Share News

TVK: టీవీకే పార్టీపై ఇంటెలిజెన్స్‌ నిఘా..

ABN , Publish Date - Nov 20 , 2024 | 12:51 PM

ప్రముఖ సినీనటుడు విజయ్‌(Vijay) నేతృత్వంలోని తమిళ వెట్రి కళగం (టీవీకే)కు రాష్ట్రవ్యాప్తంగా ఏ మేరకు మద్దతు లభిస్తోందన్న వ్యవహారంపై రాష్ట్ర ఇంటెలిజెన్స్‌(State Intelligence) విభాగం ఆరా తీ స్తోంది. శాసనసభ ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా ఇటీవల విక్రవాండిలో నిర్వహించిన టీవీకే తొలి మహానాడుకు ఐదు లక్షలమందికిపైగా జనసమీకరణ ఎలా సాధ్యమైందనే విషయమై ఇంటెలిజెన్స్‌ అధికారులు వివరాలు రాబడుతున్నారు.

TVK: టీవీకే పార్టీపై ఇంటెలిజెన్స్‌ నిఘా..

చెన్నై: ప్రముఖ సినీనటుడు విజయ్‌(Vijay) నేతృత్వంలోని తమిళ వెట్రి కళగం (టీవీకే)కు రాష్ట్రవ్యాప్తంగా ఏ మేరకు మద్దతు లభిస్తోందన్న వ్యవహారంపై రాష్ట్ర ఇంటెలిజెన్స్‌(State Intelligence) విభాగం ఆరా తీ స్తోంది. శాసనసభ ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా ఇటీవల విక్రవాండిలో నిర్వహించిన టీవీకే తొలి మహానాడుకు ఐదు లక్షలమందికిపైగా జనసమీకరణ ఎలా సాధ్యమైందనే విషయమై ఇంటెలిజెన్స్‌ అధికారులు వివరాలు రాబడుతున్నారు.

ఈ వార్తను కూడా చదవండి: Chennai: తెలుగు జాతి ఉన్నంత వరకు టీడీపీ ఉండాలి..


మహానాడుకు వచ్చినవారంతా విజయ్‌ సినిమా నటుడని వచ్చారా లేక పార్టీ పై అభిమానంతో వచ్చారా అనే విషయంపై కూపీ లాగుతున్నారు. అదే సమయంలో మహానాడు ఏర్పాట్లకు విరాళాలిచ్చిన ప్రముఖుల వివరాలను కూడా ఇంటెలిజెన్స్‌ అధికారులు సేకరిస్తున్నారు. పార్టీలో కొత్తగా చేరుతున్న వారి వివరాలు, ఎన్నికల పొత్తుపై ప్రధాన పార్టీల నేతలతో జరుపుతున్న చర్చల గురించి కూడా ఇంటెలిజెన్స్‌ అధికారులు వివరాలు సేకరించించి రాష్ట్ర ప్రభుత్వానికి త్వరలో సమర్పించనున్నారని తెలుస్తోంది.

nani2.2.jpg


2 వేల ఇళ్లపై ఎగిరిన టీవీకే జెండాలు...

పుదుకోట(Pudukota) జిల్లా గంధర్వకోట సమీపంలో గత రెండు రోజులుగా రెండు వేలకు పైగా ఇళ్లపై టీవీకే(TVK) జెండాలను స్థానికులు ఎగరేసారు. పార్టీ పతాక ఆవిష్కరణకు స్థానిక నాయకులు పోలీసుల అనుమతి కోరగా, పోలీసులు అనుమతివ్వలేదు. దీంతో స్థానిక నాయకులు ఇళ్లపై జెండాలను ఎగరేసారు.


ఈవార్తను కూడా చదవండి: శబరిమలకు 18 ప్రత్యేక రైళ్లు

ఈవార్తను కూడా చదవండి: చేసింది చెప్పలేక కేసీఆర్‌ను తిడతావా..

ఈవార్తను కూడా చదవండి: మళ్లీ పుంజుకున్న బంగారం, వెండి ధరలు.. తులం ఎంతంటే..

ఈవార్తను కూడా చదవండి: సగం పోలీసు స్టేషన్లలో సీసీ కెమెరాల్లేవు

Read Latest Telangana News and National News

Updated Date - Nov 20 , 2024 | 12:51 PM