Share News

Wayanad landslides: మృతదేహల కోసం కొనసాగుతున్న గాలింపు

ABN , Publish Date - Aug 12 , 2024 | 09:13 PM

ప్రకృతి సృష్టించి బీభత్సంతో కేరళలో వయనాడ్ జిల్లాలోని పలు ప్రాంతాలు అతలాకుతలమైనాయి. దాంతో గల్లంతైన వారిలో పలువురి ఆచూకీ నేటికి లభ్యం కాలేదు. దీంతో ఓ వైపు పోలీసులు, అగ్నిమాపక సిబ్బంది, సహాయక బృందాలు గాలింపు జరుపుతుంటే.. మరోవైపు బాధిత బంధువులతో పాటు ప్రజలు సైతం గాలింపు చర్యల్లో పాల్గొంటున్నారు.

Wayanad landslides: మృతదేహల కోసం కొనసాగుతున్న గాలింపు

తిరువనంతపురం, ఆగస్ట్ 12: ప్రకృతి సృష్టించి బీభత్సంతో కేరళలో వయనాడ్ జిల్లాలోని పలు ప్రాంతాలు అతలాకుతలమైనాయి. దాంతో గల్లంతైన వారిలో పలువురి ఆచూకీ నేటికి లభ్యం కాలేదు. దీంతో ఓ వైపు పోలీసులు, అగ్నిమాపక సిబ్బంది, సహాయక బృందాలు గాలింపు జరుపుతుంటే.. మరోవైపు బాధిత బంధువులతో పాటు ప్రజలు సైతం గాలింపు చర్యల్లో పాల్గొంటున్నారు. ఆ క్రమంలో చెలియార్ నదీ సమీపంలోని ముండేరి, కొట్టుపర ప్రాంతాల్లో రెండు మృతదేహాలను కనుగొన్నారు.

Also Read: Pune Airport: నకిలీ విమాన టికెట్లతో ఇద్దరు వ్యక్తులు అరెస్ట్


అలాగే సూచిప్పర వాటర్ ఫాల్స్ సమీపంలో మరో రెండు మృతదేహాలను గుర్తించారు. దీంతో వాటిని అధికారుల సహాయంలో నిలాంబుర్ జిల్లా ఆసుపత్రికి తరలించారు. మరికొన్ని మృతదేహాలు లభ్యం కావాల్సి ఉంది. ఈ నేపథ్యంలో ఆరు జోనులు.. ముండక్కై, చూరల్మల, పున్చిరిమట్టంతోపాటు చలియార్ నది పరివాహక ప్రాంతంలో గాలింపు చర్యలను తీవ్రతరం చేశారు. ఇక ప్రత్యేక బృందాలు కాంతన్‌పరా, సూచిప్పర్ వద్ద గాలింపు చర్యలు కొనసాగిస్తున్నాయి. అలాగే కొండ చరియల కింద సైతం ఇంకా మృతదేహాలు ఉంటాయని భావిస్తున్నారు. దీంతో ఆ దిశగా గాలింపు చర్యలు చేపట్టారు.

Kolkata Doctor murder Case: ట్రైయినీ వైద్యురాలి కేసులో కీలక పరిణామం


మరోవైపు ఈ విపత్తులో మరణించిన వారి డీఎన్ఏ నివేదిక సోమవారం నుండి అందుబాటులో ఉంచుతామని కేరళ రెవెన్యూ శాఖ మంత్రి కె రాజన్ వెల్లడించారు. ఈ డీఎన్ఏ ఫలితాల ఆధారంగా ప్రాణాలతో ఉన్న వారి సమీప బంధువులను గర్తించ గలిగే వీలు కులుగుతుందన్నారు. పునరావాస కేంద్రాలు ఆగస్ట్‌ మాసంలో సైతం కొనసాగిస్తామని ఈ సందర్భంగా మంత్రి స్పష్టం చేశారు.

Also Read: Doctor's Murder Case: సీఎం మమతా బెనర్జీకి ప్రియాంక గాంధీ విజ్ఞప్తి


ఈ పునరావాస కేంద్రాల్లో ఆశ్రయం పొందుతున్న వారికి ఎప్పుడు ఎక్కడ ఎటువంటి ఇబ్బందులు కలగ కుండా చర్యలు తీసుకుంటామన్నారు. అలాగే వయనాడ్‌లోని ప్రకృతి బీభత్సం సృష్టించిన ప్రాంతాలు.. చూరల్మల, ముండక్కై ప్రాంతాల్లో ప్రజలు తీసుకున్న రుణాలను మాఫీ చేస్తానమి కేరళ బ్యాంక్ సోమవారం నిర్ణయించిన విషయాన్ని మంత్రి ఈ సందర్భంగా గుర్తు చేశారు.

Also Read: Kolkata Trainee Doctor Case: ఆర్ జీ కర్ మెడికల్ కాలేజీ ప్రిన్సిపాల్ రాజీనామా


ఇక ఆగస్గ్ 10వ తేదీ ప్రధాని నరేంద్రమోదీ.. వయనాడ్‌లోని కొండ చరియలు విరిగి పడిన ప్రాంతాన్ని సీఎం పినరయ్ విజయన్‌తో కలిసి ఏరియల్ వ్యూ ద్వారా పరిశీలించారు. అనంతరం ఆ ప్రభావిత ప్రాంతానికి వారు చేరుకున్నారు. బాధితులతో కలిసి ఆయన స్వయంగా మాట్లాడారు. పునరావాస కేంద్రాల్లో ఆశ్రయం పొందతున్న వారిని సైతం ప్రధాని మోదీ కలిసి మాట్లాడిన సంగతి తెలిసిందే.

Also Read: Unrest In Bangladesh: భారత్‌లో ఆవాల పరిశ్రమకు గట్టి దెబ్బ


ఈ వయనాడ్‌లో ప్రకృతి సృష్టించిన బీభత్సాన్ని జాతీయ విపత్తుగా పరిగణించాలని సర్వత్ర డిమాండ్ వ్యక్తమవుతున్న విషయం విధితమే. ఇప్పటికే లోక్‌సభలో ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ వయనాడ్‌లో పర్యటించారు. వారు సైతం దీనిని ప్రకృతి విపత్తుగా ప్రకటించాలని ప్రధాని మోదీని డిమాండ్ చేశారు.

Also Read: Independence Day: వరుసగా 11వ సారి ప్రధానిగా మోదీ..

Read More National News and Latest Telugu News

Updated Date - Aug 12 , 2024 | 09:17 PM