Share News

Viral Video: ఫుట్‌బాల్ ఆడిన ఏనుగు..

ABN , Publish Date - Sep 02 , 2024 | 10:32 AM

థాయ్‌లాండ్‌లో గల ఎలిఫెంట్ న్యాచురల్ పార్క్‌లో ఓ పిల్ల ఏనుగు ఫుట్ బాల్ ఆడుతోంది. ముందరి కాళ్లతో బాల్‌ను తన్నుతోంది. పక్కనే ఉన్న తల్లి ఏనుగును ఆడాలని కోరుతుంది. దాని చుట్టూ తిరుగుతోంది. అయినప్పటికీ ఆ తల్లి ఏనుగు పట్టించుకోదు. తేలికపాటి జల్లులు కురుస్తోన్న పిల్ల ఏనుగు బాల్ ఆడింది.

Viral Video: ఫుట్‌బాల్ ఆడిన ఏనుగు..
Baby Elephant Trying To Play Football

తల్లి స్థానం ప్రత్యేకమైంది. కేవలం మనుషులే కాదు.. కొన్ని జంతువులకు పిల్లలపై వాత్సల్యం ఉంటుంది. అమితమైన ప్రేమను వ్యక్తం చేస్తుంటాయి. ఓ పిల్ల ఏనుగు (Elephant).. తల్లితో ఆడే వీడియో ఒకటి సోషల్ మీడియాలో ట్రోల్ అవుతోంది.


ఫుట్ బాల్ ఆడుతూ..

థాయ్‌లాండ్‌లో గల ఎలిఫెంట్ న్యాచురల్ పార్క్‌లో ఓ పిల్ల ఏనుగు ఫుట్ బాల్ ఆడుతోంది. ముందరి కాళ్లతో బాల్‌ను తన్నుతోంది. పక్కనే ఉన్న తల్లి ఏనుగును ఆడాలని కోరుతుంది. దాని చుట్టూ తిరుగుతోంది. అయినప్పటికీ ఆ తల్లి ఏనుగు పట్టించుకోదు. తేలికపాటి జల్లులు కురుస్తోన్న పిల్ల ఏనుగు బాల్ ఆడింది. ఆ క్రమంలో నీటి గుంటలో బాల్ పడింది. అందులోకి వెళ్లి మరి ఆడింది. ఆ వీడియోను లెక్ చైలర్ట్ ఇన్ స్టలో షేర్ చేశారు. తల్లితో కలిసి సాకర్ లీగ్‌లో వాన్ మై (పిల్ల ఏనుగు) ఆడాలని అనుకుంటోందని క్యాప్షన్ రాశారు. ఇంకేముంది ఆ వీడియో తెగ వైరల్ అవుతోంది. ఇప్పటికే లక్ష వ్యూస్ కూడా వచ్చాయి.


elephant-2.jpg


వావ్.. వండర్ ఫుల్

ఆ వీడియోకు చాలా మంది కామెంట్స్ చేశారు. వర్షంలో ఏనుగు ఆట చూసి చిన్నప్పటి రోజులు గుర్తొచ్చాయి. మనుషులే కాదు జంతువులు కూడా ఆటలు ఆడతాయని రుజువుయ్యిందని ఓ యూజర్ రాసుకొచ్చారు. ఆ ఏనుగు చక్కగా ఆడుతోంది. ఆనందంగా ఉండటం చూడొచ్చు. ఆ పిల్ల ఏనుగులో కూృరత్వం ఇసుమంతైన లేదని మరొకరు రాసుకొచ్చారు. ఆ వీడియో చూసి చాలా సంతోషంగా అనిపించిందని మరొకరు అభిప్రాయ పడ్డారు. ఏనుగులు కూడా ఆటలాడుతూ మంచి ధృక్పథంతో ఉంటాయా అని చాలామంది కామెంట్ చేశారు.


elephant-1.jpg

Updated Date - Sep 02 , 2024 | 10:32 AM