Share News

Aam Aadmi Party: స్వాతి మలివాల్‌‌కు వైద్య పరీక్షలు: గాయాలు

ABN , Publish Date - May 17 , 2024 | 04:23 PM

ఢిల్లీ సీఎం, ఆప్ కన్వీనర్ అరవింద్ కేజ్రీవాల్ పీఏ బిభవ్ కుమార్‌ తనపై చేసిన దాడిని ఆ పార్టీ ఎంపీ స్వాతి మలివాల్ శుక్రవారం తీస్ హజరీ కోర్టులో వివరించారు. మలివాల్ ఇచ్చిన స్టేట్‌మెంట్‌ను కోర్టులో సెక్షన్ 164 కింద మేజిస్ట్రేట్ రికార్డు చేశారు.

Aam Aadmi Party: స్వాతి మలివాల్‌‌కు వైద్య పరీక్షలు: గాయాలు

న్యూఢిల్లీ, మే 17: ఢిల్లీ సీఎం, ఆప్ కన్వీనర్ అరవింద్ కేజ్రీవాల్ పీఏ బిభవ్ కుమార్‌ తనపై చేసిన దాడిని ఆ పార్టీ ఎంపీ స్వాతి మలివాల్ శుక్రవారం తీస్ హజరీ కోర్టులో వివరించారు. మలివాల్ ఇచ్చిన స్టేట్‌మెంట్‌ను కోర్టులో సెక్షన్ 164 కింద మేజిస్ట్రేట్ రికార్డు చేశారు.

తనపై దాడి చేసిన బిభవ్ కుమార్‌పై మలివాల్ గురువారం పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఢిల్లీ సీఎం కేజ్రీవాల్‌ నివాసంలో తనపై బిభవ్ కుమార్ జరిపిన దాడిని ఎక్స్ వేదికగా స్వాతి మలివాల్ వివరించారు. అయితే ఈ దాడి ఘటన తర్వాత ఎక్స్ వేదికగా ఆమె స్పందించడం ఇదే తొలిసారి. అలాగే ఈ దాడి జరిగిన మూడు రోజులకు పోలీస్ స్టేషన్‌లో బిభవ్ కుమార్‌పై ఆమె ఫిర్యాదు చేశారు.

AP Elections: జగన్‌కు దెబ్బ.. చెల్లెళ్లకు ఊరట


ఇక తనపై బిభవ్ కుమార్ దాడి చేసిన వెంటనే ఎంపీ స్వాతి మలివాల్.. సివిల్ లైన్ పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేసేందుకు వెళ్లారు. కానీ బిభవ్ కుమార్‌పై ఆమె ఫిర్యాదు చేయకుండానే వెనుతిరిగిన సంగతి తెలిసిందే. మరోవైపు ఆప్ ఎంపీ సంజయ్ సింగ్.. బుధవారం స్వాతి మలివాల్‌తో భేటీ అయ్యారు. మీ ఫిర్యాదులను పార్టీ పరిశీలిస్తుందని ఈ సందర్బంగా ఆమెకు సంజయ్ హామీ ఇచ్చారు.

LokSabha Elections: ప్లాన్ బీ ఆలోచన లేదు

ఆ మరునాడే.. అంటే గురువారం బిభవ్ కుమార్ దాడిపై ఆమె పోలీసులకు ఫిర్యాదు చేయడం గమనార్హం. బిభవ్ కుమార్ దాడిలో స్వాతి మలివాల్‌‌కు గాయాలయ్యాయని వైద్య పరీక్షల్లో నిర్ధారణ అయింది. స్వాతి మలివాల్‌పై దాడి ఘటనపై జాతీయ మహిళా కమిషన్ చైర్మన్ రేఖా శర్మ స్పందించారు. ఈ ఘటనపై పోలీసుల నుంచి నివేదిక కోరినట్లు తెలిపారు. అలాగే బిభవ్ కుమార్‌పై ఎఫ్ఐఆర్ నమోదు చేశారన్నారు.


Karnataka: బెంగళూరులో హై అలర్ట్

స్వాతి మలివాల్‌కు వైద్య పరీక్షలు సైతం పూర్తి అయినట్లు వివరించారు. అయితే మే 17వ తేదీ అంటే.. శుక్రవారం ఉదయం 11.00 గంటలకు మహిళ కమిషన్ ముందు హాజరు కావాలని బిభవ్ కుమార్‌కు నోటీసులు జారీ చేశామని తెలిపారు. అయితే అతడి నుంచి ఇప్పటి వరకు స్పందన లేదన్నారు.

మరోవైపు సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో ఉత్తరప్రదేశ్, పంజాబ్‌లో కేజ్రీవాల్ సూడిగాలి ప్రచారం నిర్వహిస్తున్నారు. ఈ నేపథ్యంలో గురువారం లఖ్‌నవూ ఎయిర్‌పోర్ట్‌లో కేజ్రీవాల్‌, ఆప్ ఎంపీ సంజయ్ సింగ్‌తో పాటు బిభవ్ కుమార్ ఉన్నారు.

Read Latest AP News and Telugu News

Read Latest Telangana News and National News

Read Latest Chitrajyothy News and Sports News

Updated Date - May 17 , 2024 | 04:23 PM