Share News

Viral News: సింగిల్ బెడ్ రూం అద్దె నెలకు రూ. 70 వేలు.. ఎక్కడో తెలుసా

ABN , Publish Date - Jun 10 , 2024 | 12:22 PM

దేశంలోని ప్రధాన మెట్రో నగరాల్లో అద్దె ఇళ్ల ధరలు(rents) బారీగా పెరుగుతున్నాయి. ఇప్పటికే ఇటివల బెంగళూరు(bengaluru) నగరంలో పెద్ద ఎత్తున కిరాయిలు ఉన్నాయని చెబుతుండగా, తాజాగా దేశ ఆర్థిక రాజధాని ముంబయి(Mumbai)లో కూడా ఇదే పరిస్థితి నెలకొంది. ఈ విషయాన్ని ఓ యువతి సోషల్ మీడియా ఎక్స్ వేదికగా పంచుకున్నారు. ఈ ట్వీట్ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

Viral News: సింగిల్ బెడ్ రూం అద్దె నెలకు రూ. 70 వేలు.. ఎక్కడో తెలుసా
1BHK single bedroom mumbai

దేశంలోని ప్రధాన మెట్రో నగరాల్లో అద్దె ఇళ్ల ధరలు(rents) బారీగా పెరుగుతున్నాయి. ఇప్పటికే ఇటివల బెంగళూరు(bengaluru) నగరంలో పెద్ద ఎత్తున కిరాయిలు ఉన్నాయని చెబుతుండగా, తాజాగా దేశ ఆర్థిక రాజధాని ముంబయి(Mumbai)లో కూడా ఇదే పరిస్థితి నెలకొంది. ఈ విషయాన్ని ఓ యువతి సోషల్ మీడియా ఎక్స్ వేదికగా పంచుకున్నారు. వృత్తిరీత్యా న్యాయవాది, ముంబయి నివాసి అయిన వీటా ముంబయిలో రియల్ ఎస్టేట్ ధరలు వేగంగా పెరుగుతున్నాయని పేర్కొన్నారు. ఇక్కడ అద్దె కూడా బాగా పెరుగుతుందని, అంధేరీ, బాంద్రా వంటి ప్రాంతాల్లో చిన్న 1 బీహెచ్‌కే ఫ్లాట్‌ అద్దె రూ. 50 నుంచి 70 వేల వరకు ఉందని పేర్కొన్నారు.


అనేక కార్యాలయాలు ఈ ప్రాంతంలోనే ఉన్నాయని, ఇప్పుడు స్వతంత్రులమనే పేరుతో తల్లిదండ్రులతో సంబంధాలు చెడగొట్టుకోవద్దని అందరికీ సూచించారు. మీరు మీ కుటుంబంతో మాత్రమే ఉండాలి. ముంబయిలో అద్దెకు(rent) ఫ్లాట్ పొందడం చాలా కష్టమైన పని. మీరు సంపాదించిన డబ్బు కూడా ఇందులో వృథా అవుతుంది. మీ తల్లిదండ్రులతో మంచి సంబంధాలను కొనసాగించండి. ఇంటికి దూరంగా ఉండాలనే తొందర వద్దు. స్వతంత్ర జీవితాన్ని ఆస్వాదించడానికి ఇంటి నుంచి పారిపోవాల్సిన అవసరం లేదు. జీతంనుంచి ఇంత ఖరీదైన ఫ్లాట్ కొనడం చాలా కష్టం అని రాసుకొచ్చారు. ఆమె చేసిన ఈ పోస్ట్ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.


ఈ పోస్ట్ చూసిన నెటిజన్లు ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఈ పోస్ట్‌కి లక్షకు పైగా వీక్షణలు వచ్చాయి. ఈ క్రమంలోనే పలువురు ముంబయి(Mumbai)లోని తక్కువ అద్దె ఉన్న ప్రాంతాల గురించి ప్రజలు చెప్పడం ప్రారంభించారు. వాటిలో మలాడ్, గోరేగావ్ ఉన్నాయని వెల్లడించారు. ఇక్కడ రూ. 25 వేలకే ఫ్లాట్ లభిస్తుందన్నారు. అయితే వీటాకు ఈ సలహా నచ్చలేదు. తనకు ప్రయాణం చేయడం ఇష్టం లేదని, ఆఫీసు దగ్గర నివసించడం ఇష్టమని ఆమె వెల్లడించారు.


ఇవి కూడా చదవండి..

Viral Video: వామ్మో.. దోమలకు ఎలా రక్తం ఇస్తున్నాడో చూడండి.. వీడియో చూసి షాకవుతున్న నెటిజన్లు!


Viral Video: వామ్మో.. ఇదెలా జరిగింది? కారులో ఒంటె ఇలా ఇరుక్కుపోయిందేంటి? వైరల్ అవుతున్న వీడియో!


మరిన్ని ప్రత్యేక వార్తలు కోసం క్లిక్ చేయండి..

Updated Date - Jun 10 , 2024 | 12:25 PM