LokSabha Election Result: రేపు ఆర్ఎస్ఎస్ చీఫ్‌తో సీఎం యోగి భేటీ
ABN , Publish Date - Jun 14 , 2024 | 07:05 PM
సార్వత్రిక ఎన్నికల ఫలితాలు వెలువడిన అనంతరం ఆర్ఎస్ఎస్ చీఫ్ మోహన్ భగవత్ కీలక వ్యాఖ్యలు చేశారు. నిజమైన సేవకుడు అహంకారంతో ఉండడు. ఎవరికీ ఎటువంటి హాని తలపెట్టడంటూ ఆయన పేర్కొన్నారు. దీంతో మోహన్ భగవత్ వ్యాఖ్యలు తీవ్ర సంచలనం సృష్టించాయి.
న్యూఢిల్లీ, జూన్ 14: సార్వత్రిక ఎన్నికల ఫలితాలు వెలువడిన అనంతరం ఆర్ఎస్ఎస్ చీఫ్ మోహన్ భగవత్ కీలక వ్యాఖ్యలు చేశారు. నిజమైన సేవకుడు అహంకారంతో ఉండడు. ఎవరికీ ఎటువంటి హాని తలపెట్టడంటూ ఆయన పేర్కొన్నారు. దీంతో మోహన్ భగవత్ వ్యాఖ్యలు తీవ్ర సంచలనం సృష్టించాయి.
Also Read: Vangalapudi Anitha: హోం శాఖే ఎందుకు..?
అయితే ఆర్ఎస్ఎస్ చీఫ్ మోహన్ భగవత్‌తో ఉత్తరప్రదేశ్ సీఎం యోగి ఆదిత్యనాథ్ రేపు భేటీ కానున్నారు. ఎన్నికల ఫలితాలు వెలువడిన అనంతరం వీరిద్దరు భేటీ కావడం రాజకీయంగా ప్రాధాన్యత సంతరించుకోనుంది. వీరిద్దరి మధ్య లోక్‌సభ ఎన్నికల ఫలితాలతోపాటు యూపీలో ఆర్ఎస్ఎస్ విస్తరL తదితర అంశాలు చర్చకు వచ్చే అవకాశముందని తెలుస్తుంది.
Also Read: Gajuwaka MLA: ఎవరీ పల్లా శ్రీనివాసరావు?
అయితే ఈ ఎన్నికల్లో బీజేపీ కేవలం 240 స్థానాలనే గెలుచుకొంది. దీంతో ప్రభుత్వ ఏర్పాటుకు ఎన్డీయే భాగస్వామ్య పక్షాలు టీడీపీ, జేడీ(యూ) తదితర పార్టీల మద్దతు అవసరమైంది. ఇక 2014,2019 ఎన్నికల్లో ప్రభుత్వ ఏర్పాటుకు అవసరమైన మార్క్ అంటే.. 272 స్థానాలను మించి బీజేపీ స్వయంగా గెలుచుకుంది. కానీ ఈ ఎన్నికల్లో బీజేపీ.. తన లక్ష్యం 400 స్థానాలను పెట్టుకున్నప్పటికీ ఆ లక్ష్యాన్ని చేరుకోలేకపోయింది.
Also Read: Telangana: యూనిట్లు 294.. కరంట్ బిల్లు రూ. 29 కోట్లు
అదీకాక ఉత్తరప్రదేశ్‌లో మొత్తం 80 లోక్‌సభ స్థానాలుంటే వాటిలో బీజేపీ కేవలం 33 స్థానాల్లో మాత్రమే విజయం సాధించింది. ఇక ఇండియా కూటమిలోని కాంగ్రెస్ పార్టీ, సమాజవాదీ పార్టీలు 42 స్థానాలను గెలుచుకుంది. అదీకాక ఈ ఎన్నికల వేళ బీజేపీ అగ్రనేతలు గర్వంతో ప్రచారం నిర్వహించారని.. అందుకే ఆ పార్టీకి ఎంపీ స్థానాలకు భారీగా కోత పడిందనే అపవాదు పడింది. మరోవైపు గత ఎన్నికల్లో యూపీలో 62 ఎంపీ స్థానాలను బీజేపీ గెలుచుకున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలోనే ఆర్ఎస్ఎస్ చీఫ్ మోహన్ భగవత్ ఈ తరహా వ్యాఖ్యలు చేశారనే ఓ చర్చ సైతం కొనసాగుతుంది.