Share News

Bibhav Kumar Bail: స్పందించిన ఆప్ ఎంపీ స్వాతి

ABN , Publish Date - Sep 03 , 2024 | 06:16 PM

ఆమ్ ఆద్మీ పార్టీ రాజ్యసభ సభ్యురాలు స్వాతి మలివాల్‌పై దాడి కేసులో అరెస్టయిన ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ సహాయకుడు బిభవ్ కుమార్‌కు సుప్రీంకోర్టు సోమవారం బెయిల్ మంజూరు చేసింది. ఈ అంశంపై ఆప్ ఎంపీ స్వాతి మలివాల్ మంగళవారం స్పందించారు.

Bibhav Kumar Bail: స్పందించిన ఆప్ ఎంపీ స్వాతి
AAP Rajya Sabha MP Swati Maliwal

న్యూఢిల్లీ, సెప్టెంబర్ 03: ఆమ్ ఆద్మీ పార్టీ రాజ్యసభ సభ్యురాలు స్వాతి మలివాల్‌పై దాడి కేసులో అరెస్టయిన ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ సహాయకుడు బిభవ్ కుమార్‌కు సుప్రీంకోర్టు సోమవారం బెయిల్ మంజూరు చేసింది. ఈ అంశంపై ఆప్ ఎంపీ స్వాతి మలివాల్ మంగళవారం స్పందించారు. మహాభారతంలోని ద్రౌపది చీరను కౌరవుల్లో ఒకరైన దుశ్శాసనుడు లాగుతున్న చిత్రాన్ని ఆమె తన ఎక్స్ ఖాతాలో పోస్ట్ చేశారు. ఈ పోస్ట్ వైరల్ అవుతుంది.

ఇక ఈ పోస్ట్‌లో ఆమె ఎటువంటి కామెంట్ చేయకుండా.. కేవలం ఆ చిత్రాన్ని మాత్రమే పోస్ట్ చేశారు. ఈ పోస్ట్‌పై నెటిజన్లు తమదైన శైలిలో కామెంట్లు చేస్తున్నారు. తనను అవమానించి బిభవ్ కుమార్‌కు బెయిల్ వచ్చిందనే విధంగా ఎంపీ స్వాతి మలివాల్ ఈ చిత్రాన్ని పోస్ట్ చేశారనే కామెంట్లు సైతం వినిపిస్తున్నాయి.

Also Read: Vinayaka Chavithi Special 2024: ఏ రాశి వారు ఏ నైవేద్యం పెట్టాలి. ఏ మంత్రం చదివి పూజించాలంటే..


aap.jpg

మద్యం కుంభకోణం కేసులో మనీ ల్యాండరింగ్ వ్యవహారంలో ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్‌ను ఈడీ అరెస్ట్ చేసింది. అనంతరం ఆయన్ని తీహాడ్ జైలుకు తరలించారు. సార్వత్రిక ఎన్నికల్లో పార్టీ తరఫున ప్రచారం నిర్వహించుకోవాలంటూ సుప్రీంకోర్టులో కేజ్రీవాల్ పిటిషన్ దాఖలు చేశారు. ఈ నేపథ్యంలో ఆయనకు సుప్రీంకోర్టు బెయిల్ మంజూరు చేసింది.

సరిగ్గా అదే సమయంలో సీఎం కేజ్రీవాల్ నివాసానికి ఎంపీ స్వాతి మలివాల్ వెళ్లారు. ఆ సమయంలో తనపై కేజ్రీవాల్ సహాయకుడు బిభవ్ కుమార్ దాడి చేశారంటూ ఆమె ఆరోపించారు. ఆ క్రమంలో ఢిల్లీ పోలీసులకు అతడిపై ఫిర్యాదు చేశారు. పోలీసులు కేసు నమోదు చేసి బిభవ్ కుమార్‌ను అరెస్ట్ చేసి జైలుకు తరలించారు.

Also Read: Uttar Pradesh: తోడేళ్లు కనిపిస్తే కాల్చేయండి.. సీఎం ఆదేశాలు


సెప్టెంబర్ 2వ తేదీన అంటే సోమవారం సుప్రీంకోర్టు న్యాయమూర్తులు జస్టిస్ సూర్య కాంత్, జస్టిస్ ఉజ్జల్ భుయాన్‌తో కూడిన ధర్మాసనం బిభవ్ కుమార్‌కు బెయిల్ మంజూరు చేసింది. ఢిల్లీ సీఎం కేజ్రీవాల్‌కు అతడిని వ్యక్తిగత సహాయకుడిగా తిరిగి నియమించడం కానీ, సీఎంఓ కార్యాలయంలో అతడికి ప్రత్యేక బాధ్యతలు కానీ అప్పగించ వద్దని సుప్రీంకోర్టు ధర్మాసనం ఈ సందర్భంగా ఆదేశించింది.

ఈ కేసులో సాక్ష్యుల విచారణ పూర్తయ్యే వరకూ ముఖ్యమంత్రి కేజ్రీవాల్ నివాసంలో అడుగు పెట్టవద్దని బిభవ్ కుమార్‌కు సూచించింది. దాదాపు 100 రోజుల తర్వాత బిభవ్ కుమార్‌కు బెయిల్ మంజూరు అయింది.

Also Read:RG Kar hospital: 8 రోజుల సీబీఐ కస్టడీకి ప్రొ. సందీప్ ఘోష్


బిభవ్ కుమార్ గతంలో దాఖలు చేసిన బెయిల్ పిటిషన్‌ను ఢిల్లీ హైకోర్టు తోసిపుచ్చింది. దాడి కేసులో కుమార్ అరెస్టు తప్పనిసరని, ఆ పని చేసేటప్పుడు చట్ట నిబంధనలను పోలీసులు కచ్చితంగా అమలు చేయాలని ఆదేశించింది. నిందితుడికి తగినంత ఇన్‌ఫ్లుయెన్స్ ఉందని, బెయిలుపై విడుదల చేయడానికి సహేతుకమైన కారణాలు లేవని కూడా హైకోర్టు తన ఆదేశాల్లో పేర్కొంది.

Also Read: Chhattisgarh: ఎన్‌కౌంటర్‌లో 9 మంది మావోయిస్టులు మృతి


కాగా, సుప్రీంకోర్టు గత ఆగస్టు 1వ తేదీన విచారణ సందర్భంగా సీఎం నివాసంలో ఇలాంటి ఘటన జరగడం సహేతుకమని అనుకుంటున్నారా? అని బిభవ్ కుమార్‌ను నిలదీసింది. ఒక యంగ్ లేడీతో వ్యవహరించాల్సిన తీరు ఇదేనా? అని ప్రశ్నించింది. స్వాతి మలివాల్‌పై దాడి కేసులో మే 18వ తేదీన బిభవ్ కుమార్‌ను ఢిల్లీ పోలీసులు అరెస్ట్ చేశారు. అనంతరం బెయిల్‌ కోసం ఆతడు పెట్టుకున్న పిటిషన్లను కోర్టు పలుమార్లు తొసిపుచ్చిన విషయం విధితమే.

Read More National News and Latest Telugu New

Updated Date - Sep 03 , 2024 | 06:21 PM