Share News

Udayanidhi: వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లోనూ విజయం మాదే...

ABN , Publish Date - Jun 16 , 2024 | 12:22 PM

ముగిసిన సార్వత్రిక ఎన్నికల్లో విజయం సాధించినట్టుగానే రానున్న అసెంబ్లీ ఎన్నికల్లో కూడా విజయం సాధిస్తామని రాష్ట్ర మంత్రి ఉదయనిధి స్టాలిన్‌(Minister Udayanidhi Stalin) జోస్యం చెప్పారు.

Udayanidhi: వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లోనూ విజయం మాదే...

  • మంత్రి ఉదయనిధి స్టాలిన్‌

చెన్నై: ముగిసిన సార్వత్రిక ఎన్నికల్లో విజయం సాధించినట్టుగానే రానున్న అసెంబ్లీ ఎన్నికల్లో కూడా విజయం సాధిస్తామని రాష్ట్ర మంత్రి ఉదయనిధి స్టాలిన్‌(Minister Udayanidhi Stalin) జోస్యం చెప్పారు. తిరుపూరు జిల్లా మంగలంలో జరిగిన కలైంజర్‌ శతజయంతి వేడుకల్లో ఆయన పాల్గొని ప్రసంగించారు. కలైంజర్‌ శతజయంతి వేడుకలను పురస్కరించుకుని ప్రతి నియోజకవర్గంలో కలైంజర్‌ పేరుతో గ్రంథాలయాన్ని ప్రారంభిస్తున్నామన్నారు. ముగిసిన సార్వత్రిక ఎన్నికల్లో 100 శాతం విజయాన్ని ప్రజలు అందించారన్నారు.

ఇదికూడా చదవండి: Hyderabad: రేపు ఖైరతాబాద్‌ గణేశ్‌ కర్రపూజ


గత ఎన్నికల్లో ఇచ్చిన హామీలను ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్‌(Chief Minister MK Stalin) నెరవేర్చుతున్నారని గట్టిగా భావించడం వల్లే అమోఘమైన విజయాన్ని అందించారన్నారు. రానున్న అసెంబ్లీ ఎన్నికల్లో కూడా ఇదే తరహాలో విజయం సాధిస్తామని ఆయన జోస్యం చెప్పారు. లోక్‌సభ ఎన్నికల్లో 100 శాతం విజయాన్ని అందించిన ఓటర్లకు, సీఎం స్టాలిన్‌కు, కలైంజర్‌ శతజయంతి ముగింపు వేడుకలను ఒకే వేదికగా శనివారం నిర్వహించామని ఆయన పేర్కొన్నారు.


ఇదికూడా చదవండి: Hyderabad: మీపై ఫెమా కేసు.. అరెస్ట్‌ తప్పదంటూ బెదిరింపులు

Read Latest Telangana News and National News

Read Latest AP News and Telugu News

Updated Date - Jun 16 , 2024 | 12:22 PM