Kejriwal: జైలులోనే కేజ్రీవాల్ కార్యాలయానికి అనుమతి కోరుతాం: మాన్
ABN , Publish Date - Mar 23 , 2024 | 08:47 PM
ఢిల్లీ మద్యం పాలసీకేసులో ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్‌ను జైలుకు పంపినా అక్కడి నుంచే ప్రభుత్వాన్ని నడుపుతారని చెబుతూ వస్తున్న ఆమ్ ఆద్మీ పార్టీ ఆ దిశగా పావులు కదుపుతోంది. జైలులో సీఎం కార్యాలయం ఏర్పాటుకు అనుమతించాలని కోరుతూ కోర్టుకు వెళ్తామని ఆ పార్టీ నేత, పంజాబ్ ముఖ్యమంత్రి భగవంత్ సింగ్ మాన్ శనివారంనాడు తెలిపారు.
న్యూఢిల్లీ: ఢిల్లీ మద్యం పాలసీ (Delhi Excisie Policy) కేసులో ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ (Arvind Kejriwal)ను జైలుకు పంపినా అక్కడి నుంచే ప్రభుత్వాన్ని నడుపుతారని చెబుతూ వస్తున్న ఆమ్ ఆద్మీ పార్టీ (AAP) ఆ దిశగా పావులు కదుపుతోంది. జైలులో సీఎం కార్యాలయం ఏర్పాటుకు అనుమతించాలని కోరుతూ కోర్టుకు వెళ్తామని ఆ పార్టీ నేత, పంజాబ్ ముఖ్యమంత్రి భగవంత్ సింగ్ మాన్ (Bhagwant Singh Mann) శనివారంనాడు తెలిపారు. ఆమ్ ఆద్మీ పార్టీలో కేజ్రీవాల్ స్థానాన్ని ఎవరూ భర్తీ చేయలేరని అన్నారు.
''జైలు నుంచి పాలన సాగించరాదనే రూలు ఎక్కడా రాసి లేదు. దోషిగా నిరూపణ అయ్యేంతవరకూ ఆయన (సీఎం) జైలు నుంచి పని చేయవచ్చని చట్టం చెబతోంది. ప్రభుత్వం పని చేయడానికి వీలుగా జైలులోనే కార్యాలయాన్ని ఏర్పాటుకు సుప్రీంకోర్టు, హైకోర్టును అనుమతి కోరుతాం. అవినీతి వ్యతిరేక ఉద్యమం నుంచి పార్టీ ఏర్పాటు చేసి, పార్టీ సీనియర్ ఫౌండర్ మెంబర్‌గా ఉన్న కేజ్రీవాల్ స్థానాన్ని ఆప్‌లో ఎవరూ భర్తీ చేయలేరు'' అని మాన్ తెలిపారు.
మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..