Share News

Supreme Court: మనీలాండరింగ్ కేసుల్లోనూ బెయిల్ వర్తిస్తుంది.. సుప్రీం కీలక వ్యాఖ్యలు

ABN , Publish Date - Aug 28 , 2024 | 03:25 PM

మనీలాండరింగ్ కేసుల్లోనూ బెయిల్ రూల్ వర్తిస్తుందని సుప్రీంకోర్టు బుధవారంనాడు స్పష్టత ఇచ్చింది. అక్రమ మైనింగ్ కేసులో జార్ఖాండ్ ముఖ్యమంత్రి హేమంత్ సోరెన్ అనుచరుడు ప్రేమ్ ప్రకాష్‌ బెయిల్ పిటిషన్‌పై విచారణ సందర్భంగా అత్యున్నత న్యాయస్థానం ఈ కీలక వ్యాఖ్యలు చేసింది. ఆయనకు బెయిలు మంజూరు చేసింది.

Supreme Court: మనీలాండరింగ్ కేసుల్లోనూ బెయిల్ వర్తిస్తుంది.. సుప్రీం కీలక వ్యాఖ్యలు

న్యూఢిల్లీ: మనీలాండరింగ్ కేసుల్లోనూ బెయిల్ రూల్ (Bail rule) వర్తిస్తుందని సుప్రీంకోర్టు (Supreme Court) బుధవారంనాడు స్పష్టత ఇచ్చింది. అక్రమ మైనింగ్ కేసులో జార్ఖాండ్ ముఖ్యమంత్రి హేమంత్ సోరెన్ అనుచరుడు ప్రేమ్ ప్రకాష్‌ (Prem prakash) బెయిల్ పిటిషన్‌పై విచారణ సందర్భంగా అత్యున్నత న్యాయస్థానం ఈ కీలక వ్యాఖ్యలు చేసింది. ప్రివెన్షన్ ఆఫ్ మనీలాండరింగ్ చట్టం (PMLA) కింద నమోదైన కేసుల్లోనూ బెయిల్ అనేది నియమమని, జైలు మినహాయింపు అని న్యాయమూర్తులు బీఆర్ గవాయ్, కేవీ విశ్వనాథన్‌లతో కూడిన సుప్రీం ధర్మాసనం స్పష్టం చేసింది.

Mamata Banerjee: రేపిస్టులకు మరణశిక్ష.. 10 రోజుల్లో బిల్లు


ఢిల్లీ మాజీ ఉప ముఖ్యమంత్రి మనీష్ సిసోడియాకు సంబంధించిన మనీ లాండరింగ్ కేసులో ఆగస్టు 9న ఇచ్చిన తీర్పును ధర్మాసనం ప్రస్తావిస్తూ, వ్యక్తి స్వేచ్ఛ అనేది నియమమని, దాన్ని కోల్పోవడం అనేది మినహాయింపుగానే ఉండాలని పేర్కొంది. ఒకవేళ ఆ స్వేచ్ఛను కోల్పోవాల్సి వస్తే అది కూడా చట్టబద్ధంగానే ఉండాలని తెలిపింది. ప్రేమ్‌ ప్రకాష్‌ కేసులో పిటిషన్‌దారు నేరం చేసినట్టు కానీ, బెయిలుపై బయటకు వస్తే సాక్ష్యలను ప్రభావితం చేస్తాడనేందుకు కానీ ప్రాథమిక ఆధారాలు లేవని కోర్టు పేర్కొంది. ఆయనకు బెయిలు మంజూరు చేస్తున్నట్టు తెలిపింది. ఢిల్లీ ఎక్సైజ్ పాలసీ కేసులో మనీష్ సిసోడియాకు కూడా 17 నెలల జైలు నిర్బంధం అనంతరం ఈ నెల మొదట్లో కోర్టు బెయిలు ఇచ్చింది.

Read More National News and Latest Telugu News

Updated Date - Aug 28 , 2024 | 03:25 PM