లక్ష్మీనరసింహస్వామిని దర్శించుకున్న సీఎం రేవంత్ రెడ్డి

ABN, Publish Date - Nov 08 , 2024 | 01:28 PM

యాదాద్రి: ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తన జన్మదినం సందర్బంగా కుటుంబసభ్యులతో కలిసి స్వయంభూ శ్రీ లక్ష్మీనరసంహస్వామి యాదగిరి గుట్టకు వచ్చారు. ప్రధాన దేవాలయంకు కుటుంబ సమేతంగా చేరుకున్న ఆయనకు ఆలయ అర్చకులు పూర్ణ కుంభంతో స్వాగతం పలికారు. అనంతరం రేవంత్ రెడ్డి స్వామివారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్బంగా అర్చకులు సీఎంకు తీర్థప్రసాదాలు అందజేశారు. తర్వాత యాదాద్రి అభివృద్ధిపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సమీక్ష సమావేశం నిర్వహించారు.

లక్ష్మీనరసింహస్వామిని దర్శించుకున్న సీఎం రేవంత్ రెడ్డి 1/7

యాదాద్రి స్వయంభూ శ్రీ లక్ష్మీనరసంహస్వామి

లక్ష్మీనరసింహస్వామిని దర్శించుకున్న సీఎం రేవంత్ రెడ్డి 2/7

యాదగిరిగుట్ట ప్రధాన దేవాలయంకు చేరుకున్న సీఎం రేవంత్ రెడ్డికి పూర్ణ కుంభంతో స్వాగతం పలికిన ఆలయ ప్రధాన అర్చకులు...

లక్ష్మీనరసింహస్వామిని దర్శించుకున్న సీఎం రేవంత్ రెడ్డి 3/7

స్వామివారిని దర్శించుకునేందుకు ఆలయంలోపలకు వెళుతున్న సీఎం రేవంత్ రెడ్డి, మంత్రులు కోమటిరెడ్డి, పొన్నం ప్రభాకర్, ఉత్తమ్ కుమార్ రెడ్డి తదితరులు.

లక్ష్మీనరసింహస్వామిని దర్శించుకున్న సీఎం రేవంత్ రెడ్డి 4/7

స్వామివారి దర్శనానంతరం సీఎం రేవంత్ రెడ్డి, మంత్రులకు వేద ఆశీర్వచనం అందజేస్తున్న ఆలయ అర్చకులు..

లక్ష్మీనరసింహస్వామిని దర్శించుకున్న సీఎం రేవంత్ రెడ్డి 5/7

ఆలయం వద్ద అఖండ దీపారాధన చేస్తున్న సీఎం రేవంత్ రెడ్డి, మంత్రులు..

లక్ష్మీనరసింహస్వామిని దర్శించుకున్న సీఎం రేవంత్ రెడ్డి 6/7

తోపులాటలో మధ్యలో మంత్రి కొండా సురేఖ...

లక్ష్మీనరసింహస్వామిని దర్శించుకున్న సీఎం రేవంత్ రెడ్డి 7/7

తూర్పు గోపురం వద్ద పోలీసులు-కార్యకర్తల మధ్య తోపులాట

Updated at - Nov 08 , 2024 | 01:28 PM