Share News

Karthika Masam : దుబాయ్‌లో ఘనంగా కార్తీక వనభోజన మహూత్సవం

ABN , Publish Date - Nov 21 , 2024 | 02:58 PM

దుబాయితో పాటు అన్ని ఏమిరేట్లలో సనాతనం, సంఘటితం, సత్సంగం , సహకారం, సత్సంబంధం అనే పంచ సూత్రాల ఆధారంగా తెలుగు బ్రహ్మణులు నెలకోల్పిన గాయత్రీ కుటుంబం అనే ప్రవాసీ సంఘం అధ్వర్యంలో వనసమారాధన ఆధ్యంతం కన్నులపండువగా జరిగింది.

Karthika Masam : దుబాయ్‌లో ఘనంగా కార్తీక వనభోజన మహూత్సవం

ఆంధ్రజ్యోతి గల్ఫ్ ప్రతినిధి ఇర్ఫాన్: అనాదిగా వస్తున్న సాంప్రదాయాలకు అనుగుణంగా చాతుర్వర్ణ వ్యవస్థలో అత్యున్నతమైంది బ్రాహ్మణులంటే బ్రహ్మ జ్ఞానం కలవారని అగ్ర వర్ణంగా బ్రాహ్మణులకు వైదిక కాలం నుంచి కూడా ఒక ప్రత్యేకత సంతరించుకుంటూ వస్తోంది. కాలానుగుణంగా వస్తున్న మార్పుల్లో ఇతర వర్ణాల వారు, కులాల వారు, జ్ఞాన సముపార్జన విషయంలో బ్రహ్మణులతో పోటీ పడి నెగ్గుకొస్తున్నప్పటికీ, సాంప్రదాయిక వైదిక విద్యతో పాటు అధునీక విద్య, సాంకేతిక, నైపుణ్యతలో కూడా బ్రాహ్మణులు ఇప్పటికి తమకంటూ ఒక ప్రత్యెకత కలిగి ఉన్నారు. మాతృదేశంలోనే కాదు ఇస్లాం సంప్రదాయక గల్ఫ్ అరబ్బు దేశాల్లో కూడా తెలుగు బ్రాహ్మణులు తమ ప్రతిభ, నైపుణ్యత, వృత్తి పట్ల అంకితభావం కారణంగా ప్రవాసంలోనూ రాణిస్తూ మరో వైపు సంప్రదాయక హైందవ పండుగలు ఇతర కార్యక్రమాల్లో తమ వైదిక జ్ఞానం ద్వారా వాటి ప్రాముఖ్యతను మరింత పెంచడంతో పాటు ప్రవాసంలోని భావి తరాలకు చాటి చెబుతూ ఆదరణలు అందుకుంటున్నారు.\


ఈ క్రమంలో కార్తీక మాసం సందర్భంగా గల్ఫ్ దేశాల్లో తెలుగు బ్రాహ్మణులు తమ ప్రత్యేకతను చాటుకుంటున్నారు. శివకేశవులకు ప్రీతిపాత్రమైన ఉసిరి, రావి, తులసి, జమ్మి వంటి దేవతా వృక్షాల వద్ద వనభోజనాలు, ఉసిరి కాయలతో దీపారాధన వంటివి భారతావనిలోని అనేక పట్టణాల్లో సైతం కనుమరుగైపోతున్న నేటి కాలంలో ఎక్కడో అరబ్బు నాట దుబాయి నేలపై తెలుగు బ్రహ్మణులు కార్తీక మాస వన భోజనాల కార్యక్రమాన్ని నిర్వహించారు.

KARTHIKA-MASAM-6.jpg


దుబాయితో పాటు అన్ని ఏమిరేట్లలో సనాతనం, సంఘటితం, సత్సంగం , సహకారం, సత్సంబంధం అనే పంచ సూత్రాల ఆధారంగా తెలుగు బ్రహ్మణులు నెలకోల్పిన గాయత్రీ కుటుంబం అనే ప్రవాసీ సంఘం అధ్వర్యంలో వనసమారాధన ఆధ్యంతం కన్నులపండువగా జరిగింది. గాయత్రి మహిళల భక్తి గీతాలు, దీపాధనలతో ప్రారంభం అయిన కార్యక్రమాలు పిల్లలు పెద్దల ఆత్మీయ పలకరింపులు, పాటలు, కేరింతలతో ఆహ్లాదకరమైన వాతావరణంలో కొనసాగాయి. సంప్రదాయ తెలుగు రుచుల కార్తిక వనభోజనాల సందర్భంగా జరిగిన ధార్మిక ప్రశ్నావళి, ఆటలు, తంబోల, కామేశ్వర రావు హాస్యభరిత సందేశం, ఆదిభట్ల కామేశ్వర శర్మ ఉపదేశాలు అందరినీ ఆకట్టుకున్నాయి. ఈ సందర్భంగా ప్రముఖ సాహితీవేత్తలైన ఆదిభట్ల కామేశ్వర శర్మ, కామవరపు లక్ష్మి కామేశ్వర రావు, పారిశ్రామికవేత్త నేమాని వెంకట రమేష్, సామాజికవేత్త పాలగుమ్మి సుబ్బారావులకు గాయత్రి కుటుంబం తరఫున ఆత్మీయ సన్మానం చేసి జ్ఞాపికలను బహూకరించారు.ఈ సందర్భంగా కల్లేపల్లి కుమార్ చంద్రశేఖర్ ఆకస్మిక మృతి పట్ల సభ్యులు ప్రగాఢ సహానుభూతి ప్రకటించి నివాళులు అర్పించారు.

KARTHIKA-MASAM-7.jpg

Updated Date - Nov 21 , 2024 | 03:06 PM