Share News

YS Avinash Reddy: వైఎస్ అవినాష్ రెడ్డి ముందస్తు బెయిల్ పిటిషన్‌పై ఫిబ్రవరిలో సుప్రీంకోర్టు విచారణ

ABN , Publish Date - Jan 18 , 2024 | 12:32 PM

వైసీపీ ఎంపీ అవినాష్ రెడ్డి ముందస్తు బెయిల్‌ పిటిషన్‌ సుప్రీంకోర్టు ధర్మాసనం ఫిబ్రవరిలో విచారించనుంది. వైఎస్ వివేకానంద హత్య కేసులో ముందస్తు బెయిల్ కోసం అవినాష్ రెడ్డి సుప్రీంకోర్టును ఆశ్రయించిన సంగతి తెలిసిందే.

YS Avinash Reddy: వైఎస్ అవినాష్ రెడ్డి ముందస్తు బెయిల్ పిటిషన్‌పై ఫిబ్రవరిలో సుప్రీంకోర్టు విచారణ

ఢిల్లీ: వైసీపీ ఎంపీ అవినాష్ రెడ్డి (YS Avinash Reddy) ముందస్తు బెయిల్‌ పిటిషన్‌ను సుప్రీంకోర్టు ధర్మాసనం ఫిబ్రవరిలో విచారించనుంది. వైఎస్ వివేకానంద హత్య కేసులో ముందస్తు బెయిల్ కోసం అవినాష్ రెడ్డి సుప్రీంకోర్టును ఆశ్రయించిన సంగతి తెలిసిందే.

అవినాష్ రెడ్డి ముందస్తు బెయిల్‌ పిటిషన్‌పై గతేడాది జూలై 18న విచారణ జరిగింది. తర్వాత సెప్టెంబర్ 11న సుప్రీంకోర్టు మరో విచారించింది. అయితే ఆ తర్వాత బెంచ్ వద్దకు ఈ పిటిషన్ రాలేదు. జనవరి 16, 17, 18వ తేదీల్లో విచారణకు వచ్చే అవకాశం ఉందని సుప్రీంకోర్టు రిజిస్ట్రార్ సమాచారం ఇచ్చింది. అయినప్పటికీ గురువారం కూడా విచారణకు రాకపోవడంతో జస్టిస్ సంజీవ్ ఖన్నా ధర్మాసనం దృష్టికి సునీత తరఫు న్యాయవాది సిద్ధార్థ లూథ్రా తీసుకెళ్లారు. ముందస్తు బెయిల్‌కు సంబంధించిన పిటిషన్‌ను ఫిబ్రవరిలో విచారిస్తామని ఈ సందర్భంగా ధర్మాసనం తెలియజేసింది.

కాగా వివేకా హత్య కేసులో గతేడాది మే 31వ తేదీన అవినాష్ రెడ్డికి తెలంగాణ హైకోర్టు ముందస్తు బెయిల్ మంజూరు చేసింది. తెలంగాణ హైకోర్టు ఆదేశాలను వైఎస్ వివేకానంద కూతురు సునీతా రెడ్డి జూన్ 9వ తేదీన సుప్రీంకోర్టులో సవాల్ చేశారు. జూన్ 19వ తేదీన అవినాష్ రెడ్డికి సుప్రీంకోర్టు నోటీసులు జారీచేసిన విషయం తెలిసిందే.

మరిన్ని జాతీయ వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి.

Updated Date - Jan 18 , 2024 | 12:45 PM