Share News

హిమాచల్‌లో 18 పర్యాటక హోటళ్ల మూసివేతకు హైకోర్టు ఆదేశాలు

ABN , Publish Date - Nov 21 , 2024 | 04:18 AM

హిమాచల్‌ ప్రదేశ్‌లో ప్రభుత్వ ఖజానాకు భారంగా మారిన 18 పర్యాటక హోటళ్లను మూసివేయాలంటూ ఆ రాష్ట్ర హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది.

హిమాచల్‌లో 18 పర్యాటక హోటళ్ల మూసివేతకు హైకోర్టు ఆదేశాలు

శిమ్లా, నవంబరు 20: హిమాచల్‌ ప్రదేశ్‌లో ప్రభుత్వ ఖజానాకు భారంగా మారిన 18 పర్యాటక హోటళ్లను మూసివేయాలంటూ ఆ రాష్ట్ర హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది. హిమాచల్‌ప్రదేశ్‌ పర్యాటక అభివృద్ధి కార్పొరేషన్‌ (హెచ్‌పీటీడీసీ) నిర్వహిస్తున్న ఈ హోటళ్లతో నష్టాలే తప్ప ఆదాయం లేదని.. వీటి కోసం ప్రజా వనరులను వృథా చేయడం సరికాదని పేర్కొంది. ఈ హోటళ్లను ‘తెల్ల ఏనుగులు’గా అభివర్ణించిన కోర్టు.. వాటిని లాభదాయకంగా మార్చుకోవడంలో హెచ్‌పీటీడీసీ అసమర్థతపై విమర్శలు గుప్పించింది. హెచ్‌పీటీడీసీ రిటైర్డ్‌ ఉద్యోగులకు చెల్లించని ఆర్థిక ప్రయోజనాలకు సంబంధించిన ఫిర్యాదులపై ఈ కేసు ప్రారంభమైంది. ఆ రిటైర్డ్‌ ఉద్యోగులకు ఆర్థిక ప్రయోజనాలు అందజేయాలని ఆదేశించిన కోర్టు.. హోటళ్ల మూసివేతకు సంబంధించి తదుపరి చర్యలపై హెచ్‌పీటీడీసీ డైరెక్టర్‌ అఫిడవిట్‌ దాఖలు చేయాలని ఉత్తర్వులు జారీ చేసింది.

Updated Date - Nov 21 , 2024 | 04:19 AM