Share News

West Bengal: పదేళ్ల బాలికపై హత్యాచారం...పోలీస్ స్టేషన్‌ను తగులబెట్టిన ఆందోళనకారులు

ABN , Publish Date - Oct 05 , 2024 | 03:20 PM

నాలుగో తరగతి చదువుకుంటున్న విద్యార్థిని శుక్రవారం రాత్రి ట్యూషన్ నుంచి ఇంటికి తిరిగి వస్తుండగా కనిపించకుండా పోయింది. శనివారం ఉదయం ఆమె మృతదేహం కనిపించింది. దుండగులు ఆమెపై అత్యాచారం జరిపి హత్యానంతరం మృతదేహాన్ని కాలువ పక్కన విసిరేశారు.

West Bengal: పదేళ్ల బాలికపై హత్యాచారం...పోలీస్ స్టేషన్‌ను తగులబెట్టిన ఆందోళనకారులు

కోల్‌కతా: పశ్చిమబెంగాల్‌ (West Bengal)లోని సౌత్ 24 పరిగణాల జిల్లాలో మరో ఘాతుకం చోటుచేసుకుంది. పదేళ్ల బాలికపై అత్యాచారం జరిపి హత్య చేసిన ఘటన తీవ్ర ఉద్రిక్తతలకు దారితీసింది. బాలిక మృతదేహం కృపాఖాలి గ్రామంలోని గంగానది ఒడ్డున కనిపించడంతో ప్రజలు ఆందోళనకు దిగారు. సమీపంలోని పోలీస్ స్టేషన్‌కు ఆందోళనకారులు నిప్పుపెట్టారు.

Toilet Tax: హిమాచల్‌లో ‘టాయిలెట్‌ ట్యాక్స్‌’ దుమారం


నాలుగో తరగతి చదువుకుంటున్న విద్యార్థిని శుక్రవారం రాత్రి ట్యూషన్ నుంచి ఇంటికి తిరిగి వస్తుండగా కనిపించకుండా పోయింది. శనివారం ఉదయం ఆమె మృతదేహం కనిపించింది. దుండగులు ఆమెపై అత్యాచారం జరిపి హత్యానంతరం మృతదేహాన్ని కాలువ పక్కన విసిరేశారు. హత్యాచార ఘటన వెలుగుచూడటంతో పరిస్థితి ఒక్కసారిగా ఉద్రిక్తంగా మారింది. కుల్టాలి పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు కోసం మైనర్ బాలిక కుటుంబ సభ్యులు వెళ్లినప్పుడు వారిని వేధించినట్టు ఆరోపణలు వచ్చాయి. దీంతో ఆగ్రహానికి గురైన స్థానికులు జయనగర్ ప్రాంతంలోని రోడ్డును దిగ్బంధం చేశారు. కొందరు నిరసనకారులు పోలీస్ స్టేషన్‌లోని కొంత భాగానికి నిప్పుపెట్టారు. స్థానికుల ఆందోళనతో హత్యాచార ఘటనకు కారణంగా అనుమానిస్తున్న ఒక వ్యక్తిని పోలీసులు అదుపులోనికి తీసుకుని విచారణ చేస్తున్నారు.


Read Latest and National News

ఈ వార్తలు కూడా చదవండి...

PM Internship: పీఎం ఇంటర్న్‌షిప్‌ పోర్టల్‌లో 2,200 వేకెన్సీలు

Haryana Elections: హరియాణాలో ప్రశాంతంగా సాగుతున్న పోలింగ్.. ఓటు హక్కు వినియోగించుకుంటున్న ప్రముఖులు

Updated Date - Oct 05 , 2024 | 03:20 PM