Share News

Viral: 73 ఏళ్ల భార్యకు ఈ పెద్దాయన ఎలాంటి గిఫ్ట్ ఇచ్చాడో చూడండి.. వైరల్ వీడియో

ABN , Publish Date - May 03 , 2024 | 06:04 PM

నిజమైన వైవాహిక బంధానికి ప్రతీకగా నిలుస్తున్న ఓ వృద్ధ దంపతుల వీడియో వైరల్‌ అవుతోంది. భార్య 73వ పుట్టిన రోజు నాడు ఆమెకు ఇష్టమైన మొక్కను భర్త బహుమతిగా ఇవ్వడం చూసి జనాలు మురిసిపోతున్నారు.

Viral: 73 ఏళ్ల భార్యకు ఈ పెద్దాయన ఎలాంటి గిఫ్ట్ ఇచ్చాడో చూడండి.. వైరల్ వీడియో
78 old man gifts to 73 year old wife

ఇంటర్నెట్ డెస్క్: నిజమైన బంధాలు బాంధవ్యాలు కనుమరుగవుతున్న కాలం ఇది. డేటింగ్ కల్చర్‌లో పడ్డ యువత దీర్ఘకాలిక బంధాల మాధుర్యానికి దూరమవుతున్నారు. ఇలాంటి టైంలో నెట్టింట వైరల్ (Viral) అవుతున్న ఓ వీడియో జనాలకు విపరీతంగా నచ్చేసింది. ఈ వీడియోలో వృద్ధదంపతుల అనుబంధాన్ని ప్రత్యక్షంగా చూసిన నెటిజన్లు వారికి జై కొడుతున్నారు. అసలైన ప్రేమ అంటే ఇదే అని చెబుతున్నారు.

Viral: తన గదిలో దెయ్యాలు ఉన్నాయని బాలిక గోలపెడుతున్నా తల్లిదండ్రులు పట్టించుకోలేదు! చివరకు..

ఇంగ్లండ్‌కు చెందిన జో కియో, జేన్ దంపతులదని సుసంపన్నమైన జీవితం. జీవితమంతా తన వెంటే నడుస్తున్న తన భార్య 73వ పుట్టినరోజున ఆమెకు ఏదైనా మరిచిపోలేని బహుమతి ఇద్దామని జో భావించాడు. జేన్‌కు జపనీస్ చెర్రీ బ్లాసమ్ మొక్క అంటే ఎంతో ఇష్టం. అందుకే జో ఆ మొక్కను తీసుకొచ్చి తమ ఇంటి పెరట్లో పాతాడు. పుట్టిన రోజునాడు భార్యకు ఆ మొక్కను చూపించి సర్‌ప్రైజ్ చేశాడు. దీంతో, జేన్ ఆనందానికి అంతేలేకుండా పోయింది. మా బంధానికి గుర్తు ఇది అని ఆయన చెప్పుకొచ్చారు (78 year old mans thoughtful surprise for wife).


ఇక నెట్టింట ఈ వీడియో చూసిన నెటిజన్లు ఆ దంపతుల ప్రేమను చూసి మురిసిపోతున్నారు. ఈ కాలం వాళ్లకు తెలీని బంధం ఇది అని కొందరు కామెంట్ చేశారు. ఇలాంటి బంధంలో జీవించడం నిజంగా అదృష్టమే అంటూ కొందరు కామెంట్ చేశారు. ఇలా రకరకాల కామెంట్ల మధ్య వీడియో వైరల్‌గా మారింది.

Read Viral and Telugu News

Updated Date - May 03 , 2024 | 06:09 PM