Share News

Big Debate : రేవంత్ ఇంటర్వ్యూ కోసం పోటాపోటీ.. ఇచ్చిన మాట కోసం ఏబీఎన్‌కే ఫస్ట్

ABN , Publish Date - Jan 06 , 2024 | 01:58 PM

ABN Big Debate With CM Revanth Reddy : తెలంగాణలో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చి.. ఎనుముల రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేశాక ఇంతవరకూ ఎక్కడా ఇంటర్వ్యూ ఇవ్వలేదు. తెలుగు రాష్ట్రాల్లోని ప్రముఖ టీవీ ఛానెల్స్, పేరుగాంచిన దినపత్రికలు.. ఆఖరికి ఢిల్లీ పర్యటనలో ఉన్నప్పుడు జాతీయ మీడియా కూడా రేవంత్ ఇంటర్వ్యూ కోసం పోటీ పడ్డాయి. కానీ సీఎం మాత్రం ఏ ఒక్కరికీ ఇంటర్వ్యూ ఇవ్వలేదు..

Big Debate : రేవంత్ ఇంటర్వ్యూ కోసం పోటాపోటీ.. ఇచ్చిన మాట కోసం ఏబీఎన్‌కే ఫస్ట్

తెలంగాణలో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చి.. ఎనుముల రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేశాక ఇంతవరకూ ఎక్కడా ఇంటర్వ్యూ ఇవ్వలేదు. తెలుగు రాష్ట్రాల్లోని ప్రముఖ టీవీ ఛానెల్స్, పేరుగాంచిన దినపత్రికలు.. ఆఖరికి ఢిల్లీ పర్యటనలో ఉన్నప్పుడు జాతీయ మీడియా కూడా రేవంత్ ఇంటర్వ్యూ కోసం పోటీ పడ్డాయి. కానీ సీఎం మాత్రం ఏ ఒక్కరికీ ఇంటర్వ్యూ ఇవ్వలేదు. ఎన్నికలకు ముందు దమ్మున్న ‘ఏబీఎన్ ఆంధ్రజ్యోతి’ బిగ్ డిబేట్ వేదికగా కాంగ్రెస్ గెలిచాక.. ఏబీఎన్‌కే తొలి ఇంటర్వ్యూ ఇస్తానని మాటిచ్చారు. ఇచ్చిన మాట ప్రకారం రేవంత్ రెడ్డి ఏబీఎన్‌కే తొలి ఇంటర్వ్యూ ఇవ్వబోతున్నారు. ఏబీఎన్ సంస్థల ఎండీ వేమూరి రాధాకృష్ణ.. రేవంత్ రెడ్డిని బిగ్ డిబేట్ చేయబోతున్నారు. అంటే.. ఎన్నికల ముందు బిగ్ డిబెట్‌కు కేవలం ఎంపీగా గన్‌మెన్లతో మాత్రమే వచ్చిన రేవంత్.. ఇప్పుడు కాన్వాయ్, భారీ భద్రత మధ్య రాబోతున్నారు. బిగ్ డిబేట్ చూసేందుకు ఆలస్యమెందుకు సాయంత్రం 7 గంటలకు సిద్ధంగా ఉండండి.

Updated Date - Jan 06 , 2024 | 01:59 PM