Share News

NRI: కెనడాలో అంగరంగ వైభవంగా నోవా మల్టీఫెస్ట్-2024 వేడుకలు..

ABN , Publish Date - Aug 06 , 2024 | 12:54 PM

కెనడా దేశంలో నోవా మల్టీఫెస్ట్ -2024 వేడుకలు అంగరంగ వైభవంగా నిర్వహించారు. హాలిఫాక్స్ డార్ట్‌మౌత్ నగరంలో భారతీయ సంస్కృతి, సంప్రదాయాలను ఘనంగా ప్రదర్శించారు. ముఖ్యంగా భారతీయ నృత్యాలు, యుద్ధ కళలు, సంగీతాన్ని విదేశీయులకు రుచి చూపించారు. కెనడా వాసులు సైతం మన సంప్రదాయ దుస్తుల్లో కనిపించి అందరినీ ఆశ్చర్యపరిచారు.

NRI: కెనడాలో అంగరంగ వైభవంగా నోవా మల్టీఫెస్ట్-2024 వేడుకలు..

కెనడా దేశంలో నోవా మల్టీఫెస్ట్ -2024 వేడుకలు అంగరంగ వైభవంగా నిర్వహించారు. హాలిఫాక్స్ డార్ట్‌మౌత్ నగరంలో భారతీయ సంస్కృతి, సంప్రదాయాలను ఘనంగా ప్రదర్శించారు. ముఖ్యంగా భారతీయ నృత్యాలు, యుద్ధ కళలు, సంగీతాన్ని విదేశీయులకు రుచి చూపించారు. కెనడా వాసులు సైతం మన సంప్రదాయ దుస్తుల్లో కనిపించి అందరినీ ఆశ్చర్యపరిచారు. దేశ సంస్కతి, సంప్రదాయాలను ప్రపంచ వేదికపై ప్రదర్శించిన మన తెలుగు వారు మరోసారి ఔరా అనిపించారు.NRI-2.jpg


నోవా మల్టీఫెస్ట్ -2024 వేడుకలను సీఈవో జోసెఫ్, విశాల్ భరద్వాజ్ బృందం ఘనంగా ప్రారంభించారు. ఈ కార్యక్రమానికి 27,000మందికి పైగా హాజరయ్యారు. ముఖ్యంగా కెనడా దేశస్థులు, స్థానిక భారతీయులు పెద్దఎత్తున పాల్గొన్నారు. తెలంగాణ రాష్ట్రం తరఫున శ్రీమతి శ్రీహరిరెడ్డి చల్లా కార్యకలాపాలను నిర్వహించారు. శ్రీహరి బృంద సభ్యులు సురేశ్ ప్రియాంక, శ్రీలేఖ, చంద్ర శ్రీలేఖ, మిలింద్, శ్రీకాంత్, రోహిత్, సోను, ప్రదీప్ సౌజన్య, ఆస్తా, కృష్ణవేణి, రత్నం, శ్యామల, సాత్వికి, కావ్య భారతీయ సంస్కృతిని కెనడా వేదికగా ప్రదర్శించారు.

NRI-3.jpg


విదేశీయులను మంత్రముగ్ధులను చేసిన కార్యక్రమాలు..

NRI-4.jpg

కూచిపూడి, భరతనాట్యం, యుద్ధ కళలు, సంగీతం ప్రదర్శించిన మన తెలుగు బృందం కెనడా వాసులను మంత్రముగ్ధులను చేశారు. భారతదేశంలోని వివిధ రాష్ట్రాలను ప్రతిబింబించేలా ఫ్యాషన్ షోలు సైతం ఘనంగా నిర్వహించారు. భారతీయ దుస్తుల స్టాల్స్, ఆహార స్టాల్ ఏర్పాటు చేసి మన తెలుగు రుచులు వారికి రుచి చూపించారు. ఏ దేశ మేగినా ఎందు కాలిడినా, పొగడరా నీ తల్లి భూమి భారతమాతని, నిలుపర నీ జాతి నిండు గౌరవాన్ని అంటూ ఏడేళ్ల లోపు చిన్నారులు భారతీయ నృత్యం, శాస్త్రీయ సంగీతం ప్రదర్శించి తెలుగువాళ్ల చరిత్రను వారికి తెలియజేశారు. శిబి కర్రసాము ప్రదర్శించగా, హర్ష లైట్ మ్యూజిక్ పాడారు. అలాగే జనని భారతనాట్యం చేయగా, సంగీత ఒడిసి, ఆరాధ్య కూచిపూడి నృత్యం ప్రదర్శించారు. హాలిఫాక్స్‌లోని భారతీయులందరికీ ఈ కార్యక్రమం కనులవిందు చేసిందనే చెప్పాలి. ఇతర సంస్కృతుల ప్రజలు కూడా మన తెలుగువారు ప్రదర్శించిన కళలు చూసి ఎంతో ఆనందించారు.

Updated Date - Aug 06 , 2024 | 12:58 PM