Share News

దీపావళి వేడుకలో మద్యం, మాంసాహారం

ABN , Publish Date - Nov 16 , 2024 | 04:11 AM

దీపావళి సందర్భంగా యూకే ప్రభుత్వం అక్టోబరు 29న నిర్వహించిన వేడుకలో అతిథులకు మద్యం, మాంసాహారం అందించడంపై విమర్శలు వెల్లువెత్తడంపై ఆ దేశ ప్రధాన మంత్రి కీర్‌ స్టార్మర్‌ స్పందించారు.

దీపావళి వేడుకలో మద్యం, మాంసాహారం

  • బ్రిటీష్‌ హిందువులకు యూకే ప్రధాని ఆఫీసు క్షమాపణ

న్యూఢిల్లీ, నవంబరు 15: దీపావళి సందర్భంగా యూకే ప్రభుత్వం అక్టోబరు 29న నిర్వహించిన వేడుకలో అతిథులకు మద్యం, మాంసాహారం అందించడంపై విమర్శలు వెల్లువెత్తడంపై ఆ దేశ ప్రధాన మంత్రి కీర్‌ స్టార్మర్‌ స్పందించారు. జరిగిన పొరపాటును తెలుసుకున్నామని, ఇలాంటివి పునరావృతం కాకుండా చూసుకుంటామని బ్రిటీష్‌ హిందువులకు క్షమాపణలు చెప్పారు. ఇందుకు సంబంధించి యూకే ప్రధాని కార్యాలయం శుక్రవారం ఓ ప్రకటన విడుదల చేసింది. దీపావళి వేడుకలో మద్యం, మాంసాహారం అందించడంతో హిందువుల మనోభావాలు దెబ్బతిన్నాయని బ్రిటీష్‌ ఇండియన్‌, కన్జర్వేటివ్‌ పార్టీ ఎంపీ శివానీ రాజ గురువారమే ప్రధానికి లేఖ రాశారు. నిర్వాహకులకు హిందూ సంప్రదాయాలపై కనీస అవగాహన లేకపోవడం శోచనీయమని ఆమె పేర్కొన్నారు.

Updated Date - Nov 16 , 2024 | 04:11 AM