Share News

Lok Sabha Polls: స్మృతి ఇరానీని శర్మ ఓడిస్తారా.. అమేథిలో ఏం జరుగుతోంది..?

ABN , Publish Date - May 09 , 2024 | 11:20 AM

దేశంలో సార్వత్రిక ఎన్నికల వేళ ఉత్తరప్రదేశ్‌లో అందరి దృష్టిని ఆకర్షిస్తున్న నియోజకవర్గాల్లో రాయ్‌బరేలీ, అమేథీ ముందు వరుసలో ఉన్నాయి. గాంధీ కుటుంబానికి ఈ రెండు స్థానాలు ఎప్పటినుంచో సంప్రాదాయక సీట్లుగా ఉన్నాయి. కానీ 2019లో అమేథీలో రాహుల్ గాంధీ ఓటమి చవిచూడగా.. రాయ్‌బరేలీలో సోనియాగాంధీ విజయం సాధించారు. ఈసారి సోనియా గాంధీ రాజ్యసభకు వెళ్లడంతో.. రాయ్‌బరేలీ నుంచి ఆమె వారసుడిగా రాహుల్ గాంధీని కాంగ్రెస్ పార్టీ బరిలో దింపింది.

Lok Sabha Polls:  స్మృతి ఇరానీని శర్మ ఓడిస్తారా.. అమేథిలో ఏం జరుగుతోంది..?
Smriti Irani and KL Sharma

దేశంలో సార్వత్రిక ఎన్నికల వేళ ఉత్తరప్రదేశ్‌లో అందరి దృష్టిని ఆకర్షిస్తున్న నియోజకవర్గాల్లో రాయ్‌బరేలీ, అమేథీ ముందు వరుసలో ఉన్నాయి. గాంధీ కుటుంబానికి ఈ రెండు స్థానాలు ఎప్పటినుంచో సంప్రాదాయక సీట్లుగా ఉన్నాయి. కానీ 2019లో అమేథీలో రాహుల్ గాంధీ ఓటమి చవిచూడగా.. రాయ్‌బరేలీలో సోనియాగాంధీ విజయం సాధించారు. ఈసారి సోనియా గాంధీ రాజ్యసభకు వెళ్లడంతో.. రాయ్‌బరేలీ నుంచి ఆమె వారసుడిగా రాహుల్ గాంధీని కాంగ్రెస్ పార్టీ బరిలో దింపింది. అమేథీ నుంచి గాంధీ కుటుంబానికి విధేయుడిగా ఉన్న కిషోరి లాల్‌ శర్మను పోటీకి దింపింది. 2019 ఎన్నికల్లో స్మృతి ఇరానీ రాహుల్ గాంధీని ఓడించారు. ఆ తర్వాత ఆమె మోదీ మంత్రివర్గంలో కేంద్రమంత్రిగా ఉన్నారు. ప్రస్తుతం స్మృతి ఇరానీపై కెఎల్ శర్మను గెలిపించాలనే వ్యూహంతో కాంగ్రెస్‌ ముందుకు వెళ్తున్నట్లు తెలుస్తోంది. కేఎల్ శర్మ అమేథీ నుంచి గెలిస్తే సంచలనం అవుతుంది. ఓడిపోతే కాంగ్రెస్ పార్టీకి వచ్చిన నష్టం పెద్దగా ఏమీ ఉండకపోవచ్చనే అంచనాలతోనే కాంగ్రెస్ అమేథీ నుంచి వ్యూహాత్మకంగా శర్మను బరిలో దింపినట్లు తెలుస్తోంది. అదే గాంధీ కుటుంబానికి చెందిన వ్యక్తిని కాంగ్రెస్ పోటీలో పెట్టి.. ఓడిపోతే అది కాంగ్రెస్ రాజకీయ భవిష్యత్తుపై ప్రభావం చూపే అవకాశం ఉండటంతో అనూహ్యంగా శర్మను కాంగ్రెస్ తెరపైకి తెచ్చింది. స్మృతి ఇరానీని ఓడిస్తానని శర్మ శపథం చేస్తున్నారు.

Election Commission: ఐదో దశలో 695 మంది అభ్యర్థులు..


ఉత్కంఠ పోరు..

అమేథీ లోక్‌సభ స్థానంలో ఉప ఎన్నిక ఉత్కంఠ రేకెత్తిస్తోంది. రాహుల్ గాంధీ, స్మృతి ఇరానీ మధ్య పోరు ఉంటుందని అంతా భావించారు. కానీ కేఎల్ శర్మను రంగంలోకి దింపడం ద్వారా ఇక్కడ రాజకీయ వాతావరణం పూర్తిగా మారిపోయింది. స్మృతి ఇరానీని టార్గెట్ చేస్తూ కాంగ్రెస్ అభ్యర్థి తన ప్రచారాన్ని ప్రారంభించారు. ముఖ్యంగా గత ఐదేళ్లలో స్మృతి ఇరానీ నియోజకవర్గం అభివృద్ధికి ఏం చేశారంటూ ఆయన ప్రశ్నిస్తున్నారు. అమేథీలో అభివృద్ధి అనేది ఒక ముఖ్యమైన అంశంగా ఇక్కడి ఎన్నిక జరుగుతుందని.. స్మృతి ఇరానీ అమేథీలో చేసిన అభివృద్ధి ఏమిటనే విషయమై ప్రజల్లోకి వెళ్తామని శర్మ వెల్లడించారు. అమేథీలో ఏదైనా అభివృద్ధి కనిపిస్తుందంటే అది గాంధీ కుటుంబం చేసిన అభివృద్ధి మాత్రమేనని కాంగ్రెస్ గట్టిగా చెబుతోంది. గత నలభై ఏళ్లుగా అమేథీలో కాంగ్రెస్ కోసం పనిచేస్తున్నానని కిశోరీ లాల్ శర్మ తెలిపారు. అమేథి తన సొంత ప్రాంతమని.. ఇక్కడి ప్రజల మధ్య తాను ఉంటున్నానని.. ఈ ప్రాంతంలో పరిస్థితి అంతా తనకు తెలుసంటున్నారు. స్మృతి ఇరానీ అమేథీలో ఇల్లు కట్టుకున్నారు.. కానీ మేము ఇక్కడి ప్రజల హృదయాల్లో ఉన్నామన్నారు.


రాహుల్ పోటీపై..

రాహుల్ గాంధీ అమేథీ నుంచి ఎందుకు పోటీచేయడం లేదనే ప్రశ్నకు కేఎల్ శర్మ స్పందిస్తూ.. రాహుల్ గాంధీ తన సొంత మనిషిని ఇక్కడ అభ్యర్థిగా పెట్టారన్నారు. ఈ నియోజకవర్గంలో విజయం కోసం మేం సిద్ధంగా ఉన్నామని, బూత్ స్థాయిలో పార్టీ బలంగా ఉందన్నారు. తాము ఎన్నికల సమయంలో మాత్రమే యాక్టివ్‌గా ఉండబోమని, ఎప్పుడూ తమ కార్యకర్తలు ప్రజలతోనే ఉంటారని శర్మ చెప్పారు. ఇతర పార్టీల నాయకులపై అనుచిత వ్యాఖ్యలు చేయాల్సిన అవసరం లేదని, తాను విలువలకు కట్టుబడి ఉండే మనిషినని శర్మ చెప్పుకొచ్చారు.అమేథీ అభివృద్ధికి రాజీవ్‌ గాంధీ పునాది వేస్తే.. ఆ తరువాత గాంధీ కుటుంబం అభివృద్ధిని కొనసాగిస్తూ వచ్చిందన్నారు. 1982 నుంచి కాంగ్రెస్ ఈ ప్రాంతాన్ని అభివృద్ధి చేస్తూ వస్తోందన్నారు.

హిందూ జనాభా తగ్గుముఖం..


రామ మందిరంపై కాంగ్రెస్ స్టాండ్..

రామ మందిరం ప్రారంభోత్సవానికి కాంగ్రెస్ ఎందుకు వెళ్లలేదనే ప్రశ్నపై కేఎల్ శర్మ స్పందిస్తూ.. రాముడు ప్రతి హిందువు హృదయంలో ఉంటాడని, అయితే ఆయనను ఎన్నికల రాజకీయాల్లోకి తీసుకురావడం సరికాదన్నారు. రామరాజ్యం విషయానికొస్తే, ఈ విషయాన్ని మొదటగా చెప్పింది రాజీవ్ గాంధీ అన్నారు. రాముడు, రామరాజ్యం విశ్వాసానికి సంబంధించినవని, ఇవి రాజకీయాలకు సంబంధించిన అంశాలు కాదననారు. రాముడిని ఎప్పుడూ రామునిగానే పూజిస్తామని.. ఇదే కాంగ్రెస్ విధానమని శర్మ తెలిపారు.


గెలిచేనా..

అమేథీలో స్మృతి ఇరానీని ఓడించే లక్ష్యంతో కాంగ్రెస్ వ్యూహాలను రూపొందిస్తోంది. 2019 ఓటమికి ప్రతీకారం తీర్చుకోవాలనే లక్ష్యంతో పనిచేస్తోంది. ఐదో విడతలో అమేథీ, రాయ్‌బరేలీలో ఎన్నికలు జరగనున్నాయి. ఇక్కడ ప్రచారం ముగిసే వరకు ప్రియాంక గాంధీ ఎక్కువ సమయంలో ఈ రెండు నియోజకవర్గాల్లోనే కేటాయించేలా ప్లాన్ చేశారు. ఎక్కువమంది ప్రజలను కలుసుకోవడమే లక్ష్యంగా ప్రియాంక గాంధీ ప్రచారం చేస్తున్నారు. మరోవైపు మాజీ సీఎంలను ఈ రెండు నియోజకవర్గాలకు సంబంధించిన పర్యవేక్షణ బాధ్యతలను అప్పగించింది. దీంతో అమేథి, రాయ్‌బరేలీ గెలుచుకోవడమే లక్ష్యంగా కాంగ్రెస్ పార్టీ పనిచేస్తున్నట్లు తెలుస్తోంది. కాంగ్రెస్ వ్యూహం ఫలిస్తుందా లేదా అనేది జూన్4న తేలనుంది.


Supreme Court: విచారణ సమయంలో రాజకీయాలు చేయొద్దు.. పశ్చిమబెంగాల్ కేసులో సుప్రీం సూచన

మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Read Latest News and National News click here..

Updated Date - May 09 , 2024 | 11:20 AM