Share News

Viral Video: 6 మామిడిపండ్లకు రూ. 2400, కిలో కాకరకాయ రూ. 1000

ABN , Publish Date - Jun 24 , 2024 | 11:50 AM

నిత్యవసరాల ధరలు మార్కెట్లో భగ్గుమంటున్నాయి. అవునండీ బాబు. కిలో కాకారకాయ ధర ఏకంగా రూ.1000గా ఉంది. కేజీ బెండకాయ ధర రూ. 650. మ్యాగీ ప్యాకెట్ ధర రూ.300. ఇలా అనేక రకాల కిరాణా వస్తువులు, కురగాయల ధరలు భారీగా పెరిగాయి. అయితే ఈ రేట్లు ఉన్నది మాత్రం ఇండియాలో కాదు. అయితే ఈ రేట్లు ఎక్కడనేది ఇక్కడ తెలుసుకుందాం.

Viral Video: 6 మామిడిపండ్లకు రూ. 2400, కిలో కాకరకాయ రూ. 1000
6 Mangoes At rs 2,400 Bhindi At rs 650 Per Kg

నిత్యవసరాల ధరలు(Grocerie rates) మార్కెట్లో భగ్గుమంటున్నాయి. అవునండీ బాబు. కిలో కాకారకాయ(bitter gourd) ధర ఏకంగా రూ.1000గా ఉంది. కేజీ బెండకాయ ధర రూ. 650. మ్యాగీ ప్యాకెట్ ధర రూ.300. ఇలా అనేక రకాల కిరాణా వస్తువులు, కురగాయల ధరలు భారీగా పెరిగాయి. అయితే ఈ రేట్లు ఉన్నది మాత్రం ఇండియాలో కాదు. బ్రిటన్‌లో(britain) ఈ ధరలు ఉన్నాయి. ఈ క్రమంలోనే లండన్‌(london)లో ఉన్న ఓ ఢిల్లీకి చెందిన భారత సంతతి యువతి భారతీయ కిరాణా వస్తువుల ధరలు ఎలా ఉన్నాయో వీడియోలో చూపించారు.


వీడియోలో ఛవీ అగర్వాల్ లండన్‌(London)లో ఉన్నట్లు పేర్కొన్నారు. ఆమె ఇన్‌స్టాగ్రామ్ ఫాలోవర్లకు బ్రిటిష్ రాజధానిలోని భారతీయ కిరాణా వస్తువులు, ఆహారాలకు సంబంధించిన రేట్ల గురించి వివరించారు. ఉదాహరణకు భారతదేశంలో(bharat) రూ. 20 ఉన్న ఉండే లేస్ ప్యాకెట్‌ను లండన్‌లో రూ. 95కి విక్రయిస్తున్నట్లు తెలిపారు. దీంతోపాటు వంటకాల్లో నిత్యావసరమైన పనీర్ రూ.700, అల్ఫోన్సో మామిడికాయలు ఆరింటికి రూ. 2,400 పలుకుతున్నాయని తెలిపారు. పొట్లకాయ ధర కిలో రూ.1,000 అని పేర్కొన్నారు.


ఈ వీడియోను జూలై 6న ఇన్‌స్టాగ్రామ్‌లో(instagram) పోస్ట్ చేయగా ప్రస్తుతం సోషల్ మీడియా(social media)లో వైరల్‌గా మారింది. వీడియో(viral video) ఇప్పటికే ఇన్‌స్టాగ్రామ్‌లో 5.8 మిలియన్లకు పైగా వీక్షణలను పొందింది. ఈ ధరలు చూసిన నెటిజన్లు షాక్ అవుతున్నారు. ఇది చూసిన పలువురు లండన్‌లో కాకరకాయ వ్యాపారం ప్రారంభిద్దామని కామెంట్లు చేస్తున్నారు. బ్రిటిషర్లు ఇంకా మనల్ని దోచుకుంటున్నారని మరో వ్యక్తి కామెంట్ చేశాడు. అయితే మీరు పౌండ్లలో(pounds) సంపాదిస్తారు, పౌండ్లలో ఖర్చు చేస్తారు. ఇవి ఖరీదైనదని చెప్పకండని ఇంకో వ్యక్తి చెప్పడం విశేషం.


ఇవి కూడా చదవండి..

Viral Video: ఈ టెక్నిక్ తెలియక ఎంత కష్టపడ్డాం.. పుచ్చకాయ నుంచి గింజలను ఎంత సులభంగా తీసేసిందో చూడండి..!


Optical Illusion: కళ్లు చెదిరిపోయే ఈ ఆప్టికల్ ఇల్యూజన్ ఫొటోలో కారు ఎక్కడుందో 15 సెకెన్లలో కనిపెట్టండి..!


మరిన్ని ప్రత్యేక వార్తలు కోసం క్లిక్ చేయండి

Updated Date - Jun 24 , 2024 | 11:55 AM