Share News

Tamilisai Soundarajan: పుదుచ్చేరిలో కాదు.. తమిళనాడు నుంచే పోటీ చేస్తున్నా..

ABN , Publish Date - Mar 20 , 2024 | 11:15 AM

కేంద్రపాలిత రాష్ట్రం పుదుచ్చేరి నుంచి కాకుండా తమిళనాడులో తాను లోక్‌సభ ఎన్నికల్లో పోటీ చేయనున్నట్లు తమిళిసై సౌందర్‌రాజన్‌(Tamilisai Soundarajan) పేర్కొన్నారు.

Tamilisai Soundarajan: పుదుచ్చేరిలో కాదు.. తమిళనాడు నుంచే పోటీ చేస్తున్నా..

- తమిళిసై సౌందర్‌రాజన్‌

చెన్నై: కేంద్రపాలిత రాష్ట్రం పుదుచ్చేరి నుంచి కాకుండా తమిళనాడులో తాను లోక్‌సభ ఎన్నికల్లో పోటీ చేయనున్నట్లు తమిళిసై సౌందర్‌రాజన్‌(Tamilisai Soundarajan) పేర్కొన్నారు. లోక్‌సభ ఎన్నికల్లో పోటీ చేసేందుకు అనుకూలంగా తమిళిసై తెలంగాణ, పుదుచ్చేరి(Puducherry, Telangana) రాష్ట్రాల గవర్నర్‌ పదవికి రాజీనామా చేసిన విషయం తెలిసిందే. సాధ్యమైనంత వరకు ఆమె పుదుచ్చేరిలో ఉన్న ఒక్క పార్లమెంటు నియోజకవర్గంలో కమలం గుర్తుపై బీజేపీ తరఫున పోటీ చేస్తారని అందరూ ఊహించారు. అయితే ఆ రాష్ట్రంలో ఆమెకు తీవ్ర వ్యతిరేకత తెలుపుతున్నట్లు తెలిసింది. ఫ్రెంచ్‌ పాలన కింద ఉన్న పుదుచ్చేరిని భారతదేశానికి అప్పగించే సమయంలో ఇతర రాష్ట్రాలకు చెందిన వ్యక్తులు ఇక్కడ పోటీ చేయరాదని ఒప్పందం కుదుర్చుకోవడం జరిగిందని, దీన్ని ఉల్లంఘించడం చట్టరీత్యా నేరమని, కాంగ్రెస్‌, అన్నాడీఎంకే, డీఎంకేలు అభ్యంతరం తెలిపాయి. దీంతో, పుదుచ్చేరిలో తాను పోటీ చేయడం లేదని, పార్టీ అధిష్ఠానం రాష్ట్రంలో ఎక్కడ పోటీ చేయమని ఆదేశించినా తాను సిద్ధంగా ఉన్నట్లు తమిళిసై తెలిపారు.

Updated Date - Mar 20 , 2024 | 11:15 AM