Share News

Gnanavapi: ఆ ప్రదేశాల్లోనే పూజలు చేసుకోండి.. జ్ఞానవాపిపై సుప్రీం ఇంట్రెస్టింగ్ కామెంట్స్..

ABN , Publish Date - Apr 01 , 2024 | 02:59 PM

జ్ఞానవాపి మసీదు సముదాయంలోని వ్యాస్ బేస్‌మెంట్‌లో పూజలు చేసుకునేందుకు వ్యతిరేకంగా మసీదు కమిటీ వేసిన పిటిషన్‌ను సుప్రీంకోర్టు ( Supreme Court ) ఇవాళ విచారించింది. మసీదు తరఫు న్యాయవాది హుజైఫా అహ్మదీ వాదనలు వినిపించారు.

Gnanavapi: ఆ ప్రదేశాల్లోనే పూజలు చేసుకోండి.. జ్ఞానవాపిపై సుప్రీం ఇంట్రెస్టింగ్ కామెంట్స్..

జ్ఞానవాపి మసీదు సముదాయంలోని వ్యాస్ బేస్‌మెంట్‌లో పూజలు చేసుకునేందుకు వ్యతిరేకంగా మసీదు కమిటీ వేసిన పిటిషన్‌ను సుప్రీంకోర్టు ( Supreme Court ) ఇవాళ విచారించింది. మసీదు తరఫు న్యాయవాది హుజైఫా అహ్మదీ వాదనలు వినిపించారు. ఉత్తర్వులను అమలు చేయడానికి దిగువ కోర్టు ఒక వారం సమయం ఇచ్చిందని చెప్పారు. కానీ ప్రభుత్వం వెంటనే అమలు చేసిందని కోర్టు దృష్టికి తీసుకెళ్లారు. ఈ విషయంపై తమకు హైకోర్టులోనూ ఊరట లభించలేదని వాదించారు. పూజలను తక్షణమే నిషేధించాలని డిమాండ్ చేశారు.

ఈ వాదనలపై స్పందించిన ప్రధాన న్యాయమూర్తి డీవై చంద్రచూడ్ నేలమాళిగ ప్రవేశం దక్షిణం వైపు నుంచి, మసీదు ప్రవేశం ఉత్తరం వైపు నుంచి ఉన్నాయన్నారు. రెండూ ఒకదానికొకటి ప్రభావితం చేయవని, ప్రస్తుతానికి రెండు వర్గాల ప్రార్థనలు యథావిధిగా కొనసాగించుకోవచ్చని వెల్లడించారు. మసీదు దక్షిణ నేలమాళిగలో హిందువులు పూజలు చేసుకోవడానికి దిగువ కోర్టు అనుమతి ఇచ్చింది. ఈ ఆదేశాలను అలహాబాద్ హైకోర్టు సైతం సమర్థించింది.

Jai Shankar: కచ్చతీవు రగడ.. జై శంకర్ స్పందన ఇదే..


జ్ఞానవాపి దక్షిణ నేలమాళిగలో ఉన్న వ్యాస్ జీ ప్రాంతంలో పూజలు నిలిపివేయాలని ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం 1993లో తీసుకున్న నిర్ణయం చట్టవిరుద్ధమని పేర్కొంది. చాలా కాలం నుంచి నడుస్తున్న ఈ వివాదానికి సంబంధించి ఏఎస్‌ఐ సర్వేకి గత ఏడాది జులై 21న కోర్టు అనుమతి ఇచ్చింది. దీంతో సర్వే అనంతరం డిసెంబరు 18న రిపోర్టు కోర్టుకు అందింది.

6) India - China: అరుణాచల్ ప్రదేశ్ వారిదేనట.. తీరు మార్చుకోని డ్రాగన్..

కాగా.. వారణాసిలోని వివాదాస్పద జ్ఞానవాపి మసీదు ప్రాంగణంలో అధికారులు నిర్వహించిన సర్వేలో సంచలన విషయాలు బయటపడ్డాయి. గతంలో ఉన్న భారీ హిందూ దేవాలయాన్ని కూల్చి వేసి మసీదు నిర్మించారని సర్వేలో తేలింది. ప్రస్తుత మసీదు స్థానంలో గతంలో ఆలయం ఉండేదని సర్వేలో వెల్లడైంది. మసీదు నిర్మాణంలో ఆలయం స్తంభాలను, రాళ్లను వినియోగించినట్టు తేలింది.

మరిన్ని జాతీయం వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి.

Updated Date - Apr 01 , 2024 | 03:04 PM