Delhi Rains: ఢిల్లీలో వర్ష బీభత్సం..
ABN , Publish Date - Aug 01 , 2024 | 08:52 AM
దేశ రాజధాని ఢిల్లీ వర్ష బీభత్సంతో చిగురుటాకులా వణుకుతోంది. ఎడతెరపి లేకుండా వాన కురవడంతో జనజీవనం ఎక్కడికక్కడే స్తంభించిపోయింది. బుధవారం సాయంత్రం నుంచి భారీ వర్షం కురుస్తోంది. దీంతో పలు ప్రాంతాలు వర్షపునీటితో మునిగాయి. కొందరు వరదనీటిలోనే ఉండాల్సి వచ్చింది. మురికినీటి కాలువలో ఓ మహిళ కుమారుడితో సహా పడిపోయింది. వారిద్దరూ చనిపోయారని అధికారులు ప్రకటించారు.
ఢిల్లీలో వర్ష బీభత్సం
ఏడుగురు మృతి
కాలువలో పడ్డ తల్లి, కుమారుడు
వర్ష ప్రభావంతో విమాన రాకపోకలకు అంతరాయం
10 విమానాలు దారి మళ్లింపు
వర్షాలతో ఈ రోజు స్కూళ్లకు సెలవు
మరో నాలుగు రోజులు వర్షాలు: ఐఎండీ
ఢిల్లీ: దేశ రాజధాని ఢిల్లీ (Delhi) వర్ష బీభత్సంతో చిగురుటాకులా వణుకుతోంది. ఎడతెరపి లేకుండా వాన కురవడంతో జనజీవనం ఎక్కడికక్కడే స్తంభించిపోయింది. బుధవారం సాయంత్రం నుంచి భారీ వర్షం కురుస్తోంది. దీంతో పలు ప్రాంతాలు వర్షపునీటితో మునిగాయి. కొందరు వరదనీటిలోనే ఉండాల్సి వచ్చింది. మురికినీటి కాలువలో ఓ మహిళ కుమారుడితో సహా పడిపోయింది. వారిద్దరూ చనిపోయారని అధికారులు ప్రకటించారు. వర్ష ప్రభావంతో ఢిల్లీ విమానాశ్రయంలో విమానాలు నిలిపే పరిస్థితి లేదు. 10 విమానాలను దారి మళ్లించారు. 8 విమానాలు జైపూర్, రెండు విమానాలు లక్నోకు డైవర్ట్ చేశారు.
విషాదం..
తూర్పు ఢిల్లీలో గల ఘాజిపూర్లో విషాదం నెలకొంది. తనూజ కుమారుడితో కలిసి వార సంతలో కూరగాయాలు కొనేందుకు వచ్చింది. వారిద్దరూ ప్రమాదవశాత్తు మురికినీటి కాలువలో పడిపోయారు. ఆ నాలలో పడి చని పోయారు. ఆ నాలా నిర్మాణంలో ఉందని పోలీసులు వివరించారు. దాని లోతు 15 ఫీట్ల వరకు ఉంటుందని, వెడల్పు ఆరు ఫీట్లు ఉందని పేర్కొన్నారు. చనిపోయిన ఇద్దరు మృతదేహాలను వెలికి తీశామని తెలిపారు. వర్ష ప్రభావంతో మరో ఐదుగురు కూడా చనిపోయారు.
స్కూళ్లకు సెలవు
వర్ష ప్రభావంతో గురువారం ఢిల్లీలో పాఠశాలలకు సెలవు ప్రకటించారు. ఈ మేరకు విద్యాశాఖ మంత్రి అతిషి ప్రకటన చేశారు. ఢిల్లీలో మరో నాలుగు రోజులు వర్ష ప్రభావం ఉంటుందని వాతావరణ శాఖ ప్రకటన చేసింది. ఆగస్ట్ 5వ తేదీ వరకు ఉరుములు, మెరుపులతో కూడిన వాన పడుతుందని తెలిపింది.
కూలిన ఇళ్లు
భారీ వర్షాలతో సబ్జీ మండి ఏరియాలో ఓ ఇళ్లు కూలిపోయింది. ఆ ఘటనలో ఒకరు గాయపడ్డారు. ఘటనా స్థలానికి అగ్నిమాపక సిబ్బంది చేరుకున్నారు. వర్షాలతో ఇబ్బంది కలుగకుండా సహాయక చర్యలు చేపట్టారు. వసంత్ కంజ్లో గోడ కూలి ఓ మహిళ గాయపడింది. దర్యాగంజ్లో ఓ ప్రైవేట్ పాఠశాల గోడ కూలింది. కారు పార్కింగ్ ఏరియాలో పడటంతో అక్కడున్న కారు దెబ్బతింది. ఆ వీడియోను షేర్ చేయడంతో సోషల్ మీడియాలో తెగ చక్కర్లు కొడుతుంది.
Read More National News and Latest Telugu News