Share News

Rajiv Kumar: ఏకకాలంలో రెండేసి రాష్ట్రాలకు ఎన్నికలు: రాజీవ్ కుమార్

ABN , Publish Date - Aug 16 , 2024 | 04:23 PM

లోక్‌సభ ఎన్నికలు ముగిసిన తర్వాత తిరిగి పలు రాష్ట్రాల్లో అసెంబ్లీ ఎన్నికల నిర్వహణకు కేంద్ర ఎన్నికల కమిషన్ కసరత్తు చేస్తోంది. ఇందులో భాగంగా జమ్మూకశ్మీర్, హర్యానా అసెంబ్లీ ఎన్నికల షెడ్యూల్‌ను ప్రధాన ఎన్నికల కమిషనర్ రాజీవ్ కుమార్ శుక్రవారం ప్రకటించారు. మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల షెడ్యూల్‌‌ తర్వాత ప్రకటిస్తామని తెలిపారు.

Rajiv Kumar: ఏకకాలంలో రెండేసి రాష్ట్రాలకు ఎన్నికలు: రాజీవ్ కుమార్

న్యూఢిల్లీ: లోక్‌సభ ఎన్నికలు ముగిసిన తర్వాత తిరిగి పలు రాష్ట్రాల్లో అసెంబ్లీ ఎన్నికల నిర్వహణకు కేంద్ర ఎన్నికల కమిషన్ (ECI) కసరత్తు చేస్తోంది. ఇందులో భాగంగా జమ్మూకశ్మీర్ (Jammu Kashmir), హర్యానా(Haryana) అసెంబ్లీ ఎన్నికల షెడ్యూల్‌ను ప్రధాన ఎన్నికల కమిషనర్ రాజీవ్ కుమార్ శుక్రవారం ప్రకటించారు. మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల షెడ్యూల్‌‌ తర్వాత ప్రకటిస్తామని తెలిపారు.

ECI: జమ్మూకశ్మీర్, హర్యానా అసెంబ్లీ ఎన్నికల షెడ్యూల్‌ విడుదల


దీనిపై రాజీవ్ కుమార్ మరింత వివరణ ఇస్తూ, గత పర్యాయం మహారాష్ట్ర, హర్యానా అసెంబ్లీ ఎన్నికలను ఏకకాలంలో నిర్వహించామని, అప్పుడు జమ్మూకశ్మీర్ ఎన్నికల అంశం తెరపైకి రాలేదని అన్నారు. ఈ ఏడాది నాలుగు ఎన్నికలు ఉన్నాయని, ఇవి పూర్తయిన వెంటనే ఐదో రాష్ట్రానికి అసెంబ్లీకి ఎన్నికలు ఉంటాయని చెప్పారు. జమ్మూకశ్మీర్, హర్యానా, మహారాష్ట్ర, జార్ఖాండ్, ఢిల్లీ ఎన్నికలు వరుసగా జరగాల్సి ఉన్నాయని చెప్పారు. భద్రతా బలగాలు అందుబాటులో ఉండే విషయాన్ని పరిగణనలోకి తీసుకుని రెండేసి రాష్ట్రాల అసెంబ్లీలకు ఒకేసారి ఎన్నికలు నిర్వహించాలని నిర్ణయించినట్టు చెప్పారు. దీనికి తోడు, మహారాష్ట్రలో వర్షాలు కురుస్తుండటంతో పాటు వరుసగా పలు పండుగలు ఉండటం కూడా కారణాలని చెప్పారు.

Read More National News and Latest Telugu News

Updated Date - Aug 16 , 2024 | 04:23 PM