Share News

ABN Big Debate Live Updates : సీఎం అయ్యాక రేవంత్ రెడ్డితో ఏబీఎన్ ఎక్స్ క్లూజివ్ ఇంటర్వ్యూ

ABN , First Publish Date - Jan 06 , 2024 | 04:59 PM

ABN Big Debate With CM Revanth Reddy : తెలంగాణలో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చాక.. ఎనుముల రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత తొలిసారిగా ‘ఏబీఎన్-ఆంధ్రజ్యోతి’కి ఇంటర్వ్యూ ఇస్తున్నారు. ఇన్నాళ్లు రేవంత్ రెడ్డి మీడియా ముందుకు వచ్చిన సందర్భాలు దాదాపు లేవనే చెప్పాలి. పైగా పోటా పోటీగా తెలుగు ప్రముఖ చానెల్స్, దినపత్రికలు ఇంటర్వ్యూల కోసం పోటీ పడినప్పటికీ.. ఎన్నికల ముందు ‘బిగ్ డిబేట్‌’లో ఇచ్చిన మాట ప్రకారం కాంగ్రెస్ అధికారంలోకి వచ్చాక రేవంత్ రెడ్డి ఇంటర్వ్యూ ఇచ్చారు..

ABN Big Debate Live Updates : సీఎం అయ్యాక రేవంత్ రెడ్డితో ఏబీఎన్ ఎక్స్ క్లూజివ్ ఇంటర్వ్యూ

Live News & Update

  • 2024-01-06T17:20:00+05:30

    రేవంత్ బిగ్ డిబేట్ ప్రారంభం

    • ఏబీఎన్‌తో రేవంత్ రెడ్డి తొలిసారి ఇంటర్వ్యూ

    • సీఎం అయ్యాక మొదటి ఇంటర్వ్యూ ఏబీఎన్‌కే ఇచ్చిన రేవంత్

    • ఎన్నికలకు ముందు బిగ్ డిబేట్‌లో తొలి ఇంటర్వ్యూ ఏబీఎన్‌కేనని మాటిచ్చిన సీఎం

    • నాడు ఎంపీగా.. నేడు సీఎంగా ఏబీఎన్‌కు బిగ్ డిబేట్‌కు వచ్చిన రేవంత్ రెడ్డి

  • 2024-01-06T17:15:00+05:30

    తెలంగాణలో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చాక.. ఎనుముల రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత తొలిసారిగా ‘ఏబీఎన్-ఆంధ్రజ్యోతి’కి ఇంటర్వ్యూ ఇస్తున్నారు. ఇన్నాళ్లు రేవంత్ రెడ్డి మీడియా ముందుకు వచ్చిన సందర్భాలు దాదాపు లేవనే చెప్పాలి. పైగా పోటా పోటీగా తెలుగు ప్రముఖ చానెల్స్, దినపత్రికలు ఇంటర్వ్యూల కోసం పోటీ పడినప్పటికీ.. ఎన్నికల ముందు ‘బిగ్ డిబేట్‌’లో ఇచ్చిన మాట ప్రకారం కాంగ్రెస్ అధికారంలోకి వచ్చాక రేవంత్ రెడ్డి ఇంటర్వ్యూ ఇచ్చారు. బిగ్ డిబేట్ అంటేనే తెలుగు రాష్ట్రాల్లో ఒక టాప్ ప్రోగ్రామ్.. అలాంటిది ఇక రేవంత్ రెడ్డి తొలిసారి ఇంటర్వ్యూ ఇస్తే ఇక.. డిబేట్ ఏ రేంజ్‌లో ఒక్కసారి ఊహించుకోండి. రేవంత్‌తో ఏబీఎన్ ఎండీ వేమూరి రాధాకృష్ణ డిబేట్ అనేసరికి ఎప్పుడెప్పుడు ప్రారంభం అవుతుందా..? కోట్లాది మంది జనాలు, ప్రపంచ వ్యాప్తంగా ఉన్న చానెల్ ప్రేక్షకులు ప్రోగ్రామ్ కోసం శనివారం ఉదయం నుంచే టీవీలు, యూట్యూబ్‌కు అతుక్కుపోయారు.

    Revanth-Big-Debate.jpg

    రండి.. రారండి.. చూసేయండహో..!

    ఏబీఎన్ బిగ్ డిబేట్‌లో కొత్త సీఎం ఏమేం మాట్లాడుతారు..? ఏబీఎన్ ఎండీ ఆర్కే ఏమేం ప్రశ్నలు సంధిస్తారు..? సీఎం ఎలాంటి సమాధానాలు ఇస్తారని తెలుగు ప్రజలు ఎదురుచూపుల్లో ఉన్నారు. అంతేకాదు.. తెలంగాణ మంత్రులు, మాజీ మంత్రులు సైతం ఈ ఇంటర్వ్యూ కోసం వేచి చూస్తున్న పరిస్థితి. ఇక ఆంధ్రప్రదేశ్‌ గురించి డిబెట్‌లో ఎలాంటి ప్రశ్నలు రాబోతున్నాయి..? ముఖ్యంగా సీఎం వైఎస్ జగన్ రెడ్డి గురించి ఎలాంటి ప్రశ్నలు.. ఆర్కే అడుగుతారు..? అని వైసీపీ వీరాభిమానులు, కార్యకర్తలు ఎదురుచూస్తున్నారు. మరీ ముఖ్యంగా.. అసలు కాంగ్రెస్‌కు గెలుపునకు దోహదపడిందేంటి..? రేవంత్ రెడ్డినే సీఎంగా ఎందుకు హైకమాండ్ ఎందుకు చేసింది..? తెలంగాణ ఎన్నికల్లో కాంగ్రెస్ దిగ్విజయ యాత్ర ఎలా సాగింది..?. ప్రజల మద్దతు సాధించడంలో కాంగ్రెస్ ఎలా సక్సెస్ అయ్యింది?. కేసిఆర్‌కు ప్రత్యామ్నాయంగా ప్రజలు రేవంత్ రెడ్డిని ఎందుకు భావించారు?. రేవంత్ నేతృత్వంలో నెలరోజుల కాంగ్రెస్ పాలన ఎలా ఉంది?. ప్రజల ఆకాంక్షలను నెరవేర్చే దిశగా రేవంత్ రెడ్డి పరిపాలన సాగుతోందా?. ప్రజలకు హామీ ఇచ్చినట్టు ఆరు గ్యారంటీలను వందరోజుల్లో అమలు చేయగలరా?. తెలంగాణ అప్పుల్లో ఉందంటున్న రేవంత్ సర్కార్ ఎలా నెట్టుకొస్తుంది?. పార్టీలో ప్రభుత్వంలో సీనియర్ నాయకులు రేవంత్‌కు సహకరిస్తున్నారా?. కేంద్రంలో అధికారంలో ఉన్న మోదీ సర్కారుతో సంబంధాలపై రేవంత్ వ్యూహమేంటి?. కాంగ్రెస్ పాలనపై తొలిరోజు నుంచే దాడి మొదలుపెట్టిన బీఆర్ఎస్‌కు రేవంత్ కౌంటర్ ఏంటి?. బీఆర్ఎస్ పాలనలో జరిగిన అవినీతి సంగతేంటో చూసేందుకు రేవంత్ సిద్ధమయ్యారా?. కేసీఆర్ కుటుంబం అవినీతిని కక్కిస్తానన్న రేవంత్ దర్యాప్తు జరిపిస్తారా? అనే ప్రశ్నలతో పాటు వందల ప్రశ్నలకు బిగ్ డిబేట్‌లో సమాధానాలు దొరకనున్నాయి. ఇక ఆలస్యమెందుకు ఇదిగో డిబేట్ ఇక్కడే చూసేయండి..