Share News

Snow: మంచుదుప్పటిలో ఏర్కాడు.. చలికి వణకుతున్న పర్యాటకులు

ABN , Publish Date - Nov 19 , 2024 | 12:22 PM

సేలం జిల్లాలో ‘పేదల ఊటీ’గా పేరొందిన ఏర్కాడు(Erkadu) అంతటా మంచు కురుస్తుండటంతో పర్యాటక ప్రాంతాలన్నీ నిర్మానుష్యంగా మారాయి. కనివినీ ఎరుగని రీతిలో చలిగాలులు వీస్తుండటంతో స్థానికులు, పర్యాటకులు చలికి వణకిపోతున్నారు. వారం రోజులుగా ఏర్కాడు, పరిసర ప్రాంతాల్లో చెదురుమదురుగా వర్షాలు కురుస్తున్నాయి.

Snow: మంచుదుప్పటిలో ఏర్కాడు.. చలికి వణకుతున్న పర్యాటకులు

చెన్నై: సేలం జిల్లాలో ‘పేదల ఊటీ’గా పేరొందిన ఏర్కాడు(Erkadu) అంతటా మంచు కురుస్తుండటంతో పర్యాటక ప్రాంతాలన్నీ నిర్మానుష్యంగా మారాయి. కనివినీ ఎరుగని రీతిలో చలిగాలులు వీస్తుండటంతో స్థానికులు, పర్యాటకులు చలికి వణకిపోతున్నారు. వారం రోజులుగా ఏర్కాడు, పరిసర ప్రాంతాల్లో చెదురుమదురుగా వర్షాలు కురుస్తున్నాయి. ఆదివారం మధ్యాహ్నం నుంచి సాయంత్రం వరకు, మళ్ళీ అర్థరాత్రి నుంచి వేకువజాము వరకు జల్లులు కురిశాయి.

ఈ వార్తను కూడా చదవండి: Rains: 15 జిల్లాల్లో వర్షాలు కురిసే అవకాశం


nani3.2.jpg

దీంతో ఏర్కాడులోని పర్యాటక ప్రాంతాల్లో దట్టమైన మంచు ఆవరించింది. మంచు కారణంగా చలి అధికం కావటంతో స్థానికులు, కార్మికులు గిజగిజ వణకుతున్నారు. ఏర్కాడు ఘాట్‌రోడ్డులోను మంచు వర్షం కురుస్తుండటంతో అన్ని వాహనాలు హెడ్‌లైట్లు(Headlights) వేసుకుని వాహన చోదకులు నడుపుతున్నారు. ఓవైపు మంచు, మరోవైపు చలి అధికం కావటంతో గత రెండు రోజులుగా ఏర్కాడుకు వచ్చే పర్యాటకుల సంఖ్య బాగా తగ్గిపోయింది.


ఈవార్తను కూడా చదవండి: KTR: మణిపూర్‌ పరిస్థితే లగచర్లలోనూ..

ఈవార్తను కూడా చదవండి: మహారాష్ట్రలో ఓటమి మోదీకి ముందే తెలిసింది

ఈవార్తను కూడా చదవండి: Ponguleti: బీఆర్‌ఎస్‌ హయాంలో సర్వేతో దోపిడీ

ఈవార్తను కూడా చదవండి: DK Aruna: నియంతలా సీఎం రేవంత్‌ ప్రవర్తన

Read Latest Telangana News and National News

Updated Date - Nov 19 , 2024 | 12:22 PM