Share News

Israel Iran Tensions: ఇరాన్- ఇజ్రాయెల్ మధ్య యుద్ధం జరగనుందా.. అక్కడి ఎంత మంది భారతీయులున్నారు

ABN , Publish Date - Aug 03 , 2024 | 03:25 PM

ఇజ్రాయెల్‌లో ప్రస్తుతం ఉద్రిక్త పరిస్థితులు కొనసాగుతున్నాయి. వివాదాలు తీవ్రమవుతున్న నేపథ్యంలో ఇజ్రాయెల్‌(Israel)లోని భారతీయ పౌరులకు భారత రాయబార కార్యాలయం భద్రతా సలహాను జారీ చేసింది. భారతీయ పౌరులందరూ(indian people) అప్రమత్తంగా ఉండాలని, భద్రతా ప్రోటోకాల్‌లకు కట్టుబడి ఉండాలని తెలిపింది.

Israel Iran Tensions: ఇరాన్- ఇజ్రాయెల్ మధ్య యుద్ధం జరగనుందా.. అక్కడి ఎంత మంది భారతీయులున్నారు
indian embassy

ఇజ్రాయెల్‌లో ప్రస్తుతం ఉద్రిక్త పరిస్థితులు కొనసాగుతున్నాయి. వివాదాలు తీవ్రమవుతున్న నేపథ్యంలో ఇజ్రాయెల్‌(Israel)లోని భారతీయ పౌరులకు భారత రాయబార కార్యాలయం భద్రతా సలహాను జారీ చేసింది. భారతీయ పౌరులందరూ(indian people) అప్రమత్తంగా ఉండాలని, భద్రతా ప్రోటోకాల్‌లకు కట్టుబడి ఉండాలని. దేశంలో అనవసర ప్రయాణాలకు దూరంగా ఉండాలని సూచించింది. టెల్ అవీవ్‌లోని భారత రాయబార కార్యాలయం(indian embassy) ప్రకారం నవంబర్ 2023లో సంఘర్షణ ప్రారంభమైనప్పుడు ఇజ్రాయెల్‌లో భారతీయుల జనాభా 18,000 ఉండగా, ఆగస్టు 2024 నాటికి సుమారు 26,000కి పెరిగింది.


అధికారులతో

ఎంబసీ పరిస్థితిని నిశితంగా పర్యవేక్షిస్తోందన్నారు. పౌరులందరి భద్రతను నిర్ధారించడానికి ఇజ్రాయెల్(Israel) అధికారులతో క్రమం తప్పకుండా సంప్రదిస్తున్నట్లు తెలిపారు. ఈ క్రమంలో అత్యవసర పరిస్థితుల్లో ఎంబసీ టెలిఫోన్ హెల్ప్‌లైన్ నంబర్‌లను సంప్రదించాలని కోరారు. ఎంబసీ రెండు 24×7 హెల్ప్‌లైన్ నంబర్‌లను అందించింది. +972-547520711, +972-543278392. ఇది కాకుండా ఇమెయిల్ చిరునామాతో పాటు cons1.telaviv@ ఏదైనా అత్యవసర పరిస్థితుల్లో 24X7 సహాయం కోసం mea.gov.in అందుబాటులో ఉంటుందని తెలిపారు.


హత్యకు గురైన క్రమంలో

ఇజ్రాయెల్, లెబనాన్ మధ్య ఉద్రిక్తతలు పెరుగుతున్న తరుణంలో ఈ సలహాను జారీ చేశారు. టెహ్రాన్‌లో హమాస్ నాయకుడు ఇస్మాయిల్ హనియెహ్ హత్యకు గురైన క్రమంలో ఇరాన్ సుప్రీం లీడర్ అయతుల్లా అలీ ఖమేనీ ఇజ్రాయెల్‌పై ప్రత్యక్ష దాడికి ఆదేశించాడు. దీంతో ఇరాన్- ఇజ్రాయెల్ మధ్య మరో యుద్ధం జరుగుతుందనే భయాలు క్రమంగా పెరుగుతున్నాయి. జులైలో గాజాలో జరిగిన వైమానిక దాడిలో హమాస్ మిలటరీ వింగ్ చీఫ్ మహ్మద్ దీఫ్ మరణించారు. దీంతో ఇరు ప్రాంతాల మధ్య ఉద్రిక్త పరిస్థితులు మరింత పెరిగాయాని చెప్పవచ్చు.


కఠిన శిక్షలు

జులై 30 సాయంత్రం ఇజ్రాయెల్ వైమానిక దాడిలో హిజ్బుల్లా కమాండర్ ఫువాద్ షుకర్, నాయకుడు హసన్ నస్రల్లా మరణించారు. ఆగస్టు 1న ఇజ్రాయెల్ కూడా జులైలో గాజాలో వైమానిక దాడిలో హమాస్ సైనిక విభాగం అధిపతి మహమ్మద్ డీఫ్ మరణించినట్లు ధృవీకరించింది. దీనిపై స్పందించిన ఇరాన్‌ సుప్రీం లీడర్‌ అయతుల్లా అలీ ఖమేనీ ఈ హత్యలకు కఠిన శిక్షలు ఉంటాయని హెచ్చరించారు. ఈ క్రమంలో ఉత్తర ఇజ్రాయెల్‌పై హిజ్బుల్లా రాకెట్లను ప్రయోగించారు. జులై 30న హిజ్బుల్లా ఉత్తర ఇజ్రాయెల్‌పై రాకెట్లను ప్రయోగించింది. ఇజ్రాయెల్-హమాస్ వివాదం కారణంగా ఎయిర్ ఇండియా ఆగస్టు 8 వరకు టెల్ అవీవ్‌కు బయలుదేరే అన్ని విమానాలను నిలిపివేసింది.


ఇవి కూడా చదవండి:

School Time: గూగుల్ నుంచి 'స్కూల్ టైమ్' ఫీచర్.. రీల్స్ చూస్తే ఇకపై..


Display Replacement: ఈ వినియోగదారులకు ఫ్రీ డిస్‌ప్లే రీప్లేస్‌మెంట్‌.. క్రేజీ ఆఫర్ ప్రకటించిన సంస్థ..

Trending Stock: ఇన్వెస్టర్ల పంట పండింది.. ఏడాదిలో 77% లాభాలను ఇచ్చిన షేర్లు..

Read More international News and Latest Telugu News

Updated Date - Aug 03 , 2024 | 03:35 PM