Share News

Ganga: రూ.20,000 కోట్లు ఖర్చయినా 'గంగ' మురికి పోలేదేం?.. మోదీకి కాంగ్రెస్ వరుస ప్రశ్నలు

ABN , Publish Date - May 14 , 2024 | 08:56 PM

ప్రధానమంత్రి నరేంద్ర మోదీ బీజేపీ అభ్యర్థిగా తన సొంత నియోజకవర్గమైన వారణాసిలో మూడోసారి నామినేషన్ వేసిన నేపథ్యంలో ఆయనపై కాంగ్రెస్ పార్టీ వరుస ప్రశ్నలు సంధించింది. సొంత నియోజకవర్గంలో వైఫల్యాలపై ప్రధాని జవాబివ్వాలంటూ ఆ పార్టీ ప్రధాన కార్యదర్శి జైరామ్ రమేష్ సామాజిక మాధ్యమం 'ఎక్స్'లో ఒక పోస్ట్ చేశారు.

Ganga: రూ.20,000 కోట్లు ఖర్చయినా 'గంగ' మురికి పోలేదేం?.. మోదీకి కాంగ్రెస్ వరుస ప్రశ్నలు

న్యూఢిల్లీ: ప్రధానమంత్రి నరేంద్ర మోదీ (Narendra Modi) బీజేపీ అభ్యర్థిగా తన సొంత నియోజకవర్గమైన వారణాసి (Varanasi)లో మూడోసారి నామినేషన్ వేసిన నేపథ్యంలో ఆయనపై కాంగ్రెస్ (Congress) పార్టీ వరుస ప్రశ్నలు సంధించింది. సొంత నియోజకవర్గంలో వైఫల్యాలపై ప్రధాని జవాబివ్వాలంటూ ఆ పార్టీ ప్రధాన కార్యదర్శి జైరామ్ రమేష్ సామాజిక మాధ్యమం 'ఎక్స్'లో ఒక పోస్ట్ చేశారు.


''ఈరోజు ప్రశ్న: రూ.20,000 కోట్లు ఖర్చు చేసినప్పటికీ గంగ (Ganga) ఎందుకు మురికిగా ఉంది? తన దత్తత గ్రామాలను మోదీ ఎందుకు వదిలేశారు? వారణాసిలో మహాత్మాగాంధీ వారసత్వాన్ని ధ్వంసం చేయాలని మోదీ ఎందుకు నిర్ణయించుకున్నారు?'' అని జైరామ్ రమేష్ వరుస ప్రశ్నలు గుప్పించారు. 2014లో మోదీ వారణాసి వచ్చినడప్పుడు ''గంగా మాత నన్ను పిలిచింది'' అని చెప్పారని, పవిత్ర గంజాజలాలను శుద్ధి చేస్తామని వాగ్దానం చేశారని, అయితే అధికారంలోకి వచ్చిన తర్వాత ''ఆపరేషన్ గంగ'' ఆపరేషన్‌ను ''నమామి గంగే''గా రీబ్రాండ్ చేశారని తెలిపారు. పదేళ్ల తర్వాత ''నమామి గంగే'' ప్రాజెక్టుపై ఖజానాపై రూ.20,000 కోట్ల భారం పడిందని, ఫలితం మాత్రం భిన్నంగా ఉందని చెప్పారు. పొల్యూటెడ్ రీవర్ స్ట్రెచెస్ 51 నుంచి 66కు పెరిగాయని, సురక్షిత స్థాయికి మించి ప్రమాదకర బ్యాక్టీరియా ఉందని 40 రెట్లు ఉందని మానిటరింగ్ స్టేషన్లు రిపోర్ట్ చేశాయని, జలాల్లో యాంటీ బ్యాక్టీరియా రెసిస్టెంట్ బ్యాక్టీరియా ఉన్నట్టు కనుగొన్నారని జైరామ్ రమేష్ వివరించారు. పన్ను చెల్లింపుదారుల 20,000 కోట్లు ఎక్కడికి పోయాయని నిలదీశారు. అవినీతి, నిర్వహణ లోపాలతో ఎంత దారిమళ్లిందని అడిగారు. 'మా గంగా' విషయంలోనూ అబద్ధాలు చెప్పిన ఒక వ్యక్తిని వారణాసి ప్రజలు ఎలా విశ్వసించాలని ప్రశ్నించారు.

PM Modi Assets: మోదీ ఆస్తుల విలువ ఎంతో తెలుసా?


డొమ్రి గ్రామంలో దాదాపు పక్కా ఇళ్లే లేవని, నగెపూర్ గ్రామంలో అన్నీ నాసిరకం రోడ్లేనని, జోగపూర్, జయపూర్‌లోని దళిత వర్గాలకు మరుగుదొడ్లు కానీ, నీళ్లు కానీ లేవని, 'నల్ సే జల్ స్కీమ్' పరంపూర్ గ్రామంలో ఎక్కడా కనిపించదన్నారు. తన దత్తత గ్రామాలను ఎందుకు పట్టించుకోవడం లేదో ప్రధాని చెప్పాలని, మోదీ గ్యారెంటీ అంటే ఇదేనా అని ప్రశ్నించారు. జాతిపిత మహాత్మా గాంధీని విదేశాల్లో పొడిగి, స్వదేశంలో గాంధియన్ సంస్థలకు ఉనికి లేకుండా చేస్తుండటం ప్రధాని హిపోక్రసీని తెలియజేస్తోందన్నారు. గాంధీ కంటే గాడ్సే అంటేనే తనకు ఎక్కువ ఆరాధన అని ప్రధాని బహిరంగంగా ప్రకటించగలరా అని నిలదీశారు.

Read Latest Telangana News and National News

Updated Date - May 14 , 2024 | 08:56 PM