Share News

TamilNadu: రోడ్డుపైకి భారీగా చేరిన నురగ.. ఎందుకంటే..

ABN , Publish Date - Oct 24 , 2024 | 05:52 PM

తమిళనాడులోని హోసూరులో గత 24 గంటలుగా ఎడతెరపి లేకుండా భారీ వర్షం కురిసింది. దీంతో సమీపంలోని రిజర్వాయర్లు నీటితో నిండిపోయాయి. ఆ నీటికి కిందకి వదిలారు. ఆ క్రమంలో హోసూరు రహదారిపైకి భారీగా విషపూరితమైన నురగ వచ్చి చేరింది. దాదాపు 5 అడుగుల మేర ఈ నురుగ ఏర్పడింది. దీంతో వాహనాలను మరో మార్గంలో మళ్లిస్తున్నారు.

TamilNadu: రోడ్డుపైకి భారీగా చేరిన నురగ.. ఎందుకంటే..

చెన్నై, అక్టోబర్ 24: తమిళనాడులోని హోసూరులో గురువారం ఉదయం భారీ వర్షం కురిసింది. దీంతో హోసూర్‌ రహదారిపై విషపూరితమైన నురుగ పెద్ద ఎత్తున చేరింది. దాదాపు 5 అడుగుల ఎత్తున ఈ నురుగ చేరడంతో.. రహదారిపై రాకపోకలు నిలిచిపోయాయి. ఈ నేపథ్యంలో ట్రాఫిక్‌కు మరో మార్గంలో మళ్లించారు. ఈ మేరకు కృష్ణగిరి జిల్లా ఎస్పీ వెల్లడించారు. మరోవైపు రహదారిపై ఏర్పడిన ఈ నురగను తొలగించేందుకు సహాయ బృందాలు రంగంలోకి దిగాయి. గత 24 గంటల్లో హోసురులో 11 సెంటి మీటర్లకు పైగా వర్షం పడిందని వాతావరణ కేంద్రం తెలిపింది.

Also Read: Ram Mohan Naidu: ఇది చారిత్రాత్మకమైన రోజు


ఈ భారీ వర్షాలతో కెలవరపల్లి రిజర్వాయర్‌లో నీటి నిల్వ స్థాయి భారీగా పెరిగింది. దీంతో ఆ నీటిని తేనెపెన్నైన్ నదిలోకి వదిలారు. దాంతో హోసూరు రహదారిపైకి నురగ వచ్చి చేరింది. అయితే ఇంత పెద్ద ఎత్తున నురగ ఏర్పడడంపై పలు సందేహాలు సైతం వ్యక్తమవుతున్నాయి. ఇంకోవైపు పొరుగునున్న కర్ణాటకలోని పలు పారిశ్రామిక సంస్థలు వర్షాన్ని అవకాశంగా తీసుకుని నదిలోకి భారీగా వ్యర్థాలను విడుదల చేసి ఉండవచ్చుననే సందేహాన్ని ఉన్నతాధికారులు వ్యక్తం చేస్తున్నారు.

Also Read: Viral Video: నడిరోడ్లపై సొంత కార్లు వదిలి నడుచుకుంటూ వెళ్లిపోతున్నారు.. ఎక్కడంటే.. ?

Also Read: తలతిరుగుడు తగ్గాలంటే ఈ చిట్కాలు పాటించండి..


ఈ కారణంగానే నీటిలో విషపూరిత నురుగ వచ్చి చేరిందని వారు అభిప్రాయపడుతున్నారు. ఇక ఇంత భారీగా నురుగ ఏర్పడడానికి గల కచ్చితమైన కారణాలపై ఉన్నతాధికారులు ఆరా తీస్తున్నారు. మరోవైపు తమిళనాడులోని హోసూరు కర్ణాటక రాజధాని బెంగళూరుకు కేవలం 40 కిలోమీటర్ల దూరంలో ఉంది.

For National News And Telugu News...

Updated Date - Oct 24 , 2024 | 06:07 PM