Viral Video: పామును పళ్లెంలో పెట్టి రుద్రాభిషేకం.. బుసలు కొడుతున్న పాము చుట్టూ కూర్చుని పూజలు.. వీడియో వైరల్!
ABN , Publish Date - May 07 , 2024 | 11:26 AM
హిందూ సాంప్రదాయం ప్రకారం పామును పూజిస్తారు. నాగుల చవితి రోజు పుట్ట దగ్గరకు వెళ్లి పాలు పోసి దండం పెట్టుకుంటారు. మరికొందరు నాగదోషం అంటూ పాములకు ప్రత్యేకంగా పూజలు కూడా చేస్తుంటారు. అయితే ఆయా సందర్భాల్లో పాములు మాత్రం ప్రత్యక్షంగా కనబడవు.
హిందూ సాంప్రదాయం ప్రకారం పామును (Snake) పూజిస్తారు. నాగుల చవితి రోజు పుట్ట దగ్గరకు వెళ్లి పాలు పోసి దండం పెట్టుకుంటారు. మరికొందరు నాగదోషం అంటూ పాములకు ప్రత్యేకంగా పూజలు కూడా చేస్తుంటారు. అయితే ఆయా సందర్భాల్లో పాములు మాత్రం ప్రత్యక్షంగా కనబడవు. కానీ, ప్రస్తుతం వైరల్ అవుతున్న ఓ వీడియో (Snake Video) చూస్తే షాకవ్వాల్సిందే. ఎందుకంటే బతికి ఉన్న పామును మధ్యలో పెట్టుకుని ఓ కుటుంబం పూజలు చేసింది. ఆ వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది (Viral Video).
omkar_sanatanii అనే ట్విటర్ హ్యాండిల్‌లో ఈ వీడియో షేర్ అయింది. వైరల్ అవుతున్న ఆ వీడియోలో బతికి ఉన్న పాము ప్లేట్‌లో చుట్ట చుట్టుకుని కూర్చొని ఉంది. ఈ పళ్లెం చుట్టూ దంపతులతో పాటు అనేక మంది భక్తులు కూర్చుకుని ఉన్నారు. దానిని పూజిస్తున్నారు (Puja to Live snake). పండితుడు ఆ పాముకు రుద్రాభిషేకం చేస్తున్నాడు. ఆ సమయంలో ఆ పాము చుట్టూ చూస్తూ తనను పూజిస్తున్న వ్యక్తిని కాటేయడానికి ప్రయత్నించింది. అయినా ఆ వ్యక్తి భయపడకుండా పూజ కొనసాగించాడు. ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.
ఆ వైరల్ వీడియోకు కోటికి పైగానే వ్యూస్ వచ్చాయి. 10 లక్షల మందికి పైగా ఈ వీడియోను లైక్ చేశారు. ఈ వీడియోపై నెటిజన్లు తమదైన శైలిలో స్పందిస్తున్నారు. ``అతని గట్స్ కు సెల్యూట్ చెయ్యాల్సిందే``, ``ఇది మూర్ఖత్వం``, ``ఇలాంటి బుర్ర తక్కువ పనుల వల్ల ఆ పాముకు, మనుషులకు కూడా ప్రమాదం``, ``ఇలా చేయమని ఎవరు చెప్పారు`` అంటూ నెటిజన్లు రకరకాల కామెంట్స్ చేస్తున్నారు.
ఇవి కూడా చదవండి..
Viral Video: తల్లి మనసు అలాగే ఉంటుంది.. పిల్లలను రక్షించుకునేందుకు ఓ నాగుపాము ఏం చేస్తోందో చూడండి..
Puzzle: ఈ పజిల్ మీ సామర్థ్యానికి పరీక్ష.. ఈ ఫొటోల్లోని మూడు ముఖ్యమైన తేడాలను కనిపెట్టండి!
మరిన్ని ప్రత్యేక వార్తలు కోసం క్లిక్ చేయండి..