. 9న ఉపసంహరణ

  • ఆరో దశ ఎన్నికల నోటిఫికేషన్‌ విడుదల

న్యూఢిల్లీ, ఏప్రిల్‌ 29 (ఆంధ్రజ్యోతి): సార్వత్రిక ఎన్నికల సమరంలో భాగంగా ఆరో దశ ఎన్నికల నోటిఫికేషన్‌ను ఈసీ సోమవారం విడుదల చేసింది. 7 రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలలోని 57 స్థానాలకు ఈ దశలో ఎన్నికలు జరగనున్నాయి. బిహార్‌, హరియాణా, ఝార్ఖండ్‌, ఒడిశా, యూపీ, పశ్చిమ బెంగాల్‌, ఢిల్లీలోని పార్లమెంటు స్థానాలకు ఈ ఎన్నికలు జరుగనున్నాయి.


మే 25న పోలింగ్‌ జరుగుతుంది. నామినేషన్ల స్వీకరణ సోమవారం ప్రారంభమైంది. ఈ దశలో తెలంగాణకు చెందిన శ్రీకళారెడ్డి యూపీలోని జౌన్‌పూర్‌ స్థానం నుంచి బీఎస్పీ అభ్యర్థిగా తన అదృష్టాన్ని పరీక్షించుకోనున్నారు. కన్నయ్యకుమార్‌ నార్త్‌ ఈస్ట్‌ ఢిల్లీ నుంచి కాంగ్రెస్‌ తరఫున బరిలో నిలవనున్నారు.

Updated Date - Apr 30 , 2024 | 03:55 AM