Share News

Fake News: వైసీపీ చీప్ పాలిటిక్స్.. ‘ఆంధ్రజ్యోతి’ స్ట్రాంగ్ వార్నింగ్.. తస్మాత్ జాగ్రత్త!

ABN , Publish Date - Feb 02 , 2024 | 03:01 PM

YSRCP Fake News: ‘ఇంతకుమించి దిగజారవు అనుకున్న ప్రతిసారీ.. యూ ప్రూవ్‌ మీ రాంగ్..’ అనే సినిమా డైలాగ్ గుర్తుందా..? ఈ డైలాగ్ వైసీపీకి అచ్చుగుద్దినట్లుగా సరిపోతుందేమో..!. ఎందుకంటే.. ఫేక్‌లు సృష్టించడంలో వైసీపీ పీహెచ్‌డీ చేసేసింది.!. ఒకటా రెండా రోజుకొకటి ఏదో ఒక రూమర్ క్రియేట్ చేయడం పరిపాటిగా మారిపోయింది..

 Fake News: వైసీపీ చీప్ పాలిటిక్స్.. ‘ఆంధ్రజ్యోతి’ స్ట్రాంగ్ వార్నింగ్.. తస్మాత్ జాగ్రత్త!

‘ఇంతకుమించి దిగజారవు అనుకున్న ప్రతిసారీ.. యూ ప్రూవ్‌ మీ రాంగ్..’ అనే సినిమా డైలాగ్ గుర్తుందా..? ఈ డైలాగ్ వైసీపీకి అచ్చుగుద్దినట్లుగా సరిపోతుందేమో..!. ఎందుకంటే.. ఫేక్‌లు సృష్టించడంలో వైసీపీ పీహెచ్‌డీ చేసేసింది.!. ఒకటా రెండా రోజుకొకటి ఏదో ఒక రూమర్ క్రియేట్ చేయడం పరిపాటిగా మారిపోయింది. ఆంధ్రప్రదేశ్‌లో త్వరలో జరగనున్న సార్వత్రిక ఎన్నికల్లో టీడీపీ-జనసేన కలిసి పోటీ చేస్తున్న సంగతి తెలిసిందే. ఇప్పటి వరకూ దాదాపు అన్ని సర్వేలు టీడీపీ-జనసేనదే అధికారం అని తేల్చేశాయి. ఇందుకు మొట్ట మొదటి కారణం.. ‘ఒకే ఒక్క ఛాన్స్ ప్లీజ్’ అని వేడుకున్న వైఎస్ జగన్ రెడ్డికి అవకాశం ఇచ్చి ప్రజలు నానా తిప్పలు పడటమే. అధికారంలోకి వచ్చిన నాటి నుంచి అవినీతి, అరాచకాలు తప్ప.. ఉద్యోగాలు, అభివృద్ధి ఎక్కడా కనిపించట్లేదు. దీంతో రాష్ట్ర ప్రజలు విసిగిపోయారు. సరిగ్గా ఈ క్రమంలోనే పలు సర్వే సంస్థలు ఏపీ ప్రజల నాడి ఎలా ఉంది..? ఎవరివైపు ప్రజలు ఉన్నారు..? అని సర్వేలు చేయడంతో టీడీపీ-జనసేన కూటమివైపే ఉన్నట్లు తేలిపోయింది. దీంతో టీడీపీ, జనసేనను ఎలాగైనా చీల్చాలని.. కలిసుంటే అసలుకే ఎసరు వస్తుందని వైసీపీ అడ్డమైన పనులన్నీ చేసుకుంటూ వెళ్తోంది.


kadapa-chandrababu.jpg

ఇంత దారుణమా..?

టీడీపీ-జనసేన అభ్యర్థుల విషయంలో అధినేతలు చంద్రబాబు, పవన్ కల్యాణ్ కసరత్తు చేస్తున్నారు. దాదాపు అభ్యర్థులు ఫిక్స్ అవ్వగా.. ఒకట్రెండు రోజుల్లో ప్రకటన వచ్చేయనుంది. దీంతో ప్రజలను ఏదో ఒక విధంగా డైవర్ట్ చేయడానికి వైసీపీ, పార్టీకి సంబంధించిన సోషల్ మీడియా చేయాల్సిన ప్రయత్నాలన్నీ చేస్తోంది. ఈ క్రమంలో దమ్మున్న ‘ఆంధ్రజ్యోతి’ పేరిట చిత్రవిచిత్రాలుగా కథనాలు మార్ఫింగ్ చేస్తూ వైసీపీ కార్యకర్తలు కొందరు సోషల్ మీడియాలో వైరల్ చేస్తు్న్నారు. ఆంధ్రజ్యోతికి ఎలాంటి సంబంధం లేని కథనాన్ని ఫొటో షాప్‌లో ఎడిట్ చేసి.. ‘జనసేనకు 64 సీట్లు’ అంటూ ఫేక్ న్యూస్ ప్రచారం చేసింది. ఈ విషయం ‘ఆంధ్రజ్యోతి’ యాజమాన్యం దృష్టికి రావడంతో ఇలాంటి ఫేక్ వార్తలు పుట్టిస్తే కఠిన చర్యలు తప్పవని స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చింది. అంతేకాదు.. లీగల్‌గా తగిన చర్యలు తీసుకుంటామని కూడా హెచ్చరించింది. ఈ హెచ్చరికలతో కొందరు కార్యకర్తలు తమ సోషల్ మీడియా అకౌంట్లలో నుంచి ఫేక్ ప్రచారానికి సంబంధించిన పోస్టులను డెలీట్ కూడా చేశారు. చూశారుగా.. ఎంత దారుణంగా ఉందో వైసీపీ.. ఆ పార్టీకి సంబంధించిన సోషల్ మీడియా.

Pawan-Kalyan.jpg

తాట తీస్తాం.. జాగ్రత్త!

కాగా.. ఇప్పుడు వైరల్ అవుతున్న ‘ఆంధ్రజ్యోతి’ డేట్ లైన్ స్థానంలో పలు ప్రముఖ దినపత్రికల పేర్లు మార్చి వైరల్ చేస్తుండటం గమనార్హం. ఇలా చేయడంతో ఒక్క ‘ఆంధ్రజ్యోతి’లోనే కాదు.. అన్ని ప్రధాన పత్రికల్లో ఇదే వార్త వచ్చిందని చెప్పుకోవడానికి ఇలా పైత్యం ప్రదర్శిస్తున్నారు కొందరు వైసీపీ కార్యకర్తలు. తస్మాత్ జాగ్రత్త.. మిగిలిన యాజమాన్యాల సంగతేమో కానీ.. ఆంధ్రజ్యోతి మాత్రం ఎవర్నీ వదిలిపెట్టదు.. వదిలే ప్రసక్తే లేదు. ఇప్పటికే కొందరు ఇలా ‘ఆంధ్రజ్యోతి’, ‘ఏబీఎన్-ఆంధ్రజ్యోతి’, ‘ఆంధ్రజ్యోతి.కామ్’ పేరిట చేస్తున్న ఫేక్ వార్తలకు తగిన మూల్యం చెల్లించుకున్నారు. అందుకే సోషల్ మీడియా ఏదైనా వైరల్ చేసేటప్పుడు ఒకటికి పదిసార్లు నిశితంగా పరిశీలించి.. ఒళ్లు దగ్గరపెట్టుకుని పోస్టు చేయాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఎవరైనా ఇలాంటి ఇలాంటి పేపర్ క్లిప్పింగ్‌లు వాట్సాప్, ట్విట్టర్, ఫేస్‌బుక్ ఇతరత్రా మాద్యమాల ద్వారా షేర్ చేసినా.. వాటి జోలికి వెళ్లకుంటేనే ఇంకా మంచిది.

ఫేక్ ప్రచారం ఇదే..

Fake-News-on-ABN.jpg


ఇవి కూడా చదవండి


AP Politics: అనిల్ స్థానంలో ‘సిటీ’ నుంచి పోటీ చేసేదెవరు.. వైఎస్ జగన్ ఒప్పుకుంటారా..!?


AP Politics: రోజా ఒంగోలు ఎంపీగా పోటీచేస్తే.. ‘నగరి’ పరిస్థితేంటి.. ఇక్కడ్నుంచి పోటీ ఎవరు..!?


YSRCP: మాకొద్దు బాబోయ్.. అని దండం పెట్టిన అలీ, వినాయక్.. తెరపైకి సుమన్!


Updated Date - Feb 02 , 2024 | 03:08 PM