Share News

Doctors Safety: వైద్యుల భద్రతపై సుప్రీం కీలక ఆదేశాలు..

ABN , Publish Date - Aug 22 , 2024 | 03:56 PM

కోల్‌కతాలోని ఆర్ జీ కర్ వైద్య కళాశాల, ఆసుపత్రిలోని జూనియర్ డాక్టర్ అభయ హత్యాచారం ఘటనపై సుప్రీంకోర్టులో విచారణ ముగిసింది. తదుపరి విచారణను న్యాయస్థానం సెప్టెంబర్5వ తేదీకి వాయిదా వేసింది.

Doctors Safety: వైద్యుల భద్రతపై సుప్రీం కీలక ఆదేశాలు..
Supreme Court

కోల్‌కతాలోని ఆర్ జీ కర్ వైద్య కళాశాల, ఆసుపత్రిలోని జూనియర్ డాక్టర్ అభయ హత్యాచారం ఘటనపై సుప్రీంకోర్టులో విచారణ ముగిసింది. తదుపరి విచారణను న్యాయస్థానం సెప్టెంబర్5వ తేదీకి వాయిదా వేసింది. ఈకేసు విచారణ సందర్భంగా వైద్యుల భద్రతపై భారత అత్యున్నత న్యాయస్థానం కీలక వ్యాఖ్యలు చేసింది. ప్రయివేట్ ఆసుపత్రులు సొంతంగా రక్షణ చర్యలు చేపట్టాలని పేర్కొంది. ప్రయివేట్ ఆసుపత్రుల్లో పనిచేసే వైద్యుల భద్రతను ఆసుపత్రుల యాజామాన్యాలు తీసుకోవాలని స్పష్టం చేసింది. మరోవైపు వైద్యుల భద్రతపై కేంద్రప్రభుత్వం ఓ సమావేశాన్ని ఏర్పాటు చేయాలని సూచించింది. ప్రభుత్వ ఆసుపత్రుల్లో భద్రతపై ఓ మెకానిజాన్ని ఏర్పాటుచేయాలని ఆదేశించింది. వైద్యులకు తగిన భద్రత కల్పించాల్సిన అవసరాన్ని గుర్తుచేస్తూ.. ప్రభుత్వ ఆసుపత్రుల భద్రతపై తగిన చర్యలు చేపట్టాలని కేంద్రప్రభుత్వాన్ని ఆదేశించింది. ఈకేసు తుది విచారణ సెప్టెంబర్5న జరగనుంది.


భద్రతపై వైద్యుల ఆందోళన

కోల్‌కతాలో అభయ ఘటన తర్వాత దేశ వ్యాస్తంగా వైద్యులు ఆందోళన బాట పట్టారు. తమ ప్రాణాలకు భద్రత లేకుండా పోయిందని నిరసనలు తెలిపారు. మరోవైపు అభయ ఘటన తర్వాత ఆర్ జీ కర్ ఆసుపత్రిపై వేలమంది దాడికి పాల్పడి విధ్వంసం సృష్టించారు. ఈ నేపథ్యంలో దేశ వ్యాప్తంగా వైద్యులు ఉద్యమించారు. ఈకేసును సుప్రీంకోర్టు విచారణకు స్వీకరించింది. అదే సమయంలో వైద్యుల భద్రతపైనా తాము ఆలోచన చేస్తామని చెప్పింది. వైద్యుల భద్రత విషయంలో తీసుకోవల్సిన చర్యలపై ఒక ప్రత్యేక టాస్క్‌ఫోర్సును ఏర్పాటుచేసి దానిలో దేశంలోని ప్రముఖ వైద్య నిపుణులను భాగస్వామ్యులను చేసిన విషయం తెలిసిందే.

Accident: బస్సును ఢీకొట్టిన ట్యాంకర్.. ఐదుగురు మృతి, మరో 20 మందికి గాయాలు

మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Read More National News and Latest Telugu News

Updated Date - Aug 22 , 2024 | 03:57 PM