నెల్లూరులో భారీ వర్షాలు.. ప్రజల ఇక్కట్లు..
ABN, Publish Date - Dec 04 , 2024 | 11:21 AM
నెల్లూరు: ఫెంగల్ తుఫాన్ ప్రభావం ఇంకా వీడలేదు. భారీ వర్షాలు కురవడంతో నెల్లూరు జిల్లాలో రోడ్లపై నీరు ప్రవహించింది. ఉత్తర తమిళనాడు పరిసరాల్లో ఉన్న వాయుగుండం మరింత బలహీనపడి సోమవారం తీవ్ర అల్పపీడనంగా మారింది. సముద్రం నుంచి భారీగా తేమ భూ ఉపరితలంపైకి రావడంతో కోస్తాంధ్ర, రాయలసీమల్లో అనేకచోట్ల వర్షాలు, అక్కడక్కడ భారీ వర్షాలు కురిశాయి. నెల్లూరు నగరంలో కురిసిన వానకు రోడ్లు జలమయం అయ్యాయి.
Updated at - Dec 04 , 2024 | 11:21 AM