Share News

Vande Bharat: వందేభారత్ రైలు కాంట్రాక్ట్ 50 శాతం పెరిగిందా? రైల్వే శాఖ ఏమందంటే?

ABN , Publish Date - Sep 16 , 2024 | 04:23 PM

వందేభారత్ రైలు కాంట్రాక్టుపై తృణమూల్ కాంగ్రెస్ ఎంపీ సాకేత్ గోఖలే సోమవారంనాడు సంచలన ఆరోపణ చేశారు. అయితే కొద్దిసేపటికే రైల్వే మంత్రిత్వ శాఖ దీనికి కౌంటర్ ఇచ్చింది.

Vande Bharat: వందేభారత్ రైలు కాంట్రాక్ట్ 50 శాతం పెరిగిందా? రైల్వే శాఖ ఏమందంటే?

న్యూఢిల్లీ: వందేభారత్ రైలు (Vande Bharat Train)కాంట్రాక్టుపై తృణమూల్ కాంగ్రెస్ (TMC) ఎంపీ సాకేత్ గోఖలే (Saket Gokhale) సోమవారంనాడు సంచలన ఆరోపణ చేశారు. అయితే కొద్దిసేపటికే ఎంపీ వ్యాఖ్యలను రైల్వే మంత్రిత్వ శాఖ కొట్టివేసింది. తప్పుడు సమాచారం వ్యాప్తి చేయవద్దని కోరింది.


వందేభారత్ స్లీపర్ ట్రైన్ కాంట్రాక్టును నరేంద్ర మోదీ ప్రభుత్వం 50 శాతం పెంచిందని సాకేత్ గోఖలే సామాజిక మాధ్యమం 'ఎక్స్'లో పోస్ట్ చేశారు. ''వందే భారత్ స్లీపర్ ట్రైన్స్ తయారీకి అయ్యే రూ.58,000 కోట్ల కాంట్రాక్టును మోదీ ప్రభుత్వం సవరించింది. ఇంతకుముందు ఒక కోచ్ తయారీకి రూ.290 కోట్లు అయ్యేది. ఇప్పడు అది రూ.436 కోట్లు అయింది. కేవలం ఏసీ కోచ్‌లతో పేదవాళ్లకు అందుబాటులో లేని ట్రైన్ ఇది. వందే భారత్ కాంట్రాక్ట్‌ను 50 శాతం పెంచడం వల్ల లబ్ధి పొందేదెవరు?'' అని ఆయన ప్రశ్నించారు.

Indian Railways: వందే భారత్ పేరు మారింది.. కొత్త పేరిదే


అసత్య ప్రచారం చేయొద్దన్న రైల్వే శాఖ

ఎంపీ గోఖలే చేసిన ఆరోపణలపై రైల్వే శాఖ వెంటనే స్పందించింది. తప్పుడు సమాచారాన్ని వ్యాప్తి చేయవద్దని ఎంపీని ఒక ట్వీట్‌లో కోరింది. స్లీపర్ ప్రాజెక్టులో ఒక్కో కోచ్‌ ధర అన్ని బెంచ్‌మార్స్స్‌ కంటే తక్కువనీ, పారదర్శకంగా సాగిన ప్రక్రియే ఇందుకు కారణమని తెలిపింది.


మరింత వివరణ..

రైల్వే శాఖ మరింత వివరణ ఇస్తూ..''కోచ్‌ల సంఖ్యను మేము 16 నుంచి 24కు పెంచాం. ట్రైన్ ట్రావెల్‌కు డిమాండ్ ఎక్కువ కావడమే ఇందుకు కారణం. ఇంతకుముందు: 200 రైళ్లు x 16 కోచ్‌లు = 3200. సవరించినది: 133 రైళ్లు x 24 కోచ్‌లు = 3192. నిజానికి మొత్తం కాంట్రాక్టు వాల్యూ తగ్గింది. రైలు బోగీలు పెరిగేకొద్దీ కొంత పొదుపు చోటుచేసుకోవడమే ఇందుకు కారణం. రైలు ప్రయాణానికి పెరుగుతున్న డిమాండ్‌ను దృష్టిలో ఉంచుకుని రికార్డు సంఖ్యలో 12000 నాన్ ఏసీ బోగీలను రూపొందించాం'' అని రైల్వే శాఖ మరింత స్పష్టత ఇచ్చింది.


For MoreNational NewsandTelugu News

Also Read:Uttar Pradesh: భారీ వర్షాలతో యూపీ అతలాకుతలం : 14 మంది మృతి

Also Read:Uttar Pradesh: మళ్లీ తోడేలు దాడి: బాధిత కుటుంబాలతో సీఎం యోగి భేటీ

Updated Date - Sep 16 , 2024 | 04:23 PM