Share News

TG News: ప్రసూతి ఆస్పత్రుల్లో పిల్లల డాక్టర్ల కొరత

ABN , Publish Date - May 19 , 2024 | 04:09 PM

మహానగరంలోని ప్రభుత్వ ప్రసూతి ఆస్పత్రుల్లో పిల్లల వైద్యులు (పీడియాట్రిషన్లు) లేక గర్భిణులు, కుటుంబ సభ్యులు అనేక అవస్థలు పడుతున్నారు.

TG News: ప్రసూతి ఆస్పత్రుల్లో పిల్లల డాక్టర్ల కొరత
child doctors

  • నిలోఫర్‌ లే దా గాంధీకి తరలింపు

  • బాలింతలు, కుటుంబీకుల అవస్థలు

  • అప్పుడే పుట్టిన శిశువుల్లో పలు రుగ్మతలు

  • పిల్లల విభాగాల్లేని పలు ప్రసూతి ఆస్పత్రులు

  • ఏరియా ఆస్పత్రుల్లోనూ ఇదే పరిస్థితి

  • అత్యవసర సమయంలో పరుగులు

హైదరాబాద్‌ సిటీ, మే 19 (ఆంధ్రజ్యోతి): మహానగరంలోని ప్రభుత్వ ప్రసూతి ఆస్పత్రుల్లో పిల్లల వైద్యులు (పీడియాట్రిషన్లు) లేక గర్భిణులు, కుటుంబ సభ్యులు అనేక అవస్థలు పడుతున్నారు. ప్రసవం తర్వాత పిల్లలకు ఏదైనా అపాయం కలిగితే చూసేందుకు డాక్టర్లు అందుబాటులో లేకపోవడంతో ఇతర ఆస్పత్రులకు పరుగులు తీయాల్సిన దుస్థితి. నగరంలో నాలుగు పెద్ద ప్రసూతి ఆస్పత్రులు, అయిదు ఏరియా మెటర్నిటీ ఆస్పత్రులు, మరో ఆరు ప్రాంతీయ ఆస్పత్రులు ఉన్నాయి. వీటిలో రెండు పెద్ద ఆస్పత్రులు మినహా ఎక్కడా పిల్లల వైద్యులు లేరు. ప్రసూతి ఆస్పత్రిల్లో పుట్టిన బిడ్డకు వెంటనే పిల్లల వైద్యుడు చికిత్స అవసరం ఉంటుంది. కానీ ప్రసూతి ఆస్పత్రుల్లో పుట్టిన శిశువుకు అపాయం ఉంటే ఉరుకులు పరుగుల మీద నిలోఫర్‌, గాంధీ ఆస్పత్రులకు తరలించాల్సి వస్తుంది.


పుట్టిన బిడ్డకు పరీక్షలు తప్పనిసరి

ప్రసూతి ఆస్పత్రిలో అప్పుడే పుట్టిన శిశువులకు పిల్లల వైద్యుడు చేత తప్పని సరిగ్గా పరీక్షలు చేయించాలి. ఏవైనా అనారోగ ఇబ్బందులు ఉన్నాయా పరిశీలించాలి. అంతే కాకుండా అవసరమైతే అత్యవసర చికిత్స అందించాలి. కానీ ప్రసూతి ఆస్పత్రిలో శిశువులకు వైద్యం చేసే మేరకు వైద్యులు అందుబాటులో ఉండడం లేదు. ఏదైనా సందర్భంలో అత్యవసర వైద్యం కావాలంటే నిలోఫర్‌, గాంధీ ఆస్పత్రులకు తరలించాల్సిందే. రోజుకు 30 నుంచి 40 వరకు ప్రసవాలు జరిగే ప్రభుత్వ ప్రసూతి ఆస్పత్రుల్లో 24 గంటల పాటు అందుబాటులో పిల్లల వైద్యులు ఉండడం లేదు. దీంతో అస్వస్థతతో ఉన్న శిశువులను పుట్టిన వెంటనే తల్లి ఒడికి కూడా చేర్చకుండా మరో ఆస్పత్రికి తరలించాల్సి వస్తోంది. నగరంలోని ప్రసవం చేసే రెండు పెద్దాస్పత్రుల్లో కూడా ఇదే పరిస్థితి. పలు చోట్ల డాక్టర్లు ఉదయం వచ్చి మధ్యాహ్నం వెళ్లిపోతుండడంతో పిల్లలను చికిత్స కోసం మరో చోటకు తరలించాల్సిన పరిస్థితి.


ప్రాథమిక ప్రసూతి ఆస్పత్రిలోనూ..

నగరంలో లాలాపేట, పానీపుర, శ్రీరాంనగర్‌, జంగమెంట్‌, అంబర్‌పేటల్లోని ప్రసూతి ఆస్పత్రుల్లో కూడా ఇదే తీరు. ఇక్కడ రోజుకు 30 నుంచి 50 వరకు ప్రసవాలు జరుగుతాయి. ఇక మలక్‌పేట, కింగ్‌కోఠి, గోల్కండ, శాలిబండ, బార్కస్‌, నాంపల్లిలోని ఏరియా ఆస్పత్రుల్లో కూడా నిత్యం పదుల సంఖ్యలో ప్రసవాలు జరుగుతుంటాయి. ఇక్కడ కూడా ఒక పిల్లల వైద్యుడు లేరంటే అతిశయోక్తి కాదు. పిల్లలు జన్మించిన సమయంలో అనేక ఆరోగ్య సమస్యలను ఎదుర్కొంటారు. కొందరు ఉమ్మనీరు మింగి పుడతారు. మరికొందరికి గుండె సమస్యలు, పచ్చకామెర్లు రావడం, తక్కువ బరువు, పాలు తాగడకపోవడం, కళ్లు తెరకవడం, శరీరక అవయవాలు సరిగ్గా లేకపోవడం తదితర అనేక సమస్యలు పుట్టిన సమయంలో బిడ్డకు ఎదురవుతాయి. ఈ సమస్యలను కేవలం పిల్లల వైద్యుడు మాత్రమే పసిగట్టగలడు. ఇక ఈ ప్రసూతి ఆస్పత్రుల్లో అర్ధరాత్రి పూట జన్మించే పిల్లలకు వైద్యం దొరకడం చాలా కష్టం మారింది. ఈ సమయంలో వారిని కనీసం నిలోఫర్‌కు తీసుకుపోవడానికి సరైన సదుపాయలు కూడా ఉండటం లేదు. దీంతో పిల్లల తల్లిదండ్రులు, కుటుంబ సభ్యులు నానా అవస్థలు పడుతున్నారు.


ఈ వార్తలు కూడా చదవండి..

సీఎం జగన్‌పై జేడీ లక్ష్మీనారాయణ కీలక వ్యాఖ్యలు

భర్తపై దాడి.. భార్య ప్రతీకారం..

కొడాలి నాని పంచాల్సిన డబ్బులు కొందరు దోచేశారంటూ..

తమిళనాడులో ‘రెడ్ అలర్ట్’ జారీ

ఏపీ ప్రభుత్వం సంచలన నిర్ణయం..

ఇదంతా బురదే కదా అనుకుంటే పొరపాటే..

Read Latest AP News and Telugu News

Read Latest Telangana News and National News

Read Latest Chitrajyothy News and Sports News

Updated Date - May 19 , 2024 | 04:47 PM